Sunday, 10 May 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

నిత్యానంద రెడ్డి కి నా భర్తకు విభేదాలు లేవు..!

23 Apr 2026
03:06 PM
25

నిత్యానంద రెడ్డి కి నా భర్తకు విభేదాలు లేవు..!
* 100 కోట్ల డాక్యుమెంట్లు అనేది అవాస్తవం..
* మేము ఎవ్వరికి బినామి కాదు..
* కడపలో పెద్ద దస్తగిరి హత్యపై నిజాలు బయటపెట్టిన భార్య రమణమ్మ ....

కడప   : 
కడపలో ఈ నెల 6వ తేదీని హత్యకు గురైన వైసీపీ కార్యకర్త పెద్ద దస్తగిరి భార్య రమణమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలంఖాన్ పల్లెలో 5వతేదీ జాతర సందర్బంగా డిజే సాంగ్స్ వద్ద డ్యాన్స్ వేసే సందర్బంలో మా వాడితో గొడవ పడ్డారు. అనంతరం రాత్రి మా కుమారుడితో గొడవ పడిన వారు  కత్తులతో మా ఇంటి వద్ద కు కొంతమంది వచ్చి పిల్లల గొడవ పడ్డారు. అప్పుడు మేము వారిని మందలించాం. తరువాత రోజు వాళ్ళు మళ్ళీ గొడవకు వచ్చారు. ప్రాణాలు తీస్తారని తెలిసుంటే మా జాగ్రత్తో మేము ఉండేవాళ్లం. కత్తులతో దాడి చెయ్యడం వల్ల మా వాళ్లు గాయపడ్డారు. 108కు ఫోన్ చేస్తే గంటన్నర తరువాత వచ్చింది. మాకు రక్షణ కావాలని పోలీసులను అడగగా... ఇంటి వద్ద ఇద్దరిని రక్షణగా ఉంచారు. రిమ్స్ కు తీసుకెళ్తున్న గాయపడిన వారికి రక్షణగా మరో ఇద్దరు పోలీసులు వెళ్లారు. రిమ్స్ కు వెళ్లాకా రిమ్స్ లో మా వాళ్లపై కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. మా వాళ్లకు రక్షణగా వెళ్లిన పోలీసులు వారితో లేరు. అందువల్లే హత్య జరిగింది. 

నా భర్త దస్తగిరి 30 ఏళ్ళ నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. టిడిపి , వైసిపి వారితో ఇద్దరితో సన్నిహితంగా ఉండేవాడు. నా భర్త చనిపోయిన 9వ రోజు పోలీసులు వచ్చి మా ఇంట్లో ఉన్న డాక్యుమెంట్లు తీసుకునివెళ్ళారు. రాత్రి 10నుంచి 12 గంటల వరకు మా ఇంట్లో సోదాలు నిర్వహించారు. మా ఇంట్లో గంజాయి ఉందని వచ్చి డాక్యూమెంట్లు తీసుకుని వెళ్లారు. సోదాల అనంతరం పోలీసులు తీసుకెళ్లిన  వాటిలో 100 కోట్ల డాక్యుమెంట్లు అనేది అవాస్తవం. దస్తగిరి స్దలాలు కొని అమ్ముతుంటారు. మా భర్తతో కడప మాజీ డిప్యూటి మేయర్ నిత్యానంద రెడ్డి కి ఎలాంటి  విభేదాలు లేవు. మేము స్థలాలు అమ్మే సమయంలో కొంత మందిమి కలిసి బాగాలు పెట్టుకుని అమ్ముకుంటుంటామని, అమ్మమని మరికొంత మంది డాక్యూమెంట్లు ఇస్తుంటారు. అవన్నీ మా అస్తులని, వంద కోట్ల అస్తులని ఎలా అంటారు ? మేము ఎవ్వరికి బినామి కాదు.  నా భర్తను కిరాతకంగా చంపారు. పోలీసులు తీసుకుని వెళ్ళిన డాక్యుమెంట్ల తోనే మాకు జీవనాధారం . స్దలాలు అమ్మే వారికి సంబంథించిన  డాక్యుమెంట్లు ఉన్నాయి. వారు మా డాక్యుమెంట్లు మాకు ఇవ్వమని అడుగుతున్నారు. బయటి విషయాలు ఏ రోజు నాతో చెప్పలేదు .   

దస్తగిరి హత్యకు రియల్ ఎస్టేట్ వ్యాపారం కారణం కాదు.. మృతిని సోదరుడు చిన్నదస్దగిరి ..  :

Article Image

మా అన్న ను ఎవరో పెద్ద వ్యక్తే  హత్య చేయించారు.  జాతరలో జరిగిన గొడవ అయితే అన్ని కత్తీపోట్లు పొడుస్తారా  ? దస్తగిరి హత్యకు రియల్ ఎస్టేట్ వ్యాపారం కారణం కాదు. మేము ఎవరి బినామి కాదు . నిత్యానందరెడ్డికి , రవీంద్రనాధ్ రెడ్డికి ఎవరికీ బినామి కాదు. నిత్యానంద రెడ్డికి మాకు మద్య ఎలాంటి  విభేదాలు లేవు . టిడిపి , వైసిపి వారితో ఇద్దరితో రియల్ ఎస్టేట్ సంభందాలు ఉన్నాయి. మా అన్న నేను విడివిడిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాము. ఏ రోజు విభేదాల గురించి మా అన్న నాతో చెపులేదు. మా అన్న హత్య విషయంలో మాకు న్యాయం జరగాలి. 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!