Monday, 23 March 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

వివేకా హత్య కేసులో... వైఎస్ సునీతకు కడప ఎంపీ అవినాష్ రెడ్డి ప్రశ్నలు ... !

16 Mar 2026
07:16 PM
22

* బాబు ఇబ్బందుల్లో ఉన్న  సమయంలోనే  సునీత బయటకి వస్తారు ..!
* 13 లక్షల ఫైల్స్ చదివాను అనే సునీత ..
* దస్తగిరి, డైవర్ ప్రసాద్, రాజశేఖర్, వివేకా రెండవ భార్య స్టేట్మెంట్ చదివారా ? 
* హత్యకు ముందు రోజు .. అసిస్టెంట్ రాజశేఖర్ ను ఎందుకు కాణిపాకం పంపారు ?     
* డాక్యుమెంట్స్ కోసమే హత్య చేశామన్న దస్తగిరి బెయిల్ అడ్డుకొనే ప్రయత్నం ఎందుకు చేయలేదు ?
* వచ్చే ఎన్నికల వరకు కేసు సాగదీయాలని చంద్రబాబు కుట్ర... 
* న్యాయ విచారణకు సహకరించండి... 

 న్యూఢిల్లీ     : 

వివేకా కేసుకు సంబంధించి ఆయన కుమార్తె సునీత అనేక కీలకాంశాలను పక్కదారి పుట్టించారన్నారని, తనపై తప్పుడు సాక్ష్యాలు చెప్పాలని కొందరిపై సునీత ఒత్తిడి చేశారని   కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపించారు. ఈ కేసులో తనను అన్యాయంగా ఇరికించారని, సీబీఐ కూడా దీనికి సమాధానం చెప్పాలన్నారు. వివేకా గుండెపోటుతో చనిపోయారని సృష్టించిందే సునీత అని అవినాష్రెడ్డి స్పష్టం చేశారు.

ఆదివారం పులివెందులలో మాజీ మంత్రి వైఎస్ వివేకా కుమార్తె వైఎస్ సునీత మీడియాతో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ కు న్యూఢిల్లీలో  మీడియాతో అవినాష్ రెడ్డి మాట్లాడారు.  వైఎస్  వివేకాది గుండెపోటు అని సృష్టించింది సునీతతో పాటు నర్రెడ్డి, రాజశేఖర్రెడ్డి అనే వ్యక్తులు అని, అసలు వివేకాని మర్దర్ ఫర్ గెయిన్ దిశగా సునీత ఎందుకు విచారణ కోరలేదని అవినాష్ రెడ్డి  ప్రశ్నించారు. వివేకా హత్య గురించి పోలీసులకు సమాచారం ఇచ్చింది తానేనని అవినాష్ అన్నారు.  

రాంసింగ్ వచ్చాకా సిబీఐ  దర్యాప్తు పక్కదారి పట్టింది... :  

వివేకా హత్య కేసులో నాపై తప్పుడు సాక్ష్యాలు చెప్పాలని సునీత కొందరిపై ఒత్తిడి చేశారు. వారు చెప్పినట్లే సీబీఐకి చెప్పాలని కొందరని సునీత బెదిరించారు. రామ్ సింగ్ విచారణ అధికారిగా వచ్చాక కేసు పక్కదారి పట్టింది. సీబీఐ డైరెక్టర్కు అనేక సాక్ష్యాలు సమర్పించి విచారణ చేయాలని మొరపెట్టుకున్నా గతంలో సీబీఐకి నచ్చిన వారిని మాత్రమే పిలిచి మాట్లాడారు. సీబీఐ ఏకపక్షంగా దర్యాప్తు చేసింది' అని స్పష్టం చేశారు.


వచ్చే ఎన్నికల వరకు కేసు సాగదీయాలనేది చంద్రబాబు కుట్ర :

ఈ కేసును చంద్రబాబు రాజకీయంగా వాడుకుంటున్నారు. చంద్రబాబు హయాంలోనే వివేకా హత్య జరిగింది. వచ్చే ఎన్నికల వరకూ వివేకా కేసు సాగదీయాలనేది సునీత, చంద్రబాబు ఉద్దేశం. చంద్రబాబుకు రాజకీయంగా అవసరం ఉన్న సమయంలో సునీత బయటకొస్తారు. టాపిక్ డైవర్షన్ కోసం మీడియా ముందుకొచ్చి ఈ కేసు అంశాన్ని లేవనెత్తుతారు. పక్కాగా తెలుగుదేశం పార్టీకి లబ్ది చేకూర్చేందుకే వీరు ప్రయత్నిస్తున్నారని, ఇధి కేవలం బురద జల్లే కార్యక్రమమని, ప్రజలు అన్ని చూస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల వరకు సాగదీయాలని చూసే వారి ఆటలు సాగవని, దయచేసి న్యాయ విచారణకు సహకరించాలని కోరారు. 

లెటర్ గురించి సునీత సమాధానం చెప్పలేదు... ?
సీబీఐ స్టేట్మెంట్ తీసుకునే సమయంలో సునీతను లెటర్ గురించి అడిగారు. లెటర్ గురించి సీబీఐ అడిగిన ప్రశ్నలకు సునీత సమాధానం చెప్పలేదు. గతంలో సునీత మాటలను నేను కోర్టుకు సమర్పించాను. సునీత కీలక అంశాలను పక్కదారి పట్టించారు. చట్టం, ధర్మం, దేవుడిపై నాకు నమ్మకు ఉంది.

దస్తగిరి బెయిల్ రద్దు కాకుండా అడ్డుపడుతున్నారు...  : 

సునీతకు దస్తగిరి అత్యంత ఆప్తుడు, దస్తగిరి బెయిల్ రద్దు కాకుండా సునీత అడ్డుకుంటున్నారు. దస్తగిరి తరఫున బుర్రాను పెట్టి కేసు వాదనలు వినిపిస్తున్నారు. దస్తగిరి సీబీఐకి చెప్పిన స్టేట్మెంట్లో అనేక కీలక అంశాలున్నాయి. విచారణ సక్రమంగా చేయాలని సీబీఐ డైరెక్టర్కు చాలాసార్లు మొరపెట్టుకున్నా మూడేళ్లుగా విచారణ పక్రమంగా జరగకుండా సునీత అడ్డుకుంటున్నారు. ఏదో ఒక రోజు నిము నిగ్గు తేలుతుంది. ఈ కేసును సీబీఐ, న్యాయస్థానం త్వరగా విదారణ పూర్తి చేయాలి' అని కోరారు.

రాజకీయ లబ్ధి కోసమే సునీత ఆరాటం.. :

ఈ కేసుకు సంబంధించి రాజకీయ లబ్ధి కోసమే సునీత ఆరాటపడుతున్నారన్నారు అవినాష్ రెడ్డి.  దస్తగిరి, డ్రైవర్ ప్రసాద్, రాజశేఖ్ ఇచ్చిన స్టేట్మెంట్స్ను సునీత చదివారా?, హత్యకు ముందు రోజు రాజశేఖర్ను ఎందుకు శ్రీకాళహస్తికి పంపించారు. స్టేట్మెంట్లో రాజశేఖర్ అనేక విషయాలు చెప్పారు. చివరి రోజుల్లో వివేకానందరెడ్డిని మానసికంగా వేధించారు. డాక్యుమెంట్స్ కోసమే వివేకానందరెడ్డిన హత్య చేశామని దస్తగిరి చెప్పాడు. పీఏ కృష్ణారెడ్డి ఇచ్చిన లెటర్ను సునీత పోలీసులకు ఎందుకు ఇవ్వలేదు. దస్తగిరి బెయిల్ రద్దు చేయాలని మేం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాం' అని స్పష్టం చేశారు.


ఆ కోణంలో ఎందుకు విచారణ చేయలేదు..?

సిబిఐ వన్ సైడ్ గా దర్యాప్తు జరిపింది. హత్య జరిగిన రోజు చంద్రబాబు అధికారంలో ఉన్నారు. సాక్షులకు శిక్షణ ఇచ్చి నాకు వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ ఇప్పించారు. శివ ప్రకాష్ రెడ్డి తనకి ఫోన్ చేసి.. వివేకా కు గుండె పోటు అని చెప్పారు. గుండె పోటు. చ్చిందని థియరీ సృష్టించింది సునీతక్కు, రాజశేఖర్ రెడ్డినే. దీనిపై ఎందుకు విచారణ అడగడం లేదు. వివేకాను ఆయన కుటుంబం వదిలేసింది. ఆయన చెక్ పవర్ తిపేశారు. షమీమ్, ఆమె కొడుకుకు ఆస్తులు పోవద్దనే వివేకాను హత్య చేసి ఉండవచ్చే కోణంలో ఎందుకు దర్యాప్తు చేయలేదు. వివేకాది మర్డర్ ఫర్ ది గెయిన్ అనే కోణంలో ఎందుకు వివారణ చేయలేదు. ఈ అంశాలపై ప్రధాన మంత్రి, హోమ్ మంత్రికి లేఖ రాశాను" అని అవినాష్ స్పష్టం చేశారు.

 

 

 

 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!