Monday, 23 March 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / జాతీయ వార్తలు

జ్యూస్ సెంటర్లపైన గ్యాస్ ఎఫెక్ట్ ... !

17 Mar 2026
07:46 PM
73


Bengaluru Cafe Gas Charges on Lemon Juice bill : 

పశ్చిమాసియాలో తలెత్తిన యుద్ధం కారణంగా భారత దేశంలో గ్యాస్ ఇక్కట్లు తీవ్ర రూపం దాల్చాయి.  దీంతో గ్యాస్ ధరలపైనా  తీవ్ర ప్రభావం పడిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో టిఫిన్ తిన్నా జీఎస్టీ లాగ గ్యాస్ టాక్స్ సైతం బెంగుళూరు, చెన్నై వంటి నగరాల్లో వసూలు చేస్తున్న ఘటనలు తెరపైకి వచ్చాయి.  బెంగళూరు, చెన్నై, ముంబయి వంటి మెట్రో నగరాల్లో అనేక హాస్టళ్లు, రెస్టారెంట్లు మూసివేశారు. మరికొన్ని చోట్ల అయితే గ్యాస్ లేక మెనూను తగ్గించారు. అంతేకాకుండా పూరీ, ఇడ్లీ, వడ, దోశ, చికెన్ కూర వంటి వాటికి గ్యాస్ ఛార్జీలను కలిపి బిల్లు వేశారు. ఇప్పటి వరకు ఇలాంటి వార్తలను ఇటీవల అశ్చారాన్ని కలిగించాయి. అయితే ఇప్పుడు తొలిసారి నిమ్మకాయ జ్యూస్‌కు కూడా గ్యాస్ ఛార్జీలు వసూళు చేసింది ఓ కేఫ్.  రెండు జ్యూస్‌లకు 358 రూపాయలు కాగా.. 5 శాతం అంటే 17 రూపాయల గ్యాస్ ఛార్జీలు వేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

Article Image

గ్యాస్ చార్జి జూస్ కు వసూళ్లా ?  : 
బెంగళూరు నగరంలోని 'థియో కేఫ్' కు వెళ్లిన ఒక కస్టమర్ రెండు 'మింట్ లెమనేడ్స్' ఆర్డర్ చేశారు. ఒక్కో గ్లాసు ధర రూ. 179. ఎండాకాలం కావడంతో రెండూ తాగేసిన ఆయన.. ఆ తర్వాత బిల్లు తీసుకురమ్మని సిబ్బందికి చెప్పాడు. ఈ క్రమంలోనే సిబ్బంది బిల్లు తీసుకొచ్చి అతడి చేతిలో పెట్టారు. జీఎస్టీతో పాటు అదనంగా 5 శాతం గ్యాస్ క్రైసిస్ ఛార్జ్ ఉండటం చూసి సదరు కస్టమర్ అవాక్కయ్యాడు. ముఖ్యంగా రెండు నిమ్మకాయ జ్యూస్‌లకు కలిపి రూ. 17.01 గ్యాస్ ఛార్జీగా వసూలు చేయడం చూసి.. గ్యాస్ అవసరం లేకుండా తయారు చేసే వీటికి కూడా గ్యాస్ ఛార్జ్ ఏంటని ముక్కున వేలేస్కున్నాడు. ఇదే విషయాన్ని సిబ్బందిని కూడా అడగ్గా.. అతడు అన్ని బిల్లులపై వేస్తున్నాం సార్ అని చెప్పగా.. చేసేదేమీ లేక బిల్లు కట్టాడు.

నెట్ ఇంట్లో పేలుతున్న జోకులు  .. : 
అయితే ఈ బిల్లును ఫొటో తీసిన సదరు కస్టమర్ ఎక్స్ వేదికగా దీన్ని పోస్ట్ చేశాడు. దీంతో ఈ బిల్లు కాస్తా క్షణాల్లోనే నెట్టింట తెగ వైరల్ అవుతుంది. "నిమ్మకాయను ఉడకబెట్టి రసం తీశారా?" ఏంటి బ్రో గ్యాస్ వేశారని కొందరు నెటిజెన్లు ప్రశ్నిస్తుండగా.. నిమ్మరసం అనేది శీతల పానీయం అని, దీన్ని తయారు చేయడానికి గ్యాస్‌తో పనేముందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. "బహుశా గ్యాస్ వాడి నిమ్మకాయలను వేడి చేసి ఉంటారు" అని ఒకరు జోక్ చేయగా.. "మున్ముందు బెంగళూరులో వాతావరణం మారినందుకు కూడా ట్యాక్స్ వేస్తారేమో" అని మరొకరు ఎద్దేవా చేశారు.

కేప్ కు మద్దతు పలుకుతున్న వారు లేకపోలేదు... : 
అయితే అందరూ కేఫ్‌ను తప్పుపట్టడం లేదు. గ్యాస్ ధరల పెరుగుదల వల్ల చిన్న చిన్న రెస్టారెంట్లు నడపడం భారంగా మారుతోందని కొందరు వాదిస్తున్నారు. "15 రూపాయలకే వచ్చే నిమ్మరసాన్ని రూ. 179 పెట్టి తాగగలిగే వారికి.. అదనంగా మరో 17 రూపాయలు చెల్లించడం పెద్ద భారమేమీ కాదు" అని ఒక యూజర్ పేర్కొన్నారు. పైగా సదరు కేఫ్ 5 శాతం డిస్కౌంట్ (సుమారు రూ. 18) కూడా ఇచ్చిందని.. తద్వారా ఆ గ్యాస్ ఛార్జీని వారే భరించినట్లు అవుతుందని కొందరు కేఫ్ యాజమాన్యాన్ని సమర్థించారు. మరి ఈ వార్త చూస్తే మీకేమనిపిస్తుందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!