* మాచర్ల మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి బెయిల్ మంజూరు చేసిన గురజాల కోర్టు ...
* రేపు ఉదయం 11 గంటలకు నెల్లూరు జైలు నుంచి విడుదల కానున్న పిన్నెల్లి..
* 98 రోజులుగా నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
* జంట హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పిన్నెల్లి పై కేసు నమోదు
* షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన గురజాల కోర్ట్
గుంటూరు :
మాచర్ల మాజీ ఎమ్మెల్యే వైసీపీ సీనియర్ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఊరట లభించింది. గురజాల కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.50 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని పిటిషనర్‌ను ఆదేశించింది. ఇదే కేసులో గతంలోనే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం సాక్షులను బెదిరించారని, సాక్ష్యాలను తారుమారు చేశారని సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో ఈ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం వారి బెయిల్ రద్దు చేసింది. దీంతో పిన్నెల్లి సోదరులు దాదాపు 98 రోజులుగా నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉంటున్నారు. ఈ నేపధ్యంలోనే ఈ రోజు గురజాల కోర్టు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. ఈ రోజు బెయిల్ మంజూరు కావడంతో అయన రేపు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.

పిన్నెల్లి సోదరుడు వెంకట్రామిరెడ్డికి దక్కని బెయిల్ ... :
అయితే ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డికి మాత్రం న్యాయస్థానం బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ రావడంతో ఆయన నెల్లూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలున్నాయి. అయితే నేడు, రేపట్లో ఆయన నెల్లూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యే అవకాశముంది.