• తక్షణం కల్పించుకుని కొరతకు గల కారణాలపై విచారణ చేపట్టండి...
• కేంద్ర మంత్రిత్వ శాఖ సెక్రటరీ డాక్టర్ నీరజ్ మిట్టల్ దృష్టికి తీసుకెళ్లిన కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి...
• ఈ కృత్రిమ కొరత కారణంగా రైతులు, వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు...
• ప్రభుత్వ చర్యలతో ప్రజల్లో ఉన్న భయాన్ని పోగొట్టాలని వినతి...
Kadapa MP Complains to Centre Over Fuel Shortage in AP :
ఏపీలో ఇందన, గ్యాస్ కొరతను కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ తీవ్ర కొరత కారణంగా రైతులు, వాహనదారులు, ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందుల గురించి ఈ రోజు ఢిల్లీ లోని పెట్రోలియం, సహజ వాయువుల కేంద్ర మంత్రిత్వ శాఖ సెక్రటరీ డాక్టర్ నీరజ్ మిట్టల్ ను కలిసి తెలియజేస్తూ లేఖ అందజేశారు. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 70 శాతం పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టారని, ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లోనే పెట్రోల్, డీజిల్ కొరత రావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్న విషయాన్ని ఈ సందర్బంగా ఎంపీ అవినాష్‌రెడ్డి అయన దృష్టికి తీసుకెళ్లారు.

ఈ కొరత వల్ల రాష్ట్రంలో వ్యవసాయ, వ్యాపార వర్గాలతో పాటు అనేక రంగాలు ఇబ్బంది పడుతున్నాయని వెల్లడించారు. తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర వంటి పక్క రాష్ట్రాల్లో ఇలాంటి కొరతలేదని, ప్రజలకు మేలు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం..సరఫరాదారులతో కుమ్ముక్కై కృత్రిమ కొరతను సృష్టిస్తోందని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే కల్పించుకుని కొరతకు గల కారణాలపై విచారణ చేపట్టాలని కోరారు. ప్రజలకు కొరత లేకుండా పెట్రోల్, డీజిల్, గ్యాస్ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, వెంటనే కేంద్రం కల్పించుకుని ఇందన, గ్యాస్ కొరతపై చర్యలు తీసుకోవాలని లేఖలో విన్నవించారు. అంతేకాకుండా అన్ని రాష్ట్రాల్లో గ్యాస్, ఇందనాన్ని పూర్తి సామర్ధ్యంతో నిల్వ ఉంచాలని కేంద్రాన్ని కోరిన వైఎస్ అవినాష్ రెడ్డి.... ప్రభుత్వ చర్యలతో ప్రజల్లో ఉన్న భయాన్ని పోగొట్టాలని కోరారు. 