Sunday, 10 May 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / జాతీయ వార్తలు

తమిళనాడులో రికార్డు పోలింగ్ ....ఎవరికి లాభం.. ?

24 Apr 2026
01:44 PM
29

Astra desk  :

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు కావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా పలు రాష్ట్రాల రాష్ట్రాల్లో భారీ పోలింగ్ నమోదైతే అది అధికార వ్యతిరేకతకు సంకేతంగా రాజకీయ విశ్లేషకులు, పార్టీల నేతలు భావిస్తుంటారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఓటు వేశారంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటని, ప్రస్తుత పాలనలో మార్పు కోరుకుంటున్నారని భావిస్తుంటారు. అలానే ఇప్పుడు కూడా ప్రతిపక్ష AIADMK-BJP కూటమికి సానుకూల అంశంగా మారే అవకాశం ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

సంక్షేమ పథకాలపైనే DMK ఆశలు...ఎంత వరకు ఫలిస్తాయో...  :
ప్రస్తుత ఎన్నికల్లో భారీ పోలింగ్ తమకు అనుకూలమని అధికార DMK ధీమాగా ఉంది. తాము ప్రవేశపెట్టిన వినూత్న సంక్షేమ పథకాలు, ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నెలవారీ గౌరవ వేతనం వంటివి ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించాయని ఆ పార్టీ బలంగా నమ్ముతోంది. లబ్ధిదారులు కృతజ్ఞతతో ఓటు వేయడం వల్లే ఈ రికార్డు పోలింగ్ సాధ్యమైందని, ఇది తమను మళ్ళీ అధికార పీఠంపై కూర్చోబెడుతుందని సిఎం స్టాలిన్ వర్గం ఆశిస్తోంది.

యువత ఓటింగ్ మా వైపే... కింగ్ మేకర్‌గా TVK - విజయ్ ధీమా ?
ఈ ఎన్నికల్లో అందరి దృష్టి సినీ నటుడు విజయ్ ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీపైనే ఉంది. ఈ నేపథ్యంలో రికార్డు పోలింగ్‌లో యువత పాత్ర కీలకంగా ఉండటంతో, అది విజయ్ పార్టీకి ప్లస్ అవుతుందా అనే చర్చ నడుస్తోంది. TVK పార్టీ చీల్చే ఓట్లు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లా లేక DMK సంప్రదాయ ఓటు బ్యాంకా అనేది ఇప్పుడు గెలుపోటములను నిర్ణయించే ప్రధానాంశం. ఒకవేళ విజయ్ పార్టీ గణనీయమైన ఓట్లు సాధిస్తే, అది రాష్ట్రంలో త్రిముఖ పోరుకు దారితీసి ఫలితాలను తారుమారు చేసే అవకాశం ఉంది.

బిజేపి ఆశలు చిగురింపచేసినా ?... : 
తమిళనాడులో ఎలాగైన డిఎంకేను ఓడించాలన్నది బిజేపి లక్ష్యం. ఇందుకోసం AIADMK-BJP కూటమిగా పోటీ చేసింది. TVK పోటీతో డిఎంకే ఓట్లు చీలిక తమకు సానుకూల అంశంగా బిజేపి భావిస్తొంది. దక్షిణభారత సమస్యల విషయంలో కేంద్రానికి కొరకరానీ కొయ్యలా మారిన డిఎంకేను ఎలాగైనా ఈ సారి దెబ్భతియ్యాలన్నది బిజేపి టార్గెట్. 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!