• టిడిపి డ్రామాలో ప్రజలకు వాస్తవాలు తెలియాలి...!
•రాజ్యాంగంలో ఎక్కడ రాజధాని అనే పదమే లేదు...
•ఏడేళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు అమరావతిలో చేసిందేమిటి? •భూములిచ్చిన రైతుల హామీలు నెరవేర్చారా?
• కూటమిని ఏకిపడేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ ...
ASTRA THADEPALLI :
ఏపి రాజధాని అమరావతి అంటూ ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో చేసిన తీర్మానం నేపధ్యంలో మాజీ సిఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిపై ప్రజలకు వాస్తవాలు తెలియాలన్నారు. అసలు రాజ్యాంగంలో ఎక్కడైన రాజధాని అనే పదం ఉందా? అని ప్రశ్నించారు. ఏడేళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు అమరావతిలో చేసిందేమిటి? అని ప్రశ్నించారు. భూములిచ్చిన రైతుల హామీలు నెరవేర్చారా? అని వైఎస్ జగన్ అడిగారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 'శాసనసభలో అమరావతిపై తీర్మానం ఒక డ్రామా అని, రాజధానిపై అసెంబ్లీలో తీర్మానం అవసరం లేదని స్వయంగా మంత్రి పార్థసారథి చెప్పారు. రాజ్యాంగంలో ఎక్కడా రాజధాని అనే పదం లేదు. చంద్రబాబు దృష్టిలో పాలన అంటే దోపిడీ, అవినీతి. చంద్రబాబు సీఎంగా ఉండటం ఏపీ ప్రజల దురదృష్టం. ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాజధానులను కేంద్రం నిర్ణయించలేదు. ఆయా రాష్ట్రాలే రాజధానులను నిర్ణయించుకున్నాయి. ఏడేళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు అమరావతిలో చేసిందేమిటి?. భూములిచ్చిన రైతుల హామీలు నెరవేర్చారా?. అమరావతిని ఎందుకు పెంచుకుంటూ పోతున్నారు?. రోడ్లు, డ్రైనేజీలకే ఎకరానికి రూ.2 కోట్లు అవుతుందని చంద్రబాబు లెక్కలే చెబుతున్నాయి. ఆ లెక్కన లక్ష ఎకరాలకు 2 లక్షల కోట్లు కావాలి. రూ. 2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి?. ఈ 2 లక్షల కోట్లు ఇంకా పెరుగుతూనే పోతాయి. 2019కి ముందు మాస్టర్ ప్లాన్ను ఎందుకు మారుస్తున్నారు. ఒకప్పుడు వరల్డ్ క్లాస్ సిటీ అని చంద్రబాబు ఊదరగొట్టారు. ఇప్పుడు మున్సిపాలిటీగా మిగిలిపోతుందని ఎందుకు అంటున్నారు. చదరపు అడుగుకు 11వేల నుంచి 14వేలు అవుతుందని చెబుతున్నారు. ఐదున్నర గంటల చర్చలో అమరావతిపై ఏం చెప్పారు?. రాజధాని పేరుతో పట్టపగలే దోపిడీ చేస్తున్నారు. దోపిడీని డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు డ్రామాలు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వైఎస్సార్సీపీ వ్యతిరేకం కాదు. చట్టసభల్లో భాగమైన కౌన్సిల్ లో చర్చ లేదు. కౌన్సిల్ సభ్యులు అవినీతిని బయటపెడతారని బాబు భయం. సభలు చట్టాలు చేస్తాయి. సవరణలూ చేయగలుగుతాయి' అంటూ వ్యాఖ్యానించారు.
ప్రెస్ మీట్ లో ప్రధానాంశాలు... :
అసెంబ్లీలో చంద్రబాబు చేసిన డ్రామా తీర్మానం.. :
రాజధానిపై అసెంబ్లీలో తీర్మానం అవసరం లేదని స్వయంగా మంత్రి పార్థసారథి ఈ విషయం చెప్పారు. అమరావతిపై శాసనసభలో తీర్మానం చేశారు.రాజధాని పేరిట చేస్తున్న దోపిడీ నుంచి పక్కదోవ పట్టించడానికే ఈ తీర్మానం. రాజధాని పేరిట పట్టపగలు దోపిడీ.
అసెంబ్లీలో చంద్రబాబు చేసిన డ్రామా ఇది. రాజధాని అనే పదం రాజ్యాంగంలో లేదు. సీట్స్ ఆఫ్ గవర్నెన్స్ మాత్రమే ఉంది. ఈ వాస్తవాన్ని ఎవ్వరూ మరిచిపోవద్దు.
నిజంగా అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అయ్యిందా? :
రాజధాని నిర్మాణానికి రూ.2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? అమరావతిలో రోడ్లు, డ్రైనేజీలకే ఎకరానికి రూ.2 కోట్లు అవుతుంది
చంద్రబాబు లెక్కలే ఈ వివరాలు చెబుతున్నాయి. ఆ లెక్కన లక్ష ఎకరాలకు రూ.2 లక్షల కోట్లు కావాలి
రూ.2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి?. ఈ రూ.2 లక్షల కోట్లు ఇంకా పెరుగుతూనే పోతాయి.
2019 ముందు మాస్టర్ ప్లాన్ ఎందుకు మార్చుతున్నారు.
ఇప్పుడు మున్సిపాలిటీగా మిగిలిపోతుందని ఎందుకు అంటున్నారు?
రోడ్లు, డ్రైనేజీలకే ఎకరానికి రూ.2 కోట్లు.... :
ఛత్తీస్ ఘఢ్, జార్ఖండ్ రాజధానులను కేంద్రం నిర్ణయించలేదు. ఆయా రాష్ట్రాలే రాజధానులను నిర్ణయించుకున్నాయి. ఏడేళ్లు సీఎంగా ఉండి అమరావతిలో చంద్రబాబు చేసిందేంటి?. భూములిచ్చిన రైతుల హామీలు నెరవేర్చారా?. అమరావతిని ఎందుకు పెంచుకుంటూ పోతున్నారు?
అమరావతిపై వాస్తవాలు తెలియాలి... :
చంద్రబాబు సీఎంగా ఉండడం ఏపీ ప్రజల దురదృష్టం. శాసనసభలో అమరావతిపై తీర్మానం ఒక డ్రామా.
రాజ్యాంగంలో ఎక్కడా రాజధాని అనే పదమే లేదు. చంద్రబాబు దృష్టిలో పాలన అంటే దోపిడీ, అవినీతి. అమరావతిపై ప్రజలకు వాస్తవాలు తెలియాలి.
మీడియా సమావేశంలో ముఖ్యమైన అంశాలు.*
1. పరిపాలన అంటే చంద్రబాబు దృష్టిలో, విచ్చలవిడి అవినీతి, దోపిడీ మాత్రమే:
2. అమరావతిపై శాసనసభలో చేసిన తీర్మానం, రాజధాని పేరిట చేస్తున్న దోపిడీ నుంచి, ప్రజలను పక్కదోవ పట్టించడానికే:
3. రాజధాని పేరిట పట్టపగలు దోపిడీ:
4. అసెంబ్లీలో చంద్రబాబు చేసిన డ్రామా ఇది.
5. రాజధానిమీద తీర్మానం అవసరం లేదని ప్రభుత్వంలోని మంత్రి పార్థసారథే చెప్పారు:
6. రాజధాని అనే పదం రాజ్యాంగంలో లేదు, సీట్స్ ఆఫ్ గవర్నెన్స్ మాత్రమే ఉంది:
7. ఈ వాస్తవాన్ని ఎవ్వరూ మరిచిపోవద్దు:
8. రాజధాని అనేది రాష్ట్రాల ఇష్టం అని, కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదని కేంద్రమే అధికారికంగా హైకోర్టులో చెప్పింది:
9. 2000 సంవత్సరంలో ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు ఏర్పడ్డాయి:
10. ఆ రాష్ట్రాలకు రాజధానులు కేంద్రం నిర్ణయిస్తే వచ్చాయా?
11. ఎవ్వరికీ వర్తించనవి మనకు మాత్రమే ఎందుకు వర్తిస్తున్నాయి:
12. మరి 7 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉండి, లక్ష ఎకరాల అమరావతిలో ఇంతవరకూ కట్టింది ఎంత?
13. నిజంగా అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అయ్యిందా?:
14. ఏ దేశం వెళ్తే ఆ బొమ్మ చూపించారు, ఎంతవరకూ వచ్చింది:
15. కనీసం భూములు ఇచ్చిన రైతులకు చెప్పిన హామీలైనా నెరవేర్చాడా?
16. మొదటి తీసుకున్న 50వేల ఎకరాలకే దిక్కు లేదు :
17. ఈ 50వేల ఎకరాల్లో రోడ్లు, కరెంటు, వాటర్, డ్రైనేజీ, వీటి కల్పనకే అయ్యే ఖర్చు రూ.లక్ష కోట్లు:
18. ఇప్పుడు సడన్‌గా మరో 50వేల ఎకరాలు ఎందుకు పెంచారు, సడన్‌గా మాస్టర్ ప్లాన్ ఎందుకు మారుస్తున్నారు:
19. దీనివల్ల అదనంగా మరో రూ.లక్ష కోట్లు పెరిగింది:
20. మరి ఈడబ్బు పెట్టడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఎన్ని దశాబ్దాలు పడుతుంది?
21. ఈ రూ. 2 లక్షల కోట్లు ఎంతకు పెరుగుతుంది?
22. 50వేల ఎకరాల్లో, వరల్డ్‌లోనే BEST CAPITAL అన్నారు:
23. ఇప్పుడు మున్సిపాల్టీగానే మిగిలిపోతుందని అని ఎందుకు అంటున్నారు:
24. ఎక్కడా లేని విధంగా cost per sft, ఏకంగా రూ.11వేలు నుంచి రూ.14వేలు ఎందుకు, పెరిగింది?:
25. వీటికి అసెంబ్లీలో చంద్రబాబు సమాధానం చెప్పాడా?
26. కేవలం జగన్‌ను, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తి పోయడానికి, బూతులు తిట్టడానికి మాత్రమే అసెంబ్లీని వాడుకున్నారు:
27. చట్టసభలో భాగమైన కౌన్సిల్‌ను పిలవలేదు:
28. చంద్రబాబుగారి అవినీతి బాగోతాన్ని కౌన్సిల్‌లో బయటపెడతారని పిలవలేదు:
29. ఏ చట్టాన్నైనా చట్ట సభలు తయారు చేయగలవు, ఆ చట్టాలను సవరించగలవు. ఇది వాస్తవం:
30. కాని ప్రజలను మభ్యపెట్టేలా చంద్రబాబు మాట్లాడుతూ బిల్డప్ ఇస్తున్నాడు:
31. అవినీతి నుంచి డైవర్ట్ చేయడానికే ఈ డ్రామాలు.
32. చంద్రబాబుగారు ఈ 12 ఏళ్ల కాలంలో మనస్ఫూర్తిగా ఈ ప్రాంతంలో ఉన్నారా?
33. ఇప్పటికీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ కుటుంబాలు ఎక్కడ ఉంటున్నాయి?
34. ఇప్పుడు కూడా ౩ ప్రత్యేక విమానాల్లో షటిల్ సర్వీసు చేస్తున్నారు:
35. వైయస్సార్‌సీపీ అమరావతి ప్రాంతానికే కాదు, రాష్ట్రంలో ఏ ప్రాంతానికీ అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ వ్యతిరేకం కాదు.
36. అమరావతి కోసం మొదటిదశలో తీసుకున్న ఆ 50వేల ఎకరాలకే దిక్కులేదంటే, రెండో దశలో మరో 50వేల ఎకరాలా:
37. ఈ లెక్కన లక్ష ఎకరాల్లో రోడ్లు వేయడానికి, కరెంటు, నీళ్లు, రోడ్లు, డ్రైనేజీ లాంటి సదుపాయాలను కల్పించడానికి రూ.2 లక్షల కోట్లు కావాలి:
38. భవిష్యత్తులో ఆ రూ.2 లక్షల కోట్లు ఎంతకు పెరుగుతుందో తెలియని పరిస్థితి:
39. ఎన్ని సంవత్సరాలు పడుతుందో, లేక ఎన్ని దశాబ్దాలు పడుతుందో తెలియని పరిస్థితి.
40. ఇవికాక బిల్డింగులు ఖర్చులు అదనం :
41. 2014-19 మధ్య తొలి ఐదేళ్లలో పెట్టింది కేవలం రూ.5,335 కోట్లు మాత్రమే:
42. అవికూడా అప్పుల ద్వారా తెచ్చినవే:
43. అమరావతికోసం ప్రస్తుతానికి చేసిన గ్రాస్, కమిటెడ్ అప్పులు రూ. 47వేల కోట్లలో, ఇప్పటికే డ్రా చేసింది రూ.13వేల కోట్లు:
44. ఇందులో మొబలైజేషన్ అడ్వాన్స్‌లుగా ఇచ్చింది రూ.5,5౦౦ కోట్లు, ఇవన్నీ కమీషన్ల కింద పోయాయి.:
45. మరో రూ.2,500 కోట్లు బిల్లుల కింద ఇచ్చారు.
46. మరో రూ.96౦ కోట్లు డైవర్ట్ చేశారు.
47. అంటే అమరావతి కోసం ఏడేళ్లలో ఖర్చు చేసింది దాదాపుగా రూ.8వేల కోట్లు మాత్రమే:
48. మరి, కేవలం రోడ్లు వేయడానికి, కరెంటు, నీళ్లు, డ్రైనేజీ లాంటి పనులకే ఖర్చుపెట్టాల్సిన రూ.2 లక్షల కోట్లు ఎక్కడ, ఏడేళ్లలో ఖర్చుపెట్టింది రూ.8వేల కోట్లు ఎక్కడ:
49. ఇంత డబ్బు ఇక్కడ పెడితే రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి, ప్రభుత్వ బాధ్యతల సంగతి ఏంటి?
50. తన స్కాములకోసం అమరావతిమీద చంద్రబాబు అప్పులు తెచ్చి కుమ్మరించడం వల్ల దాని ప్రభావం ఇప్పటికే స్టార్ట్ అయ్యింది:
51. నాడు - నేడు ఆగిపోయింది, ఫీజు రియింబర్స్‌మెంట్, వసతిదీవెన ఆగిపోయింది, ఆరోగ్య శ్రీ ఆగిపోయింది, వ్యవసాయం దెబ్బతింది. మెడికల్ కాలేజీలు ఆగిపోయాయి, మా పథకాలన్నీ ఆగిపోయాయి, రాష్ట్రానికి అవసరమైన ఇలాంటి ఎన్నెన్నో కార్యక్రమాలు ఆగిపోయాయి.
52. చివరకు చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు కూడా మోసాలుగా మిగిలిపోయాయి.
53. ఇక చంద్రబాబు లక్ష ఎకరాల అమరావతికి రూ.2 లక్షల కోట్లు ఎప్పుడు పెట్టగలుగుతాడు? ఎలా పెట్టగలుగుతాడు?
54. ప్రజలకు ప్రభుత్వం తప్పనిసరిగా, బాధ్యతగా చేయాల్సిన మంచి ఎలా జరుగుతుంది?
55. ఉద్యోగస్తులకు రూ.36వేల కోట్ల బకాయిలు ఉన్నాయి:
56. చంద్రబాబుగారు తన జీవితమంతా ఇక్కడే రోడ్లు, తన జీవితమంతా ఇక్కడే కరెంటు, తన జీవితమంతా ఇక్కడే నీళ్లు, తనజీవితమంతా ఇక్కడే డ్రైనేజీ, తన జీవితమంతా అప్పులు చేస్తాడా?
57. అంతవరకూ ప్రజలు, రాష్ట్రం ఇబ్బందులు పడుతుండాలా?
58. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు చెప్పిన 1లక్ష ఎకరాల అమరావతి ఎప్పటికి పూర్తవుతుంది?
59. రూ.2 లక్షల కోట్లు పెట్టే స్తోమత మన రాష్ట్రానికి ఉందా?
60. ప్రశ్నించే వారిపై బురదవేయడం సులభం, కాని ఆచరణ సాధ్యంగా ఉండాలి కదా?
61. అమరావతిలో భయంకరమైన అవినీతి, దోపిడీ జరుగుతోంది.
62. 2018లో ఏ పనులు, ఎవరు చేశారో, 2024లో టెండర్లు రద్దు చేసిన తర్వాత కూడా మళ్లీ అవే కంపెనీలకు పనులు దక్కాయి.
63. అమరావతి టెండర్లలో గూడుపుఠాణీ జరిగింది? మాఫియాగా ఏర్పడ్డారు.
64. ఒకవైపున అనూహ్యంగా రేట్లు పెంచి, మరో వైపున టెండర్లు రిగ్ చేశారు.
65. ల్యాండు ఫ్రీ, ఇసుక ఫ్రీ, కరెంటు ఛార్జీల్లో రాయితీలు, జీఎస్టీ మినహాయింపు, సీనరేజీ మినహాయింపు, ఎన్‌ఏసీ మినహాయింపు ఇస్తున్నారు.
66. ఇవన్నీ ఉన్నాసరే SFT రమారమి రూ.11వేల నుంచి రూ.14వేలు చూపిస్తున్నారు.
67. ప్రజల రాజధాని సంగతి దేవుడెరుగు అతిపెద్ద స్కాంకు, కరప్షన్‌కు చంద్రబాబు నిజంగానే క్యాపిటల్ చేసేశాడు.
68. బెంగళూరు, హైదరాబాద్‌లాంటి మహా నగరాల్లో ఫైవ్ స్టార్ సదుపాయాలతో SFT రూ.4,500 దాటదు.
69. సచివాలయం టవర్ల టెండర్లలో భారీ అవినీతి ఉంది.
70. మొత్తంగా చదరపు అడుగుకు రూ.14వేలుపైనే ఖర్చు అవుతోంది.
71. మళ్లీ కాంట్రాక్టర్లకు ఇసుక ఫ్రీ, సీనరేజీ, జీఎస్టీ తదితర మినహాయింపులు ఉన్నాయి.
72. బెంగుళూరు, చెన్నైల్లో రూ.4,500కే చేస్తున్నారు.
73. తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీలకోసం రూ.1100 కోట్లు పెట్టారు.
74. వీళ్లుచేసే దోపిడీకి వీరప్పన్ సరిపోడు. ఆస్థాయిలో ఉంది దోపిడీ.
75. తెలంగాణలో కేసీఆర్ రూ.615 కోట్లతో 10 లక్షల స్క్వేర్ ఫీట్ కట్టారు.
76. 1272 మంది కూర్చునేలా పార్లమెంటు భవనాన్ని రూ.970 కోట్లతో కట్టారు.
77. ప్రజాస్వామ్యానికి, న్యాయానికి ప్రతీకగా నిలిచే అసెంబ్లీ, హైకోర్టు భవనాల్లో కూడా చంద్రబాబు హైలెవల్ కరప్షన్ చేస్తున్నాడు.
78. అమరావతిలో రోడ్లైనా, మురుగునీటి కాల్వలైనా, సీవరేజీ ప్లాంట్లైనా, కొండవాటి వరద మళ్లింపు పనైనా ఇలా ఏది చూసినా అవినీతే.
79. కేవలం సచివాలయం టవర్లు, హైకోర్టు, అసెంబ్లీ డిజైన్లకోసమే రూ.401 కోట్లు పెడుతున్నారు.
80. ఫైఓవర్ కోసమే కిలోమీటర్‌కు రూ.170 కోట్లు పెడుతున్నాడు.
81. మా హయాంలో విజయవాడలో బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్‌కు కి.మీ. రూ.35 కోట్లు పెట్టారు.
82. మిగిలిపోయిన సిక్స్ లేన్ రోడ్డుకు అమరావతిలో రూ.53 కోట్లు పెడుతున్నారు.
83. నేషనల్ హైవేల్లో సిక్స్ లేన్ కోసం సగటు ఖర్చు రూ.20 కోట్లు మాత్రమే.
84. ఈ దోపిడీని మనం ప్రశ్నించకూడదంట, అడగకూడదంట.
85. అడిగితే ఎదురుదాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
86. అమరావతికి వ్యతిరేకం అని ఎదురుదాడి చేస్తున్నారు.
87. ఏడేళ్లలో అమరావతి కోసం చంద్రబాబు పెట్టిన రూ.8వేల కోట్లలో స్కాములు తప్ప చేసిన పనులు ఏమైనా ఉన్నాయా?
88. అమరావతికి ఎవ్వరూ వ్యతిరేకం కాదు? కాని సాధ్యం అవుతుందా?
89. అంతఖర్చును తట్టుకోగలమా?
90. ప్రజలను పెడదోవ పట్టించడం ఎందుకు?
91. ఇలా చేస్తే రాష్ట్రానికి రాజధాని ఎప్పుడు అవుతుంది? రాజధానే లేని పరిస్థితి ఉంటుంది.
92. రూ.2 లక్షల కోట్ల ఖర్చును తట్టుకునే స్తోమత రాష్ట్రానికి ఉందా?
93. అందుకే రాష్ట్రంలో ఇతర ప్రాంతాలను రోడ్డున పడేయకూడదని అనుకున్నాం.
94. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి మెట్రో నగరాలతో పోటీపడాలంటే, మనకు కూడా ఒక గ్రోత్ ఇంజిన్ ఉండాలని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖపట్నం పెట్టాలనుకున్నాం.
95. ఇందులో స్వార్థం లేదు, ఆచరణాత్మక ధోరణే ఉంది.
96. శ్రీబాగ్ ఒడంబికను గౌరవిస్తూ కర్నూలును న్యాయరాజధానిగా పెట్టాలనుకున్నాం.
97. అమరావతిని శాసనరాజధానిగా కొనసాగించాలని నిర్ణయించాం.
98. కాని, ఆ ప్రణాళిక ముందుకు సాగలేదు.
99. మా ఆలోచనల్లో ఎక్కడా కూడా మేం అమరావతిని నిర్లక్ష్యం చేయలేదు. రైతులకు మరో ఐదేళ్లపాటు కౌలును పెంచాం, రాజధానిలో పెన్షన్లను రూ.5వేలకు పెంచాం.
100. ఆచరణాత్మక ఆలోచన. ప్రాక్టికల్‌గా సాధ్యమయ్యే ఆలోచనలు మేం చేశాం.
101. మరోవైపు ప్రభుత్వం తన బాధ్యతగా ప్రజలకు చేయాల్సిన ప్రతి మేలుకూ అడ్డంకులు లేని ఆలోచన చేశాం.
102. ప్రభుత్వం మీద, ప్రజల మీద అప్పులు భారం మోపకుండా ఆలోచన చేశాం.
103. కేవలం రూ.10వేల కోట్లు పెడితే చాలని, విశాఖనగరం ఇవ్వాళ్టి ఉన్న ఈ స్థాయి నుంచి గొప్పస్థాయికి ఎదుగుతుందని చెప్పాం.
104. రాష్ట్రానికి ఆదాయాన్ని, మన పిల్లలకు ఇక్కడే ఉద్యోగాలను, ఇచ్చే వనరుగా మారుతుందని మేం చెప్పాం.
105. దీనిమీద చంద్రబాబు, ఎల్లో ముఠా చేసిన ప్రచారం, చెప్పిన అబద్ధాలు అన్నీ ఇన్నీకావు.
106. సంకుచితమైన ఆలోచన ఉండి ఉంటే, రాయలసీమలో రాజధాని ఆలోచన చేసేవాడిని.
107. కాని నేను అలా చేయలేదు.
108. రాష్ట్రానికి మంచి చేయాలన్న ఆలోచన చేశాను.
109. ప్రజల ప్రయోజనాలే ముఖ్యమనుకున్నాను.
110. ఇక్కడే legislative capitalగా ఎందుకు decalre చేస్తాను.
111. ఇవాళ చంద్రబాబు నాయుడు ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా విశాఖపట్నాన్ని రద్దుచేశాడు.
112. న్యాయ రాజధానిగా కర్నూలును రద్దుచేశాడు. పోనీ అమరావతిలో రూ. 2 లక్షల కోట్లు ఎప్పుడు పెట్టగలడో చెప్పగలడా?
113. ఎక్కడ నుంచి, ఎలా తెస్తాడో చెప్పగలడా?
114. రాష్ట్ర భవిష్యత్తును చంద్రబాబు పూర్తిగా దెబ్బతీస్తున్నాడు.
115. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతా చేయాల్సిన పనులు, ప్రజలకు చేయాల్సిన మంచి ఎలా చేస్తాడో చెప్పగలడా?
116. రెండేళ్లు పూర్తికాకముందే Gross, committed రూపంలో రూ.3.37 లక్షల కోట్ల అప్పులు తెచ్చాడు.
117. అప్పులు చేస్తే తప్ప జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నాడు.
118. మరి ఎప్పుడు అమరావతిలో కనీస సదుపాయాలకోసం రూ.2 లక్షల కోట్లు తెస్తాడు?
119. అలా అప్పులు తెస్తూ పోతే మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏం కావాలి?
120. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని రాష్ట్రంలోని ప్రజలందర్నీ కూడా చంద్రబాబు మభ్యపెడుతూ వచ్చాడు.
121. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అయితే, అమరావతి కోసం ఇప్పటికే కమిటెడ్, గ్రాస్ లోన్లు రూ.47 వేల కోట్లు ఎందుకు తెచ్చినట్టు?
122. ఇవికాకుండా రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయింపులు ఎందుకు చేస్తున్నట్టు?
123. రాజధానికోసం తెస్తున్న రుణాలకు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్యారంటీలు ఎందుకు ఇస్తున్నట్టు?
124. అమరావతిలో భూములు అమ్మి డబ్బులు తెస్తానని చెప్పాడు.
125. మరి ఇన్ని వేలకోట్ల అప్పులు ప్రభుత్వ ఖజానాపై ఎందుకు వేస్తున్నావు?
126. ఇప్పటివరకూ అమ్మిన భూమలు ఎన్ని?
127. చంద్రబాబు విజనరీ ఆలోచనల ద్వారా అమరావతి ప్రాజెక్టు నుంచి ఇప్పటివరకూ వచ్చిన డబ్బు ఎంత?