Wednesday, 13 May 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

ఎపి రాజకీయ పార్టీల్లో ఫ్రస్ట్రేషన్‌ ఎవరికి .... ?

06 Apr 2026
02:37 PM
65

* నిన్నటి వరకూ రాష్ట్రానికి అడ్రస్ లేకుండా చేశారు.. 
* ఇప్పుడు అమరావతి రాజధాని అని గర్వంగా చెప్పుకునేలా చేశాం..!
* అనంతపురం యాడికి సభలో 'రాజధాని అమరావతి'పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!
* అమరావతి అని పలకడం ఇష్టంలేక, కొత్తగా ఇప్పుడు 'మావిగన్' అంటున్నారు..!
* 'రాజధానిలో అవినీతి' అంటూ ఫ్రస్ట్రేషన్‌లో మాట్లాడుతున్నారంటూ ఫైర్ ...

అనంతపురం  : 

ఏపీ రాజధానిగా అమరావతి అసెంబ్లీ, పార్లమెంట్ లో చట్టబద్ధత పొందిన అనంతరం మరోమారు సిఎం చంద్రబాబునాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లా యాడికిలో నిర్వహించిన 'నీటి భద్రత - సాగునీటి సంఘాల బాధ్యత' సభలో చంద్రబాబు ఈ కీలక వ్యాఖ్యలు చేస్తూ ప్రతిపక్ష వైసీపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిన్నటి వరకు రాష్ట్రానికి అడ్రస్ లేకుండా చేశారు.. ఇప్పుడు అమరావతి రాజధాని అని గర్వంగా చెప్పుకునేలా చేశామంటూ వ్యాఖ్యానించారు. ప్రజా రాజధాని అమరావతి చట్టబద్ధతకు పార్లమెంట్‌లో ఒకే ఒక్క దిక్కుమాలిన పార్టీ మద్దతు తెలపలేదు అంటూ ఇటు అసెంబ్లీలో సభకు రాకుండా... పార్లమెంట్ లో వ్యతికించిందంటూ అరోపించారు.  అమరావతి అని పలకడం ఇష్టంలేక, కొత్తగా ఇప్పుడు 'మావిగన్' అంటున్నారంటూ ప్రస్తావిస్తూ వైసీపీ తెరపైకి తెచ్చిన మావిగన్ పై కూడా విమర్శలు సంధించారు. 'రాజధానిలో అవినీతి' అంటూ ఫ్రస్ట్రేషన్‌లో మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు.

ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే... వైసీపీ కొత్తగా తెరపైకి తెచ్చిన మావిగన్ పై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చే నడుస్తుండగా...ఇప్పుడు దీనికి కౌంటర్ గా స్వయంగా చంద్రబాబే కౌంటర్ ఇచ్చే పనిలో నిమగ్నమయ్యారనిస్తొందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. గడచిన ఐదేళ్లు మూడు రాజధానులంటూ మూడుముక్కలాట ఆడారని ఇప్పటికే నిత్యం విమర్శలు చేస్తున్న టిడిపి... ఇప్పుడు ఎప్పుడు అవకాశం వస్తే అప్పడు రాజధాని అంశాన్ని తనకు అనుకూలంగా మల్చుకోవాలనే ప్రయత్నం చేస్తుంది. అమరావతికి చట్టబద్దత కంటే మావిగన్ పైనే ప్రధానంగా చర్చ నడుస్తుంది. అటు మీడియా, సోషియల్ మీడియా వేదికగా కూడా హాట్ టాపిక్ గా నిలుస్తుంది. 

అంతేకాకుండా పార్లమెంట్ లో  వైసీపీ ఎంపీలు మాట్లాడుతూ అమరావతిలో ఒక్క శాశ్వత నిర్మాణమైనా జరగలేదని, రాజధాని రైతులకు ప్లాట్లు ఎప్పుడు ఇస్తారో స్పష్టత లేదని, రాజ్యాంగంలో రాజధాని అంశం ఎక్కడ ఉందని ఎంపీలు  ప్రశ్నించారు. వీటితో పాటు అమరావతి అవినీతికి కేరఫ్ అడ్రస్ అని, కూటమి నేతల సంపాదన కోసమే అప్పులు చేస్తూ రాజధానిని నిర్మిస్తు న్నారని నిత్యం దుయ్యబడుతుంది వైసీపీ. మరో వైపు వైసీపీ సోషియల్ మీడియాలోను జాతీయ స్థాయిలో దుమ్మెత్తిపోస్తుంది. తక్కువ ఖర్చుతో రాజధాని నిర్మాణం జరిగే అవకాశం ఉండగా...డబ్బులు లేవంటూ అప్పులతో ప్రజలపై భారం మోపుతూ అంత ఖరీదైన రాజధాని అవసరమా అంటూ ప్రశ్నిస్తుంది వైసీపీ. దీనిపై కూటమి తరుపున క్లారిటి ఇవ్వకపోగా.. కేవలం అమరావతిని వ్యతికేస్తున్నందువల్లే వైసీపీ ఇలాంటి విమర్శలు చేస్తుందని మాత్రమే కూటమి చెబుతొంది. ఈ కారణంగానే వైసీపీ నేతలు ప్రతి జిల్లా నుంచి కూడా కూటమిపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ వ్యాఖ్యలు, విమర్శలతో చంద్రబాబు  ఫ్రస్టేషన్ లోకి జారుకున్నారా అంటూ అనుమానాలు వ్యక్తం చేసే వారు లేకపోలేదు. 

ఈ విషయంలో వైసీపీ అరోపణలు, విమర్శలతో గడచిన వారం రోజులుగా రాజధాని పేరుతో కూటమి ప్రభుత్వం చేస్తున్న అవినీతి అంటూ రచ్చరచ్చ అవుతుంది. ఈ వ్యాఖ్యలకు, అరోపణలు, విమర్శలకు కౌంటర్ ఇవ్వడమే లక్ష్యంగా ఇప్పుడు వేదిక దొరకడమే తరువాయిగా తన మార్కు వ్యాఖ్యలతో వైసీపీపై దుమ్మెత్తిపోస్తున్నారు చంద్రబాబు.  అమరావతి అని పలకడం ఇష్టంలేక, కొత్తగా ఇప్పుడు 'మావిగన్' అంటున్నారంటూ చంద్రబాబు విమర్శలు చేశారు. అమరావతి చట్టబద్ధతకు పార్లమెంట్‌లో ఒకే ఒక్క దిక్కుమాలిన పార్టీ మద్దతు తెలపలేదు అంటూ వైసీపీపై తన అక్కసును ప్రదర్శించారు. నిన్నటి వరకు రాష్ట్రానికి అడ్రస్ లేకుండా చేశారు.. ఇప్పుడు అమరావతి రాజధాని అని గర్వంగా చెప్పుకునేలా చేశామంటూ కూటమి ప్రభుత్వంపై చంద్రబాబు తన మార్కు రాజకీయ వ్యాఖ్యలు చెయ్యడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.  రాజధానిగా అమరావతికి చట్టబద్దత పొందినందుకు వైసీపీలో ఫ్రస్టేషన్ లో ఉందా... లేక వైసీపీ విమర్శలు...ఆరోపణలు విన్న తరువాత కూటమి నేతలు  ఫ్రస్ట్రేషన్‌లో మాట్లాడుతున్నారా అన్నది ఇప్పుడు అందరిలో నానుతున్న చర్చ.

 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!