Monday, 23 March 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

మైనర్ ఇరిగేషన్ కార్యాలయంలో ఉద్యోగులు కోట్లాట .. !

18 Mar 2026
07:38 PM
71

* ఏకంగా కార్యాలయంలోనే ఘర్షణ ...
* పదవి విరమణ పొందినా ...కార్యాలయంలో ఇంకా చక్రం తిప్పుతున్న ఆ ఉన్నతాధికారి ..
* రిటైరైనా శాఖపై పట్టుపోకుండా జాగ్రత్తలు ...
* ఇప్పటికి ఆ అధికారికై వత్తాసు పలుకుతున్న సిబ్బంది....

Kadapa :  

కడప మైనర్ ఇరిగేషన్ కార్యాలయంలో వాటాల్లో తేడా రావడంతో ఇరువురు ఉద్యోగులు ఏకంగా కార్యాలయంలోనే గొడవకు దిగారు. గొడవతో సరిపోలేదు కాదు... ఏకంగా గుడ్డలు చెరిగేలా కొట్టుకున్నారు...తన్నుకున్నారు...చివరకు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా హుందాగా..గౌరవ ప్రధంగా వ్యవహరించాల్సిన అధికారులు ఇలా ఘర్షణ పడటం ఆ శాఖలో అవినీతిని రోడ్డున పడేసినట్లయ్యిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

కడప నగరంలోని మైనార్ ఇరిగేషన్ ఇఇ కార్యాలయంలో చాలా కాలంగా అవినీతి రాజ్యమేలుతొందన్న ప్రచారం అందరి నోట వినిపిస్తుంది. ఈ శాఖ ద్వారా  రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతులకు నీరు అందించాలని పూర్తికాని ప్రాజెక్టులను, చెరువులను,ఇతరత్రా చిన్న తరహా సాగునీటి వనరులను సద్వినియోగం చేసుకునేందుకు సకాలంలో పూర్తి చేసేందుకు పనులు చేపడుతుంది. కానీ ఈ పనులను ఆసరాగా చేసుకున్న కడప జిల్లా మైనర్ ఇరిగేషన్ డివిజన్ అధికారుల పాలిట వరంలా మారింది.  వారి ధన దాహాన్ని తీర్చే కల్పతరువులా మారింది. కడప ఇరిగేషన్ డివిజన్ పరిధిలోకి కడప, జమ్మలమడుగు, బద్వేల్, ప్రొద్దుటూరు, మైదుకూరు, రాజంపేట, కోడూరు తదితర డివిజన్ లు ఈ కార్యాలయం పరిధిలోకి వస్తాయి. ఈ పరిధిలో  చెక్ డ్యాంలు, చెరువులు, మైనార్ ఇరిగేషన్ ప్రాజెక్టుల మరమ్మత్తులు, డిసిల్ట్ వర్కులు, పూడిక పనులు, గేట్లు మరమ్మత్తులు  వంటి పనులను ఈ శాఖ  చేస్తుంటుంది. కానీ ఈ శాఖ పరిధిలో చేపడుతున్నఈ పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుంటుంది.అవినీతి తంతును జరిపించేందుకు ఈ శాఖలోని కొందరు జేఇలు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు,  చాలా కాలంగా ఇక్కడే తిష్టవేసి చక్రం తిప్పుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ప్రతి పనిలో ఆడిందే ఆట పాడిందే పాటగా మార్చుకుంటున్నారని కాంట్రాక్టర్లు చర్చించుకుంటున్నారు. ఇందుకు అనుకూలమైన అధికారులు ఉండటంతో వారికి అడ్డు అదుపు లేకుండా పోయింది.

అవినీతికి అడ్డగా మార్చిందెవరు ? : 

కడప ఇరిగేషన్ డివిజన్లో ఒక్కో ఉద్యోగి ఒక్కో పనికి ఒక్కో రేటు పెట్టుకుని మరి వసూల్లు చేస్తున్నారన్న అరోపణలున్నాయి. శాఖ పరిధిలో చేపట్టిన పనులకు సంబంధించి చెక్కు మెజర్మెంట్ చేయడానికి అగ్రిమెంట్ బిల్లులు పంపాలన్న, అగ్రిమెంట్ చేయాలన్న ఇలా ప్రతిదానికి డబ్బులు వసూలు చేస్తున్నారని కొంత మంది కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. అంతేకాదు కొంత మంది జేఇలు  ఇన్ చార్జి డీఇలుగా ఉంటూ బినామీ పేర్లతో కాంటాక్ట్ లు కూడా చేసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి.కొంత మంది  బినామీల పేర్లతో వర్కులు చేస్తూ సంపాదించుకుంటుంటే... మరి కొంత మంది మాత్రం ఏ పని జరిగినా  పనులకు సంబంధించి ఇక్కడ ఒక సీనియర్ అసిస్టెంట్, మరో జూనియర్ అసిస్టెంట్, ఏటీవో పైలు కదలించినందుకు ఇంతంటూ వసూల్లు చేస్తున్నారన్న ప్రచారం నడుస్తుంది. అంతేకాకుండా కాంట్రాక్టర్లతో కుమ్మకై ప్రభుత్వ అనుమతి లేని పనులకు సంబంధించి బిల్లులు కూడా చేస్తున్నారన్న ప్రచారం నడుస్తుంది.  ఇలా వీరి చేసిన అక్రమాలు బయటికి రాకుండా ఉండేందుకు బిల్లులు అయిన వెంటనే డేటాను తొలగిస్తున్నారన్న  ఆరోపణలు సైతం ఉన్నాయి.  ఇదంతా ఉన్నతాధికారులకు తెలియకుండానే జరుగుతుందా అంటే... తెలియకుండా ఎమీ లేదు... వారి ఆదేశాల మేరకు చేపట్టిన పనులే కాబట్టి వారే ఇలాంటి వ్యవస్దను నడిపిస్తున్నారన్న ప్రచారం కూడా లేకపోలేదు.  చాలా కాలంగా ఈ కార్యాలయంలో జరుగుతున్నా .. ఎవరికి వారుగా సర్దుకోవడం తప్పా శాఖను సరిదిద్దాలన్న ప్రయత్నం ఎవ్వరు చెయ్యలేదు. ఇలాంటి వ్యవహారాలను ఇక్కడ పని చేస్తున్న ఉద్యోగులకు అలవాటు చేసిందే ఇది వరకు ఇక్కడ పని చేస్తున్న ఓ ఉన్నతాధికారేనన్న ప్రచారం లేకపోలేదు.  అయన ఇటీవలే పదవి విరమణ పొందిన ..ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు ఇప్పటికి అయన కనుసన్నల్లోనే పని చేస్తున్నారని టాక్ నడుస్తుంది. కార్యాలయానికి రాకపోయినా ... ఇక్కడ ఉన్న ఉద్యోగులను తన చెప్పుచేతల్లో పెట్టుకుని తన మాట వినని వారి గురించి లీకులు ఇప్పించడం, బురద జల్లించడం చేస్తున్నారన్న చర్చ నడుస్తుంది. 

Article Image

                          దాడిలో గాయపడిన డీఈ వేణుగోపాల్ రెడ్డి ...

డిఇ..జూనియర్ అసిస్టెంట్ మధ్య వివాదం : 
జల వనరుల శాఖ బద్వేలులో డీఈగా పని చేస్తున్న వేణుగోపాల్ రెడ్డి కడపలోని ఈఈ కార్యాలయానికి మంగళవారం వచ్చారు. అక్కడ జూనియర్ అసిస్టెంట్ ప్రణీత్ రెడ్డి వద్దకు వెళ్లి ఓ పనికి సంబంధించిన ఎం.బుక్కు గురించి ఆరా తీశారు. ఈ సమయంలో నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. గదమా యిస్తూ మాట్లాడారు. నిర్లక్ష్యంగా, పరుష పదజాలంతో మాట్లాడతావా? అంటూ డీఈ వాగ్వాదానికి దిగారు. దీంతో ఇద్దరి మధ్య మాటా మాట పెరిగి బాహాబాహీ తలప డ్డారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపిం చుకున్నారు. చొక్కాలు చింపుకొన్నారు. ఘర్షణ  పడుతూనే వేణుగోపాల్ రెడ్డి, ప్రణీత్రెడ్డి కార్యా లయం నుంచి బయటికి వచ్చారు. ప్రాంగణంలో మరోసారి ఇద్దరూ గొడవ పడ్డారు. వీరిద్దరి కొట్లాడుకుంటున్నా అక్కడి వారు ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోయారు. లంచాల వసూళ్ల విషయమై ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తి కొట్టుకున్నట్లుగా ప్రచారం సాగుతోంది. చివరకు డీఈ వేణుగోపాల్రెడ్డి వెళ్లి తనపై చోటుచేసుకున్న దాడి విషయమై ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రణీత్ రెడ్డి మాత్రం రిమ్స్ ఆసుపత్రిలో చేరి చికిత్స  తీసుకున్నారు. అయితే డీఇపై దాడిని ఇంజినీర్ల సంఘం ఖండించింది. జూనియర్ అసిస్టెంట్పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. జల వనరుల శాఖ కార్యాలయ సముదాయం వద్ద చోటుచేసుకున్న ఈ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది.

Article Image

                  జూనియర్ అసిస్టెంట్ ప్రణిత్ రెడ్డి...

 

 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!