వైఎస్ కుటుంబం ఆస్తుల కోసం ఏనాడు కొట్లాడుకోలేదు...
* విలువల కోసం కొట్లాడిన కుటుంబం అది...
*అంతమంది అన్నదమ్ములున్నా...ఆస్తుల గొడవలు లేవు...
*చంద్రబాబుకు పావుగా మారిన షర్మిల వల్లే ఇప్పుడు ఆస్తుల గొడవలు....
*ప్రశాంత జీవనం సాగించాల్సిన వయస్సులో వైఎస్ విజయమ్మపై ఒత్తిడి తెచ్చి లేఖలు రాయిస్తుంది...
*ఆపద వస్తే మీ అన్న వైఎస్ జగన్ తప్ప... ఏ ఒక్కరు ఆదుకోరు...
*ఇది తెలుసుకుని షర్మిల నడుచుకుంటే మంచిది....
*వైఎస్ఆర్ కుటుంబంపై జరుగుతున్న రచ్చపై ...
* వైఎస్ఆర్ అభిమాని, వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కిషోర్ బూసిపాటి ఆవేదన ....

కడప :
వైఎస్ కుటుంబంలో జరుగుతున్న అస్తుల రచ్చపై ...ఆ కుటుంబ విధేయులు... అభిమానుల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతొంది. కొందరు తెర ముందుకు వచ్చి వారి ఆవేదనను వ్యక్తం చేస్తుంటే... మరికొందరు ఇరుగుపోరుగు వారితో చర్చించుకుంటూ తమ బాధను వ్యక్తం చేస్తున్న దశ్యాలు ఇప్పుడు ఎపిలో కనిపిస్తున్నాయి. అస్తుల విభజన జరగలేదని వైఎస్ విజయమ్మ లేఖ విడుదల చేసిన అనంతరం కొద్ది గంటల్లోనే ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి మీడియా ముందుకు వచ్చి నిష్టురమైన సరే నిజాలే మాట్లాడతానంటూ ముక్తకంఠంగా మాట్లాడారు. అయన మాట్లాడాకా అవతలి వైపు నుంచి ఒక్క గొంతు లేవలేదు. జగన్ పై షర్మిల చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని, కోట్లాది మంది ఆడబిడ్డలు ఆయన్ని దేవుడిచ్చిన అన్నగా ఆరాధిస్తుంటే... రక్తసంబంధం కలిగిన షర్మిల శత్రువులు కూడా ఇలా ఉండరు అనడం బాధాకరమన్నారు. షర్మీల మాటలు విజయమ్మకు బాధ కలిగించి ఉండాలి, కానీ అలా జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అమె ఇచ్చిన స్టేట్మెంట్ కు నోటరీ చేయించి మరీ విడుదల చేయడం వెనుక వ్యూహం ఉందన్నారు. వైఎస్సార్ భార్యగా, ఆమె ఏమి చెప్తే అది ప్రజలు నమ్ముతారన్న అభిప్రాయంతో నోటరీ చేసి మరీ లేఖ విడుదల చేశారన్నారు. ఈ లేఖ మొదటగా టీడీపికి చెందిన సోషల్ మీడియా గ్రూపుల్లో కనిపించిందని, దీన్ని బట్టి స్క్రిప్ట్ ఎవరు రాస్తున్నారు?, ఎక్కడ తయారవుతుంది? అన్నదానిపై ప్రజలకు అవగాహన కలిగిందన్నారు. విజయమ్మ అనేక సందర్భాల్లో తాను షర్మిల వైపే అన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారన్నారు. విజయమ్మ రాసిన లేఖలో మేనల్లుడు, మేనగోడరికి అంటే షర్నీల కుమార్తెకు, కుమారుడుకి జగన్ తీవ్రమైన అన్యాయం చేశాడంటూ పేర్కొనడం చాలా బాధాకరమన్నాడు. నిజంగా ఈ మాట ఎవరైనా నమ్మితే.. మీ కుమారుడు జగన్ ఇంత అన్యాయస్తుడని భావించరా? మీ కుమార్తె షర్మిలను రక్షించే ప్రయత్నంలో కుమారుడి గౌరవాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత కింద స్థాయికి తీసుకుని పోయే విధంగా మాట్లాడ్డం తగునా? అంటూ విజయమ్మను రాచమల్లు ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి షర్మిల చేసిన అనుచిత వ్యాఖ్యలపై స్పందిస్తే గోబెల్స్ ప్రచారం అంటూ విజయమ్మ లేఖలో రాయడం అన్యాయమన్నారు. తాము వాస్తవాలనే ప్రజలకు చెస్తున్నామని, చంద్రబాబు కుట్రలో పాలుపంచుకుంటూ తమ నాయకుడిని వ్యక్తిత్వహననం చేస్తుంటే, బాదనుండి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. విజయన్న ఒక తల్లిగా తన కుమారుడి కోసం పడాల్సిన ఆరాటం, పార్టీ నాయకులుగా తాముపడుతున్నామని, తమతోపాటు జగన్ ని అభిమానించే లక్షలాది కుటుంబాలు ఆరాటపడుతున్నాయన్నారు.

ఇక వైఎస్ఆర్ అభిమాని, వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కిషోర్ బూసిపాటి కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ కుటుంబం మొదటి నుంచి పేద ప్రజల పక్షాన నిలబడి ఒక ఆశయాల కోసం పని చేసినటువంటి కుటుంబమే గానీ... ఏనాడు ఆస్తుల కోసం కొట్లాడుకోలేదని, అలాంటి కుటుంబాన్ని ఈ రోజు చంద్రబాబు పావుగా మారిన షర్మిల అస్లుల గొడవల పేరుతో ఆ కుటుంబాన్ని రోడ్డున పడేయ్యడం బాధకరమని విమర్శించారు. వైఎస్ కుటుంబంలో అంత మంది సోదరులున్నా ఏనాడు నాకు అస్తులు పంచి ఇవ్వాలని గానీ, నా అస్తి నీవు తీసుకున్నావని గానీ కొట్లాడిన సందర్బాలు ఒక్కటి కూడా లేదన్నారు. గతంలో వైఎస్ రాజారెడ్డి, అనంతరం వైఎస్ రాజశేఖరరెడ్డిల మాటే వేదంగా అందరు ఒక తాటిపై సోదరభావంతో ముందుకు వెళ్లారన్నారు. కానీ ఇప్పుడు మాత్రం షర్మిల చంద్రబాబు ఇచ్చే కాసులు తీసుకుని వైఎస్ జగన్ ను రోడ్డుకీడ్చటం వైఎస్ కుటుంబ అభిమానులను తీవ్ర ఆవేదనకు గురిచేస్తొందన్నారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడే అస్తులు పంపి ఇచ్చినా... ఇప్పుడు కొత్తగా అస్తులు పంచలేదని మాట్లాడటం అమెలోని ధ్వంద నీతికి నిదర్శనమని, ఇది వైఎస్ కుటుంబానికి విధేయులుగా అభిమానులుగా ఉన్న వారిని తీవ్రంగా కలచి వేస్తుందన్నారు. అనాడు అస్తులు పంచిన వాస్తవం వైఎస్ విజయమ్మకు తెలిసినా... అమెపై ఒత్తిడి తెచ్చి తప్పుడు లేఖలు అమె పేరుతో విడుదల చెయ్యడం దారుణమన్నారు. ఆడ బిడ్డ అని షర్మి లకు తల్లి విజయమ్మ సపోర్టు చేస్తే... ప్రశాంతంగా జీవనం సాగించాల్సిన వయస్సులో తల్లిపై అనేక రకాలుగా ఒత్తిళ్లు తెచ్చి బలవంతంగా అమెతో లేఖలు రాయించడం దారుణమన్నారు. రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతనం అనేక వందల మంది గుండెలు పగిలి చనిపోయినటువంటి ప్రజాభిమానానికి రాజశేఖర్ రెడ్డి బిడ్డగా ఈ రాష్ట్రంలో షర్మిలను ఉన్నతమైనటువంటి స్థానంలో గౌరవించే వాళ్ళు ..అభిమానించే వాళ్ళు... గుండెల్లో పెట్టుకొని చూసుకునే వాళ్ళు ఉన్నారని, అవన్నీ మర్చిపోయి చంద్రబాబునాయుడు ఆడిస్తున్నటువంటి ఆటలో నువ్వు పావుగా మారడం పద్ధతి కాదన్నారు. ఈ రాష్ట్రంలో ఈ రోజు అనేకమైనటువంటి అంశాలు, ప్రజా సమస్యలు పక్కనపెట్టి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద మీ ఆస్తుల మీద విమర్శలు చెయ్యడం సరైనటువంటి పద్ధతి కాదని హితవు పలికారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి ఇచ్చినటువంటి లేఖలు సరైనటువంటిది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మహానేత ఆలోచనతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రవేశం చేసి అనేకమైన ఇబ్బందులు..ఒడిదుడుకులు... అనేక కష్టాలు అధిగమించి తండ్రి ఆశయాలను నెరవేర్చాలని కుమారుడు ..కూతుర్తెగా చరిత్రలో నిలబడాల్సినటువంటి అవసరం ఉందన్నారు. కానీ ఇప్పుడు అమె అందుకు భిన్నంగా నడుచుకుంటున్నారని, సొంతమామనే వెన్నుపోటు పోడిచిన చంద్రబాబు కాసులకు కక్కుర్తిపడి వైఎస్ జగన్మోహన్‌రెడ్డినే విమర్శించడం దారుణమన్నారు. ప్రజాసమస్యలపై చంద్రబాబుపై తిరుగుబాటు చెయ్యాల్సిన పదవిలో ఉంటూ అయన కరెన్సీ తీసుకుని సొంత అన్నను విమర్శించడం దుర్మార్గమైన చర్యగా తాము అభిప్రాయపడుతున్నామన్నారు. ఈ లోకంలో నీకు ఎదైనా సమస్య వస్తే... అన్నగా వైఎస్ జగన్ మోహాన్ రెడ్డి తప్ప నిన్ను ఆదుకునేటువంటి వాళ్ళు ఎవరు లేరన్నారు. చంద్రబాబు ఆడిస్తూంటే...మధ్యలో ఆదినారాయణరెడ్డి సోదినారాయణరెడ్డిగా ఎదేదో మాట్లాడుతున్నాడని ఇవన్నీ వైఎస్ కుటుంబానికి మచ్చలేనన్నారు. తెలుగుదేశం పార్టీ ఆడిస్తున్న ఆటలో షర్మిల ఎన్ని చేసినా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి నష్టం లేదని, 2029 ఎన్నికల్లో గెలుపొంది రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడటం... రెండోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి కావడం ఖాయమన్నారు. దయచేసి మీ యొక్క పనికిమాలిన రాజకీయాలు పనికిమాలిన ఆలోచనలు చంద్రబాబు చేసేటువంటి ఎత్తుగడలను షర్మిల ఉపసంహరించుకోవాలని హితవు పలికారు. పులివెందుల టిడిపి ఇన్ చార్జి బిటెక్ రవి సూలఅంగళ్ల కూడలిలో ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డిని బహిరంగ చర్చకు రమ్మంటున్నారని, బిటెక్ రవి సిద్దమైతే వారి టిడిపి ఆఫీసులోనే బహిరంగ చర్చకు సిధ్దమని సవాల్ విసిరారు.