Monday, 23 March 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / అంతర్జాతీయ వార్తలు

ట్రంప్ సంచలన ప్రకటన.. యుద్ధానికి బ్రేక్...!

23 Mar 2026
05:44 PM
59

• ఇరాన్ పై చేస్తున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ప్రకటన
• ట్రంప్ మళ్లీ దిగొచ్చాడు... మా ప్రతిదాడి చూసి ట్రంప్ బెదిరిపోయాడని ఇరాన్  స్పందన...
• అసలు చర్చలే జరగలేదన్న ఇరాన్ ...
• ట్రంప్ ప్రకటన.. అమాంతం తగ్గిన చమురు ధరలు....



వాషింగ్టన్  :

ఇరాన్ తో జరుగుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. 5 రోజుల పాటు కాల్పుల విరమణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్లో మీడియాలో పోస్టు చేశారు. ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలపై సైనిక దాడులను ట్రంప్ వాయిదా వేస్తున్నామని పేర్కొన్నారు. ఇరాన్ పవర్ ప్లాంట్లు, ఎనర్జీ ఇన్ ఫ్రా పై మిలిటరీ స్ట్రైక్స్లు వాయిదా వేస్తున్నామని ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. ఈ మేరకు ఇరు దేశాల మధ్య 2 రోజులపాటు జరిగిన చర్చలు సఫలమయ్యాయని వివరించారు. టెహ్రాన్ తో చర్చలు జరుపుతున్నామని, ఫలవంతమైన చర్చలు జరిపినట్లు తెలిపారు. ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ ఫిబ్రవరి గత నెల 28న యుద్ధం ప్రారంభించిన విషయం తెలిసిందే.

Article Image 

ట్రంప్ విధించిన 48 గంటల గడువులోగానే బ్రేక్... !
ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ ప్రతిదాడుల నేపథ్యంలో మధ్యప్రాచ్యంలోని ప్రస్తుత పరిస్థితి ఆందోళనకరంగా పరిణమిస్తోంది. దీంతో  సముద్రమార్గ ఇంధన వాణిజ్యం కోసం హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తిరిగి తెరవాలంటూ ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 48 గంటల గడువు విధించారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 5.14 గంటలకు ఈ గడువు ముగుస్తుంది. కానీ ఇరాన్ మాత్రం అటు తమ ఇంధన మౌలిక సదుపాయాలపై దాడి జరిగితే ఆ జలమార్గాన్ని పూర్తిగా మూసివేస్తామని ఇరాన్ హెచ్చరించింది. తమ తీరాలతో పాటు ద్వీపాలపై ఏ దాడి జరిగినా, తీరం నుండి తేలియాడే మందుపాతరలతో సహా అన్ని గల్ఫ్ ప్రవేశ మార్గాల్లో మందు పాతరలను మోహరిస్తామని ఉన్నత స్థాయి భద్రతా సంస్థ హెచ్చరించింది.

ట్రంప్ మళ్లీ దిగొచ్చారు- ఇరాన్ : 
ఇరాన్ పై చర్చలు సఫలమయ్యాయని...ఐదు రోజుల పాటు దాడులు అపేస్తున్నామని
అమెరిక అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనపై ఇరాన్ స్పందించింది. ట్రంప్ మళ్లీ దిగొచ్చాడని,  మా ప్రతిదాడి చూసి ట్రంప్ బెదిరిపోయాడని పేర్కొంది. ట్రంప్ 48 గంటలు గడువిచ్చినా తాము బెదరలేదని, చర్చల సందర్బంగాను తాము తలొగ్గలేదని, ఇప్పుడు కూడా భయపడటం లేదని పేర్కొంది. అసలు ఇరు దేశాల మధ్య చర్చలే జరగలేదని పేర్కొంది. కేవలం మా దాడులను చూసే ట్రంప్ ప్రకటన చేశారని తెలిపింది. ఈ నేపథ్యంలో కాబూల్‌లో ఇరాన్ రాయబార కార్యాలయం ఈ ప్రకటన చేసింది. టెహ్రాన్ నుంచి వచ్చిన గట్టి హెచ్చరిక కారణంగా ఇంధన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకునే ప్రణాళికల నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గారని కాబూల్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం తెలిపింది. చర్చలు కొనసాగుతున్నందున, ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, ఇంధన సౌకర్యాలపై ఎలాంటి సైనిక దాడులనైనా ఐదు రోజుల పాటు వాయిదా వేస్తామని ట్రంప్ చెప్పిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది.

ట్రంప్ ప్రకటన.. అమాంతం తగ్గిన చమురు ధరలు  :
Article Image
ఇరాన్ పై దాడులు 5 రోజులు వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ ఉదయం 110 డాలర్లకు పైనే ట్రేడ్ అయిన బ్రెంట్ క్రూడ్ ధర తాజాగా 96 డాలర్లకు దిగొచ్చింది. ఈ పరిణామం అంతర్జాతీయ మార్కెట్లలో ఆసక్తిని రేకెత్తించింది. ట్రంప్ ప్రకటన చమురు ధరలపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది.

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!