కడస :
కడపలో ఐదుగురు వైసీపీ కార్పొరేటర్లపై అధిష్టానం వేటు వేసింది. ఐదేళ్లు పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీ గీత దాటి వేరే పార్టీలో చేరడంతో వారిపై వైసీపీ అధిష్టానం కఠిన నిర్ణయం తీసుకుంది. దీంతో వారిని పార్టీ నుంచి తొలగించింది. వైసీపీ నుంచి తొలగించిన వారిలో 5వ డివిజన్ కార్పొరేటర్ బండి జయమ్మ, 12వ డివిజన్ కార్పొరేటర్ శివకోటిరెడ్డి, 13వ డివిజన్ కార్పొరేటర్ రామలక్ష్మణరెడ్డి, నగర ఉపాధ్యక్షుడు బాలకోండయ్య, 46వ డివిజన్ ఇన్ చార్జి నాగేంద్రరెడ్డిలు ఉన్నారు. వీరిలో వైసీపీ తరపున కార్పొరేటర్లుగా గెలిచి మరో పార్టీ చేరి పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించారని, మరో ఇద్దరు డివిజన్ ఇన్ చార్జులు కూడా పార్టీ మారారని వీరిని కూడా పార్టీ నుంచి తొలగించారు. వీరి ఫిరాయింపుల విషయమై కడప ఇన్ చార్జి అంజాద్ బాష జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథరెడ్డివి విన్నవించగా, వీరి విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఈ ఐదుగురిని పార్టీ తొలగించాలని పార్టీ అధిష్టానం ఆదేశించడంతో జిల్లా పార్టీ వీరిపై చర్యలు తీసుకుంది.