Monday, 23 March 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

మాకు ఒక రోజు వస్తుంది... ఎవ్వర్ని వదిలేది లేదు.... ! - పిన్నెల్లి హెచ్చరిక ....

19 Mar 2026
12:22 PM
38


నెల్లూరు  : 

మాచెర్ల మాజీ వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 99 రోజుల అనంతరం నెల్లూరు జైలు నుంచి విడుదలయ్యారు. వెల్దూర్తి మండలంలో జంట హత్య కేసులో గురజాల కోర్టు నిన్న బెయిల్ మంజూరు చెయ్యడంతో అయన ఈ రోజు జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్బంగా పిన్నెల్లి మీడియాతో మాట్లాడుతూ అన్యాయంగా అక్రమంగా అరెస్టు చేసి తమను 99 రోజుల పాటు జైలులో ఉంచారని, తమకు ఒక రోజు వస్తుందని, ఎవ్వర్ని వదిలేది లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జైలు విడుదలైన పిన్నెల్లి  మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ , ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్బంగా నెల్లూరు జైలు వద్దకు భారీగా చేరుకున్న వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు పిన్నెల్లిని  భుజాలపైకి ఎత్తుకొని నినాదాలు చేస్తూ బాణసంచా కాల్చారు.

Article Image

ఈ సందర్బంగా పిన్నెల్లి మాట్లాడుతూ  వెల్దూర్తి గ్రామంలో టిడిపిలోని రెండు వర్గాల కొట్లాడుకుని హత్య చేసుకుంటే అన్యాయంగా, అక్రమంగా తమను 99 రోజుల పాటు జైలులో ఉంచారన్నారు.  హత్యకు నెల రోజుల క్రితం కూడా గ్రామంలో టిడిపిలోని రెండు వర్గాల మధ్య గోడవలు జరిగాయని, ఈ దాడి అనంతరం జిల్లా ఎస్పీ కూడా గ్రామాన్ని సందర్శించారని,  అయనకు అన్ని విషయాలు తెలుసునన్నారు. టిడిపిలోని ఇరు వర్గాలే కొట్లాడుకుని వారే చంపుకున్నారని చెప్పడం జరిగిందన్నారు. కానీ  ఉద్దేశ్య పూర్వకంగా తమను ఇరికించారని, మాకు ఒక రోజు వస్తుందని, అప్పుడు అధికారులు, నాయకులు ఎవ్వరిన్ని వదిలేదు లేదని హెచ్చరించారు. మాపై కేసులు పెట్టిన వారు ఎవరో ...  వారు మా ఆఫీసుకు ఏనాడు వచ్చింది లేదని, వారి ముఖాలు కూడా చూడలేదన్నారు. అయినా అక్రమంగా కేసులో ఇరికించారని, మాకు ఒక రోజు వస్తుందని, అప్పుడు  ఖచ్చితంగా వారిని చట్టం ముందు నిలబెడతామన్నారు. 

Article Image

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!