Sunday, 10 May 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

పార్లమెంట్ లో అమరావతి చట్టబద్ధత బిల్లును వ్యతిరేకించిన వైసీపీ...!

01 Apr 2026
02:21 PM
33

• నిరసనగా లోక్ సభ నుంచి వాకౌట్ ...!

Astra desk :
పార్లమెంట్ లో  అమరావతి (Amaravati) చట్ట బద్ధత బిల్లును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (Ysrcongress Party) అనుకున్నట్లుగానే వ్యతిరేకించింది. అంతేకాకుండా నిరసనగా లోక్ సభ(Loksabha) నుంచి వాకౌట్ సైతం చేసింది. ఎంపీ మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీలంతా లోక్ సభ నుంచి వెళ్లిపోయారు.

 అంతకుముందు లోక్ సభలో వైసీపీ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ అమరావతికి తాము వ్యతికేకం కాదన్నారు. కానీ బట్టబద్ధత బిల్లుకు తాము వ్యతిరేకమని చెప్పారు. అమరావతి రైతులకు న్యాయం జరగాలని, వారి ప్రయోజనాలను పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ బిల్లుతో రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం లేదని విమర్శించారు. అమరావతిని ఎన్ని ఎకరాల్లో నిర్మిస్తారో చెప్పాలని, ఎప్పటిలోపు నిర్మాణాలు పూర్తి చేస్తారో క్లారిటీ ఇవ్వాలని ఎంపీ మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు. రాజధాని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. రెండేళ్లలో రైతులకు అభివృద్ధి చెందిన ప్లాట్ల కోసం ప్రయత్నిస్తామని చెప్పారు.. కానీ ఇవ్వలేదు. 2014-19 వరకు  రైతులకు ఎలాంటి అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వలేదు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన మోసం తట్టుకోలేక రైతులు గుండె ఆగి చనిపోయారు. రైతుల గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రైతులకు ఎలా న్యాయం చేస్తారో ప్రకటించాలి. అమరావతిలో ప్రతీ ఎకరానికి రెండు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ నిధులను ఎక్కడినుంచి తీసుకొస్తారు?.

అదనపు భూసేకరణకు అవసరం ఏముంది?. మొత్తం ఎన్ని ఎకరాల భూమి తీసుకుంటారో చెప్పాలి. తీసుకుంటున్న భూమికి జస్టిఫికేషన్ ఏంటి?. అమరావతికి చంద్రబాబు హయాంలో ఐదేళ్లలో రూ.5335 కోట్లు ఖర్చు పెట్టారు. వాస్తవ సమస్యల నుంచి పక్కదారి పట్టించడానికి డైవర్షన్ చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది. రెండేళ్లలో మూడు లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారు. చదరపు గజానికి ఢిల్లీలో 4,000 ఖర్చు పెడుతున్నారు. అమరావతిలో చదరపు గజానికి 12,000 రూపాయలకు పైగా ఖర్చు పెడుతున్నారు. 8000 రూపాయలు  అదనంగా ఖర్చు పెడుతున్నారు. అమరావతి పేరుతో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా  దోపిడీ చేస్తున్నారు

 

 
వైయ‌స్ఆర్‌సీపీ వాకౌట్‌  : 
చంద్రబాబు నాయుడు తొలుత తిరువూరులో రాజధాని ఉంటుందని చెప్పారు. ఈలోగా అమరావతిలో భూములను కాజేశారు . అమరావతి పేరుతో ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారు. రాష్ట్రమంతా అభివృద్ధి చెందాలని మా పార్టీ అభిమతం. రాయలసీమ రెండో రాజధానిగా ఉంటుందని బీజేపీ చెప్పింది. కానీ ఇప్పుడు మాట మార్చారు. రాష్ట్రమంతా అభివృద్ధి చెందాలని వారికి లేదు. రైతుల ప్రయోజనాలు కాపాడాలి. ప్రస్తుత ఫార్మాట్‌లో ఉన్న ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాం. అమరావతికి, ఏ ప్రాంతానికి మేము వ్యతిరేకం కాదు. బిల్లుకు వ్యతిరేకంగా మేము వాకౌట్ చేస్తున్నాం’ అని అన్నారు.

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!