* దిగొచ్చిన ట్రంప్.. ఇక నుంచి ఇజ్రాయెల్ దాడి చేయదంటూ ప్రకటన ..|
* ఇరాన్ గ్యాస్ ఫెసిలీటలపై దాడి చేస్తే మాత్రం కనివిని ఎరుగని దాడులు చేస్తామని హెచ్చరిక ...
అమెరికా :
ఇరాన్ ఆయిల్, గ్యాస్ నిల్వలపై దెబ్బకొట్టాలనే లక్ష్యంతో దాడులు చేస్తున్న అమెరికా, ఇజ్రాయెల్ కు ఇరాన్ షాకిచ్చింది. గల్ఫ్ దేశాల్లోన్ని చమురు కేంద్రాలపై భీకర దాడులు చేస్తామంటూ ముందస్తుగానే ప్రకటించిన ఇరాన్... అన్నంత పని చేసింది. అమెరికా మిలిటరీ బేస్ లను లక్ష్యంగా చేసుకుని సూసైడ్ డ్రోన్స్ ప్రయోగించిన ఇరాన్.. ఖతార్ లోని ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ ఫీల్డ్ రాస్ లఫాన్ రిఫైనరీపై మిస్సైళ్లతో దాడికి దిగింది. గ్యాస్ క్షేత్రం దెబ్బతిన్నట్లు ఖతార్ అధికారులు సైతం ప్రకటించారు.
ప్రపంచానికి ఐదు వంతుల గ్యాస్ సరఫరా చేసే ఈ రిఫైనరీపై ఇరాన్ గురువారం తెల్లవారుజామున మిస్సైల్ అటాక్ తో ట్రంప్ సైతం దిగొచ్చినంత పనైంది. ఇరాన్ అటాక్ తో ప్రపంచ వ్యాప్తంగా గ్యాస్ సంక్షోభం మరింతగా తీవ్రతరం అవుతుందన్న ఆందోళనతో. ఇజ్రాయెల్ వైపు నుంచి ఇరాన్ గ్యాస్ ఫెసిలీటలపై ముందస్తు దారులు ఉండవని ప్రకటించారు ట్రంప్. కానీ ఇరాన్ దాడి చేస్తే మాత్రం అంతకు రెట్టింపు దాడులు చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. గ్యాస్ ఫీల్డ్స్ నష్టం చేసుకోగూడదనే విధంగా ట్రంప్ స్టేట్ మెంట్ ఇచ్చాడు.
ఇరాన్ గ్యాప్ ఫీల్డ్ పై మొదట ఇజ్రాయల్ దాడి చేయడంతో ఇరాన్ ప్రతీకార చర్యగా ఇతార్, సాచీ, అబుధానం గ్యాప్ క్షేత్రాలతో పాటు అమెరికా సైనిక స్థావరాలపై దాడికి దిగింది. బుధవారం రాత్రి ఇరాన్ లోని సౌత్ పార్క్ గ్యాస్ ఫీల్డ్ పై ఇజ్రాయెల్ దాడి చేయడంతో కాస్త డ్యామేజ్ జరిగింది. ఈ వ్యవహారాన్ని గమనిస్తూ వస్తున్న అమెరికా.. వెంటనే దిగొచ్చి ప్రకటన చేసింది. ఇజ్రాయెల్ హింసాత్మకంగా వ్యవహరించిందని అమెరికా దీఫ్ కమాండర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ దాడి గురించి అమెరికాను ముందస్తుగా ఏమీ తెలియదని పేర్కొన్నారు. దీంతో ఇరాన్ అమాయక ఖతార్ పై దాడికి దిగినట్లు చెప్పాడు. ఇజ్రాయెల్ ఇక నుంచి గ్యాస్ ఫీల్డ్స్ పై దాడి చేయదని అమెరికా ప్రకటించింది. విలువైన గ్యాస్ క్షేత్రాలను ధ్వంసం చేసుకుంటే మరింత గ్యాస్ సంక్షోభం వస్తుందనే ఉద్దేశంతో ట్రంప్ ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది.
ఖతార్ గ్యాస్ ఫీల్డ్ పై ఇరావ్ దాడి తర్వాత ఇక నుంచి ఇజ్రాయెల్ వైపు నుంచి దాడులు ఉండమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ లోని విలువైన సాత్ పార్ గ్యాప్ పై ఇజ్రాయెల్ బాడి చేయదని చెప్పాను. అమాయక ఖాతర్ లాంటి దేశాలపై ఇరాన్ దాడి చేస్తే మాత్రం ఊరుకోమని స్పష్టం చేశాడు.