*తల్లి ఆస్త్రాన్ని మరోమారు ఉపయోగించిన పీసీసీ చీఫ్ షర్మిల....!
*షర్మిల కామెంట్స్...వైసీపీ నేతల ప్రతి విమర్శల నేపధ్యంలో ..
*నోటరీ చేసిన అఫిడవిట్ తో జనాలను మరింత నమ్మించే ప్రయత్నం చేసిన విజయమ్మ ...
*వైఎస్ జగన్ తరుపున మాట్లాడిన వారు గోబెల్సా ... ?
*వైఎస్ఆర్ కుటుంబాన్ని ప్రతి నిత్యం బజారున మాట్లాడుతుంది షర్మిల కాదా ?...
*అసత్య ప్రచారాలు వద్దంటూ జగన్ కు తల్లి హితబోధా ?...
Ys vijayamma letter heat :
వైఎస్ జగన్, ఆయన సోదరి పిసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మధ్య సాగుతున్న మాటలు... ఆస్తుల వివాదంలో అందరు అనుకుందే జరిగింది. అన్న...చెల్లి... మధ్యలో తల్లి. కాదు .. కాదు....చెల్లి వైపు తల్లి. మధ్యలో ఉన్న తల్లి ఏకపక్షంగా కూతరు వైపే మొగ్గుచూపడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆడ వారి సెంటిమెంట్ అలాంటిది మరి. పురుషుల కంటే ఆడవారు ఎక్కువ భావోద్వేగపూరితంగా ఉంటారన్నది ఒక విసృతమైన ప్రచారం. ఇదే నిజం చేస్తూ ఈ రోజు వైఎస్ విజయమ్మ పీసీసీ ఛీఫ్ షర్మిలకు మద్దతుగా లేఖ విడుదల చెయ్యడం... కుటుంబాన్ని గురించి వైఎస్ జగన్ మీడియాలో మళ్లీ మళ్లీ ప్రస్తావించొద్దని కోరడం ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది.
వైఎస్ షర్మిలే కాదు... వైఎస్ సునీతలు ఇరువురు నిత్యం వైఎస్ వివేకానందరెడ్డి హత్యను ప్రస్తావిస్తూ ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి మీదే కాకుండా వైసీపీ మీద...వైసీపీ ప్రభుత్వం మీద...వైఎస్ జగన్ మీద బురద జల్లడం కామన్ గా మారింది. వీరు మాట్లాడటం ఎల్లో మీడియా బ్యానర్ ఐటమ్ గా వార్తలు రావడం...డిబేట్లు నడపడం ద్వారా వైసీపీని... వైఎస్ జగన్ ను తూర్పరబడుతుండటం నిత్యం చూస్తున్న వాస్తవమే.
ఈ వారంలో జరిగిన పరిణామాలను చూస్తే.... వైఎస్ వివేకానందరెడ్డి వర్ధంతిని పురష్కరించుకుని వైఎస్ సునీత మీడియా సమావేశంలో ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు వైసీపీ ప్రభుత్వం మీద విమర్శలు చేసింది. ఈ వేడి రగులుకోగానే.... వైఎస్ షర్మిల అన్న అనే పదానికే జగన్ కళంకం అంటూ ఘాటు విమర్శలు చేసి మరింత జఠిలం చేసింది. జగన్ లాంటి అన్న వుంటే, వేరే శత్రువులు అవసరం లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఈ నేపథ్యంలో షర్మిల చేసిన వ్యాఖ్యలను తప్పు పడుతూ ....వైసీపీ ముఖ్య నాయకులు ప్రతి విమర్శలు చేశారు. 1995లోనే షర్మిలకు వివాహమైందని, అప్పట్లో ఆమెకు తండ్రి పంపకాలు చేశారని, ఆ ఆస్తులు ఇవే అంటూ కడప జిల్లాకు చెందిన వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదొడ్డి, రాష్ర్ట ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ రెడ్డి, అలాగే తెలంగాణకు చెందిన రాఘవరెడ్డి వివరాలు వెల్లడించారు. తండ్రి పంచి ఇచ్చిన ఆస్తుల్నే కాకుండా, వైఎస్ జగన్ తన చెల్లిపై అభిమానంతో రూ.200 కోట్లకు పైగా అందజేశారని చెప్పారు. షర్మిల తీరు చూసిన తర్వాత, ఇలాంటి చెల్లి ఏ అన్నకూ వుండకూడదని సామాన్య ప్రజలు సైతం అనుకుంటున్నారని వారు అన్నారు. చంద్రబాబుకు పావుగా మారి వైఎస్ జగన్ పై చేస్తున్న విమర్శలకు షర్మిల సమాధానం ఇవ్వాల్సిందంటూ డిమాండ్ చేశారు.
ఇంతలోనే అందరు అనుకున్నట్లుగా వైఎస్ విజయమ్మను తన అస్ర్తంగా షర్మిల రంగంలోకి దింపింది. ఇవాళ వైఎస్ విజయమ్మ నోటరీ నోటును విడుదల చేశారు. 2009లో వైఎస్ మరణించే వరకూ అసలు ఆస్తుల్ని పంచలేదని, షర్మిల పిల్లలకు జగన్ అన్యాయం చేశారని అందులో ఆమె ఆరోపణలు చేశారు. వైఎస్సార్ మరణించే వరకూ ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులే అని ఆమె చెప్పుకొచ్చారు. గతంలో చెప్పినట్టే అన్ని ఆస్తులను నలుగురు మనుమలుకు సమానంగా పంచాలని వైఎస్సార్ ఉద్దేశంగా విజయమ్మ తెలిపారు. అంతేకాదు ఇది వైఎస్సార్ ఆదేశమని, దగ్గర వాళ్ళందరికీ తెలిసిన వాస్తవమిదే అంటూ వైఎస్ విజయమ్మ పేర్కొన్నారు. సరస్వతి సిమెంట్ తో సహా MOUలో లేని యహలంక ల్యాండ్ కూడా షర్మిలదేనని, జగన్ తన మేనల్లుడికి, మేనకోడలికి ఇప్పటి వరకు అన్యాయం చేశాడని, ఎప్పటికైనా న్యాయం చేస్తాడని ఆశిస్తున్నట్టు విజయమ్మ పేర్కొన్నారు. నిజం ఏమిటో దేవుడికి, నా కొడుకుకి కూడా తెలుసన్న విజయమ్మ .... అసత్యాల ప్రచారం మానుకోవాలని వైఎస్సార్ భార్యగా చేతులు జోడించి అడుగుతున్నట్టు విజయమ్మ కోరారు.
ఇది తొలి సారి కాదు.... :
ఈ నేపథ్యంలో షర్మిల సమాధానం చెప్పకుండా, తన తల్లిని ముందుకు తెస్తారనే అనుమానం వైసీపీ నాయకుల్లో ఎప్పటి నుంచో ఉంది. గతంలో కూడా ఇలాగే తల్లితో ఆస్తుల విషయమై లేఖ రాయించడాన్ని వైసీపీ నాయకులు గుర్తు చేశారు. ఎన్నికల ముందు విదేశాలకు వెళ్లి షర్మిలకు ఓటు వెయ్యండని పిలుపునివ్వడాన్ని కూడా వైసీపీ నేతలు ప్రస్తావిస్తున్నారు. అంటే కుమారుడు ఓ వైపు రాజకీయ శత్రువులతో పోరాడుతుంటే ... వైఎస్ విజయమ్మ మాత్రం శత్రువులకు ఓటు వెయ్యాలని చెప్పడమంటే వైఎస్ జగన్ ను ఓడించమని చెప్పడం కాదా అన్ని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఇప్పుడు కూడా మళ్లీ షర్మిలకు మద్దతుగా విజయమ్మ ముందుకు వస్తారని వైసీపీ నాయకుల అనుమానం ఉండగా..ఇప్పుడు అదే అంచనానే నిజమైంది.

ఆస్తుల విషయంలో విజయమ్మ ప్రస్తావించినవన్ని వాస్తవాలేనా .. ? :
గతంలోను రష్మిలకు మద్దతుగా ఇలానే విజయమ్మ లేఖను విడుదల చేశారు. ఇప్పుడు షర్మిలను వైసీపీ నాయకులు ప్రశ్నలతో నిలదీస్తుండడంతో విజయమ్మ సమాధానంగా ప్రకటన విడుదల చెయ్యడం చర్చనీయాంశంగా మారింది. అయితే షర్మిలకు పెళ్లయి, అత్తగారింటికి వెళ్లాకా కూడా ఆస్తుల పంపకం జరగలేదని వాస్తవాన్ని విజయమ్మ ఎలా మర్చిపోయారంటూ వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. వైఎస్ఆర్ 2009లోనే ఆస్తులు పంపకాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ ఆస్తుల పేరుతో వైఎస్ జగన్ పై అక్రమ కేసులు నమోదు చేసి ఆస్తులను ఈడి అటాచ్ చేసింది. మరి అనాడు వైఎస్ఆర్ చేసిన అస్తుల పంపకాల్లో జగన్ అస్తులకు మాత్రమే అటాచ్ మెంట్ లోకి వచ్చాయి. షర్మిల వాటగా వచ్చినా అస్తులు ఎందుకు అటాచ్ ఇవ్వలేదని ప్రశ్నించారు. మరి ఆనాడు జగన్ అస్తులు....షర్మిల అస్తులు వేరు వేరని గ్రహించి... ఈ రోజు ఎందుకు మర్చిపోయారన్న ప్రశ్నలు వైసీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వ్యక్తం చేస్తున్నారు. సరస్వతి పవర్ షేర్స్ బదాలాయింపు చేస్తే జగన్ జైలుకు వెళ్తాడని తెలిసి కూడా చేశారని ...జగన్ జైలుకు వెళ్లినా పర్వాలేదు కానీ...షర్మిలకు అస్తులు వస్తే చాలని బదలాయింపు చేస్తారా అంటూ విమర్శిస్తున్నారు.
అన్నా ...చెల్లిని కలిపే మార్గం ఇదేనా ? :
అన్న మౌనం... చెల్లి మాటల మంటల మధ్య సాగుతున్న అన్న చెల్లెల్ల సంబంధాలు మరింత మెరుగుపరచాల్సిన తల్లి వైఎస్ విజయమ్మ...ఇలా ఆస్తుల పంపకం జరగలేదని లేఖ రాయడం సరైన చర్యేనా అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మొదట్లో ఇరువురి మధ్య విభేదాల తలెత్తిన పరిస్ధితుల్లో అమె సఖ్యత కుదిర్చే ప్రయత్నం ఎంత వరకు చేశారో లేదో గానీ....ఇప్పుడు మాత్రం ఏకపక్షంగా కూమార్తె వైపు మొగ్గు చూపడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ప్రతి నిత్యం ..సభలు..సమావేశాల్లో షర్మిల ఘాటు విమర్శలు చెయ్యడం... అమెకు మద్దతుగా విజయమ్మ పదేపదే లేఖలతో రష్మిలకు వంత పాడటం సరైందేనా అంటూ ప్రస్తావిస్తున్నారు.ఇలాంటి పనులు వైఎస్ జగన్..వైఎస్ షర్మిలలు మరింత దూరం కావడం తప్ప, దగ్గరయ్యే పరిస్ధితే లేదంటున్నారు పరిశీలకులు. ఇది ప్రత్యర్ధులకు అస్త్రంగా మారడం...కుటుంబం మరింత రోడ్డున పడటం తప్పా...మరొకటి కాదంటూ వైఎస్ఆర్ అభిమానులు చెబుతున్న మాటలు.