Saturday, 06 June 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

టిడిపి మహానాడు ... ఆత్మస్తుతి పరనింద ... !

29 May 2026
02:39 PM
100

* ఏమి చేశారో చెప్పుకోలేని దౌర్భాగ్యం...ఏమి చేయాలో క్లారిటీ లేని దుస్థితి...
* బాబు, లోకేష్ లు మగ  రాజకీయాలు చెయ్యాలి గానీ ...అడంగి రాజకీయాలు తగదు...
* కూటమి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసిన కమలాపురం వైసీపీ ఇన్ చార్జి నరేన్ రెడ్డి ..

కడప  : 

తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహనాడు ఆత్మస్తుతి పరనింద సామెతను తలపిస్తొందని,  రెండు రోజులు నిర్వహించిన కార్యక్రమంలో ఏమి చేశారో చెప్పుకోలేని దౌర్భాగ్యం...ఏమి చేయాలో క్లారిటీ లేని దుస్థితి అంటే  కూటమి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు కడప జిల్లా కమలాపురం వైసీపీ ఇన్ చార్జి నరేన్ రామాంజులరెడ్డి. కమలాపురంలో వెన్నుపోటుకు రెండేళ్లు పోస్టర్ రిలీజ్ చేసిన నరేన్ రామాంజులరెడ్డి మాట్లాడుతూ  టిడిపి మహానాడు వల్ల రాష్ట్ర ప్రజలకు గాని, పార్టీ నాయకులకు కార్యకర్తలకు గాని ఒరిగిందేమీ లేదన్నారు.  మహానాడు గురించి ఒక ముక్కలో చెప్పాలంటే ఆత్మస్తుతి పరనిందకే సరిపోయిందని,  మహానాడు రెండు రోజుల్లో 20% ఆత్మ స్తుతికి, 80% ప్రతిపక్ష పార్టీల పైన నిందలు మోపడానికే సరిపోయిందని విమర్శించారు.  మహానాడులో ప్రధాన అంశం మహిళని, కానీ మహిళలకు ఎన్నికల హామీలలో జగన్ కన్నా ఎక్కువ ఇస్తామని చెప్పి ఏమీ చేయలేదని, యువతకు పెద్దపీట వేస్తామన్నా...ఎటువంటి ప్రకటన లేదని మండిపడ్డారు.

Article Image

మహానాడులో వైయస్సార్  కాంగ్రెస్ పార్టీ పైన చేసిన తీవ్ర ఆరోపణలను ఖండిస్తున్నామని,  వైసీపీ ది గొడ్డలి పార్టీ అని టిడిపి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తొందని,  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అది పెద్ద కుటుంబమన్నారు.  ఆ కుటుంబంలో మంచి జరుగుతే వారి కష్టార్జితం అనడం, కీడు జరిగితే సూత్రధారి జగనేనని అనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్ ల  పుట్టుక మగ పుట్టుక అయితే మీకు మీసం ఉంటే మొగోడి రాజకీయం చేయాలి గానీ,  జగన్ ఎదుర్కోలేక ఆడంగి చేస్తున్నారని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. చంద్రబాబు జీవితమంతా మరొకరిపై నిందెలు వేయడమేనని,  తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు,  మొన్నటి వరకు నరేంద్ర మోడీపై విమర్శలు చేశారని గుర్తుచేశారు.  మొదట్లో పవన్ కళ్యాణ్ ను కూడా వదలని చంద్రబాబు, జగన్ ను ఎదుర్కొనే ధైర్యం లేక వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారన్నారు.

 ఆంధ్ర ప్రజలు కూటమి ప్రభుత్వ చిల్లర రాజకీయాలు గమనిస్తున్నారని, పార్టీలో ఎవరు తప్పు చేస్తే వారిని నిందించాలి తప్ప జగనే సూత్రధారి అనడం అవివేకమన్నారు. సమాజంలో భేదాభిప్రాయాలు సమస్యలు లేని కుటుంబాలు ఉన్నాయా అని ప్రశ్నించారు.   పని పాట లేని పేపర్లు పనిగట్టుకొని జగన్ పై తప్పుడు రాతలు రాస్తున్నాయని, శవాల మీద పేలాలు ఏరుకుంటూ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీసీపీ కుటుంబం కలిసి ఉండకూడదని ఆలోచిస్తుందన్నారు.  ఆ కుటుంబం పై వీరికి మాత్రమే ప్రేమ ఆప్యాయతలనట్లు నటిస్తున్నారని,  విజ్ఞత కలిగిన ప్రజలు కూటమి ప్రభుత్వం మాటలను అన్ని గమనిస్తున్నారన్నారు.  ఇచ్చిన హామీల నెరవేర్చక డైవర్టు పాలిటిక్స్ కు తెరలేపుతున్న కూటమి ప్రభుత్వం,  విజయమ్మకు నెంబర్ వన్ కుమారుడు వైఎస్ జగన్ అని, తల్లి మాటలు జవదాటని కొడుకు వైయస్ జగన్ అన్నారు.  సోనియా గాంధీ కే లాలూచీ పడని వ్యక్తి వైయస్ జగన్ అని,  లాలూచీ పడింటే ఆనాడే సీఎం జగన్ అయ్యేవాడన్నారు.  2014లో రాష్ట్ర ప్రజలకు వైఎస్ జగన్ అబద్ధాలు చెప్పలేదని, అబద్ధాలు చెప్పింటే ఆనాడే సీఎం అయ్యేవాడన్నారు.  వివేకా హత్య కేసులో ఒక్క శాతం కూడా జగన్ ప్రమేయం లేదని ఖరాకండిగా చెప్పారు. 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!