* కూటమిలో నన్ను ఇబ్బంది పెడుతున్నారు ...
* ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఉంది...
* రాజీనామా చేయాలని డిసైడ్ అయ్యా ..
* జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యల కలకలం ...
కడప :
కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి ఎదుటి వారిని టార్గెట్ చెయ్యడమే కానీ...తాను ఎవరికి అవకాశం ఇవ్వరు. అలాంటిది ఇప్పుడు అయనే ఏకంగా కూటమిలో నన్ను ఇబ్బంది పెడుతున్నారు...రాజీనామా చెయ్యాలని డిసైడ్ అయ్యాను అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కూటమిలో దుమారాన్ని రేపుతున్నాయి. అసలు ఈ వ్యాఖ్యలు చెయ్యడం వెనక అంతరార్ధం అయనకే తెలుసు కానీ మరెవ్వరికి తెలియదంటే అతిశయోక్తి కాదు.

ఇప్పటికే ఒక మారు తిరుపతిలో పార్టీ సమావేశంలో అయన చేసిన వ్యాఖ్యల కలకలం మరుగున పడకముందే ఇప్పుడు మరోమారు జమ్మలమడుగులో నిర్వహించిన పార్టీ ఆవిర్బావ దినోత్సవంలో తనను పార్టీ పరంగా ఇబ్బంది పెడుతున్నారని, ఈ కారణంగా తాను బాధపడుతున్నట్టు ఆయన బహిరంగ సభలో వాపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అది కూడా సొంత పార్టీలోనే సెగ పెడుతున్నారంటూ ప్రస్తావించారు. ఇందుకు ప్రధాన కారణం అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ చాపకింద నీరులా తనకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని ఆదినారాయణరెడ్డి , అయన వర్గీయులు చాలా కాలంగా అరోపిస్తు వస్తున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో సీఎం రమేశ్ కంపెనీ చేసే పనుల్ని తన వర్గీయులకు ఇప్పిచుకోవాలని ఆది ప్రయత్నించినా సాధ్యపడలేదు. దీంతో వ్యవహారం చాలా దూరం వెళ్లింది. సదరు కంపెనీ పనులు చేయకుండా అడ్డుకోవడం, సామాగ్రిని ధ్వంసం చెయ్యడం వరకూ వెళ్లాయి. ఈ నేపధ్యంలో జమ్మలమడుగులో అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయంటూ కడప కలెక్టర్కు ఎంపి సిఎం రమేశ్ ఫిర్యాదు చెయ్యడంతో తనపై, తన నియోజకవర్గంపై ఫిర్యాదు చెయ్యాల్సిన అవసరం తనకెందుకని ఆదినారాయణరెడ్డి బహిరంగంగానే ప్రశ్నించారు. ఇలా ఒకదానికొకటి తోడై, ఇరువురి మధ్య గ్యాప్ పెరుగుతు వచ్చింది. ఈ కారణంగానే ప్రభుత్వ పరంగా ఎంపి సిఎం రమేష్ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి చెక్ పెడుతూ వస్తున్నారన్న ప్రచారం సాగుతుంది.
ఈ క్రమంలో ఆ మధ్య తిరుపతిలో బిజేపి సమావేశంలో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కూటమి పాలన కమ్మగా వుందని, సిఎం అందరిని సమానంగా చూసుకోవాలని కామెంట్స్ చేయగా, ఆ కామెంట్స్ పెద్ద రాజకీయ దుమారాన్నే రేపాయి. రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ సమక్షంలోనే కమ్మని పాలనంటూ ఆదినారాయణరెడ్డి మాట్లాడంతో... ఏ కారణంగా అయన అలా మాట్లాడాల్సి వచ్చిందో అందరికి తెలిసిందే. దీంతో ఇంటి బయట ఒత్తిడి పెరగడంతో ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ స్వయంగా రంగంలోకి దిగి వివరణ ఇవ్వాలని ఆదేశించే వరకూ వెళ్లింది. వెళ్లినా ఎమ్మెల్యే ఆది మాత్రం డోంట్ కేర్ అన్నట్లుగానే వ్యవహరించారు. కానీ కూటమి పాలనపై ఆదినారాయణరెడ్డి లాంటి నేత విమర్శలు చెయ్యడాన్ని మాత్రం సిఎం చంద్రబాబునాయుడు సీరియస్ గానే తీసుకున్నారు. అయనను తన చాంబర్ కు పిలిపించుకుని మాట్లాడారు. సాధారణంగానే ఎవరైనా కూటమి పాలనపై గానీ, లోపాల్ని ఎత్తిచూపినా చంద్రబాబు జీర్నించుకోలేరన్నది అందరికి తెలిసిందే. అందువల్లే అయనను పిలిపించుకుని మాట్లాడారు. అప్పటితో ఎమ్మెల్యే ఆది వ్యవహారం సద్దుమణిగిందనుకున్నారు.
కానీ అటు తరువాత కూడా ప్రభుత్వ పరంగా ఎమ్మెల్యే ఆదికి పనులు సాగినట్లుగా లేవు. ఇందుకు కూడా ప్రధాన కారణంగా ఎంపి సిఎం రమేస్ అనే వాదన లేకపోలేదు. ఈ కారణంగానే తనను సొంత పార్టీ వారే సెగ పెడుతున్నారంటూ ఇప్పుడు ఎమ్మెల్యే ఆది ప్రస్తావించారు.ఎంపి సిఎం రమేష్ ఏ పార్టీలో ఉన్నా...సిఎం చంద్రబాబుకు మాత్రం సొంత మనిషిగానే పనిచేస్తారు. అందువల్లే తనకు పనులు కావడం లేదని, గండికోట, రాజోలి, ఎస్ఆర్బీసీ కెనాల్, అర్టీపీపీ ప్లాంటు సమస్యలు పరిష్కరించే వరకు కృషి చేస్తానని, కానీ తాను భావించినట్లు వ్యవస్థ సరిగ్గా లేకుంటే పార్టీలో ఉంటూ ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు సిద్దమని స్పష్టంగానే చెప్పారు.
మొత్తం మీద ప్రభుత్వం ఎమ్మెల్యే ఆది పనులు కాకపోవడం... నియోజకవర్గ సమస్యలకు పరిష్కారం లభించకపోవడం... కూటమిలో..ప్రత్యేకించి సొంత పార్టీలో వర్గవిభేధాలు వెరసి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని తీవ్రంగానే కలతచెందెలా చేశాని చెప్పవచ్చు. అయన ఎంతో మధనపడి ఉంటే కానీ తుంటే తప్ప రాజీనామా చేయడానికైనా సిద్ధమని, బాధపెడుతున్నారని బహిరంగంగా మాట్లాడరు. మరి ఈ మారు ప్రభుత్వ పెద్దలు ఎమ్మెల్యే ఆది వ్యాఖ్యలు తేలిగ్గా తీసుకుంటారా లేక పరిస్ధితిని చక్కబెట్టి సర్దుకుంటారా అన్నది కాలమే నిర్ణయించాలి.