* జగన్ చెప్పిన మావిగన్ థియరీపై సోషల్ మీడియాలో జోరుగా ట్రోలింగ్ ...
* కొత్తగా ఫ్లెక్సీల ఏర్పాటుతో మరింత ఉత్సాహం ...
అమరావతి :
ఇప్పుడు ఎవరి నోట విన్నా మావిగన్ ... మావిగన్... అన్న పదాలే వినిపిస్తున్నాయి. ఇటు వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రాజధాని అమరావతి విషయంలో కూటమిపై విమర్శలు చేస్తూ మావిగన్ పై తెగ ప్రచారం చేస్తుండగా...అటు కూటమి నేతలు మావిగన్ పేరుతో వైసీపీని విమర్శిస్తున్నారు. ఇరువురి విమర్శలు, ప్రతివిమర్శలతో మాట్లాడుకునే వారి నోట ఇదే మాటే వినిపడుతొంది. పల్లె, పట్టణం మొదలుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చ నడుస్తుంది.

ఇప్పుడు కొత్తగా ‘‘రావాలి జగన్..కావాలి జగన్..మన జగన్… రావాలి జగన్..కావాలి జగన్..మన జగన్….’’ అంటూ 2019 ఎన్నికలకు ముందు వైసీపీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈ పాట మార్మోగింది. జగన్ గెలుపునకు ఈ పాట ఎంతో దోహదం చేసిందని చాలా మంది నేతలు, రాజకీయ విశ్లేషకులు అంటుంటారు.
ఒక రాజకీయ పార్టీ ప్రచారం కోసం రూపొందించిన పాట యూట్యూబ్ లో రికార్డు స్థాయి వ్యూస్ కూడా సొంతం చేసుకోవడం మరో విశేషం. అందుకే …తమకు అచ్చొచ్చిన ఈ పాట పల్లవిని వైసీపీ శ్రేణులు మరోసారి వాడేందుకు రెడీ అయినట్లు కనిపిస్తోంది. అందుకే, ’‘రావాలి జ‘గన్’..కావాలి మావి‘గన్’..’’ అంటూ తాడేపల్లిలోని జగన్ ఇంటి ముందు భారీ సైజులో ఫ్లెక్సీలు వెలిశాయి. ఇప్పటికే నియోజకవర్గాల వారిగా చాలా మంది నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మావిగన్ వల్ల ప్రయోజనాలను, అమరావతి నిర్మాణం వల్ల నష్టాలను విడమరచి చెబుతున్నారు. దీంతో గడచిన నాలుగైదు రోజులుగా ఈ ప్రచారమే ఇప్పుడు హోరెత్తిపోతుంది.

జగన్ చెప్పిన మావిగన్ థియరీపై ఇటు ఓ వర్గం మీడియాలో, సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతోంది. అయితే, జగన్ చెప్పిన మావిగన్ థియరీని వైసీపీ నేతలు, కార్యకర్తలు సమర్థిస్తూ కౌంటర్లు కూడా ఇస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న మావిగన్ గురించి జగన్ మరోసారి మాట్లాడడంతో వైసీపీ శ్రేణులు మావిగన్ పై ప్రచారాన్ని నెక్స్ట్ లెవల్ కు తీసుకువెళ్లారు. రావాలి జగన్..కావాలి జగన్ పాట స్ఫూర్తితో రావాలి జగన్.. కావాలి మావిగన్ అంటూ క్యాచీ లైన్లతో ప్రజల్లోకి మావిగన్ ను తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.
మావిగన్ రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్ అని, మావిగన్ తోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని జనాలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నేతలు. అంతేకాదు ఏపీ బాగుండాలన్నా, త్వరగా డెవలప్ కావాలన్నా మావిగన్ కారిడార్ రావాల్సిందేనని, జగన్ సీఎం కావాల్సిందేనని ఫ్లెక్సీలు వెలిశాయి. లక్షల కోట్లు అప్పులు లేకుండా తక్కువ ఖర్చుతో 60 లక్షల జనాభాతో రెడీమేడ్ గా తయారయ్యే రాజధాని మావిగన్ అంటూ ఫ్లెక్సీలో పేర్కొన్నారు. ఈ ప్లెక్సీలు వెలిశాయో లేదో రాష్ర్ట వ్యాపితంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. చివరకు ఎబిఎన్ లోను, ఆంద్రజ్యోతిలో కొత్త పలుగులోను మహిళలను కించనరిచేలా రాసిన కథనాలపై వైసీపీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు, అర్కేపై కేసులు సైతం పెట్టే కార్యక్రమాలు చేపట్టింది. ఈ సందర్బంగా కూడా మావిగన్ పై విస్తుృత ప్రచారం చేశారు. మొత్తం మీద మావిగన్ ప్రచారంతో తక్కువ ఖర్చుతో రాజధాని నిర్మాణం, కూటమి రాజధాని పేరుతో చేస్తున్న అప్పుల వ్యవహారాన్ని ప్రజలకు విడమరచి చెప్పే అవకాశం లభించినట్లయ్యింది.