ఢిల్లీ :
కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి పార్లమెంట్ ఎస్టిమేట్స్ కమిటీ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) తరపున ఆయన ఈ కీలక కమిటీకి ఎంపికయ్యారు. ఈ ఎన్నిక ద్వారా దేశ ఆర్థిక, పాలనాపరమైన అంశాలను పరిశీలించే కీలక కమిటీలో సభ్యత్వం లభించనుంది. ఈ నియామకం ఆయన ప్రజా సమస్యల పరిష్కారంలో చూపే చొరవకు, పార్లమెంటరీ వ్యవహారాల్లో ఆయన క్రియాశీలతకు నిదర్శనంగా భావిస్తున్నారు. గత కేంద్ర ప్రభుత్వ హాయంలో 2019లో పార్లమెంటు స్టాండింగ్ కమిటీల్లో భాగంగా పరిశ్రమల వ్యవహారాల కమిటీలో కూడా ఆయన సభ్యునిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు మళ్లీ అయన అంచానాల కమిటి సభ్యులుగా ఎన్నికవ్వడం ద్వారా మరోమారు అయన పనితీరుకు మంచి గుర్తింపునిచ్చినట్లయ్యింది. ఈ నియామకం పట్ల వైసీపీ నేతల్లోను, అయన అభిమానుల్లోను హర్షం వ్యక్తం అవుతుంది.