Monday, 23 March 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

కూటమి ప్రభుత్వంలో నో యాక్షన్... అంతా యాక్షన్... !

17 Mar 2026
03:42 PM
122

* డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన ఎంపి పుట్టా మహేష్ పట్ల...
* పట్ల సీఎం చంద్రబాబు వ్యవరించిన తీరు అత్యంత దారుణం..
*  అత్యాచారాలు మోసాలపై కమిటీలు వేసి కాలయాపన చేస్తున్న  ప్రభుత్వం...
* మాజీ సిఎం వైఎస్ జగన్ మోహాన్ రెడ్డి ఫైర్ ....

తాడేపల్లి   : 

పార్లమెంట్ చరిత్రలో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన ఎంపి పుట్టా మహేష్ యాదవ్ అని, ఈ వ్యవహారం పుట్టా మహేష్ తో మొదలై అతనితో ఆగిపోలేదని వైసీపీ అధినేత, మాజీ సిఎం వైఎస్ జగన్ మోహాన్ రెడ్డి విమర్శించారు.  ఇలాంటి వాటిపట్ల సీఎం చంద్రబాబు వ్యవరించిన తీరు అత్యంత దారుణం అని మండిపడ్డారు. తప్పు చేసిన వారిపట్ల చంద్రబాబు చర్యలు తీసుకోలేదని అందుకే రాష్ట్రంలో విచ్చలవిడిగా డ్రగ్స్ దందాలు జరుగుతున్నాయని విమర్శించారు. ఈ ప్రభుత్వం అత్యాచారాలు మోసాలపై కమిటీలు వేసి కాలయాపన చేస్తోందని, కోనేటి ఆదిమూలం మహిళపై లైంగిక దాడిచేస్తే చర్యలు లేవని వైఎస్ జగన్ మండిపడ్డారు. తాడేపల్లిలో ఒంగొలు నియోసకవర్గం క్యాడర్ తో భేటి అయ్యారు. 

డ్రగ్స్ తీసుకుంటూ టీడీపీ ఎంపి పుల్లా మహేష్ పట్టుబడ్డాడు... పార్లమెంటు చరిత్రలో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ ఎంపీ ఆయనే. ఇలాంటి వాటి పట్ల సీఎం చంద్రబాబు వ్యవరించిన తీరు అత్యంత దారుణం.. ఒక పాలకుడిగా ఆయన వ్యవహరించలేదు. తప్పు చేసిన వారిపట్ల తయన చర్యలు తీసుకోలేదు. అందుకనే డ్రగ్స్ దందా వచ్చలవిడిగా జరుగుతుందన్నారు. అత్యాచారం చేశారని ఆపై మోసం చేశారని బాధితురాలు స్వయంగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తే దానిపై కమిటీలు అంట. కోనేటి ఆదిమూలం మహిళ మీద దారుణమైన లైంగిక దాడి చేస్తే పంచాయితీ చేశారు. కిజిబీపీ మహిళా ప్రిన్సిపాల్ మీద వేధింపులకు పాల్పడ్డ  అముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ మీద నో యాక్షన్. మహిళలతో అశ్లీల వీడియో చేసిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మీద నో యాక్షన్ .. చివరకు మంత్రి సంధ్యారాణి పీఏ మీద నో యాక్షన్.. ప్రస్తుత టీటీడీ చైర్మన్ మీదా నో యాక్షన్....  వీడియో, ఫొటోలతో పట్టుబడినా నో యాక్షన్ ... అంటూ వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు.

ఆదినారాయణ రెడ్డి కొడుకు డ్రగ్స్ తీసుకుంటూ పెట్టుబడితే నో యాక్షన్ ఇలాంటి వాటికి వత్తాసు పలికి భావన సీఎం చంద్రబాబుకు ఉంది కాబట్టే ఇలాంటివి జరుగుతున్నాయి. తన కొడుకు స్విమ్మింగ్ పూల్స్ వద్ద జుగుతూ, తూలుతూ అమ్మాయిలతో డ్యాన్స్లు చూస్తే వో యాక్షన్... తన బావమరిది అమ్మాయిలకు ముదైనా పెట్టాలి, కడుపైనా చేయాలని బహిరంగంగా మాట్లాడితే నో యాక్షన్.. చిన్నప్పుడు తాను ఇంతకంటే ఎక్కువే చేశానని చంద్రబాబు అనటం.... అయన మైండ్ సెట్ ఎలాంటిదో  సూచిస్తున్నాయి. వీళ్తెవరికీ కూడా ప్రజలకు మంచి చేయాలన్న మైండ్ సెట్ లేదు ...చంద్రబాబు వచ్చి రెండోవు అయిపోయింది. ఇక మిగిలించి రెండేళ్లు... చివరి ఏడాది ఎలాగూ వెన్నికలున్నాయి. మధ్యలో నా పాదయాత్ర కూడా ఉంటుంది. జరన్ 0.2 లో కార్యకర్తలకు పెద్దపీట వేస్తా ...కార్యకర్తల ద్వారానే ప్రజలకు మరింత మంచి జరుగుతుంది అని వైఎస్ జగన్ అన్నారు. 


పేదలను, మధ్యతరగతి ప్రజలను ఆదుకున్నాం. మన హయాంలో రూ.3.31 లక్షల కోట్లు అప్పు చేస్తే రూ.2.7లక్షల కోట్లు అక్కచెల్లెమ్మల ఖాతాలో వేశాం. రెండేళ్లకీ చంద్రబాబు కమిటెడ్ అప్పులు. గ్రాప్ అప్పులు రెండేళ్లకే రూ.3.30 లక్షల కోట్లు దాటాయి. చంద్రబాబు హామీలు మోసాలుగా తేలిపాయాయి' అని వైఎస్ జగన్ అన్నారు. మన పథకాలన్నీ చంద్రబాబు నాయుడు రద్దు చేశారు. ఈ డబ్బులన్నీ ఎవరి జేబులోకి వెళ్లిపోయాయి. జగన్ ఏం చేయగలిగాడు. బాబు ఎందుకు చేయలేకపోతున్నాడని చర్చిస్తున్నారు. అవినీతికి తావు లేకుండా మనం పధకాలు అమలు చేశాం. ఇప్పుడు దోచుకో... పంచుకో.. తిసుకో.. ఇదే కొనసాగుతుంది.  రాష్ట్రానికి రాచాల్సిన ఆదాయాలు రావడం లేదు. అమరావతి పనుల్లో తీవ్రమైన అవినీతి. భూములను శెనక్కాయలకు, బెల్లానికి ఇచ్చేస్తున్నారు. ఏపీలో ఆర్థిక పరిస్థితి ఆధ్వాన్నంగా ఉంది.

 

 

 

 

 

 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!