* పుట్టా మహేష్ వెంటనే ఎంపీ రాజీనామా చేయాలి
* పార్టీ నుంచి ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలి..
* నాడు డ్రగ్స్ రహిత ఏలూరు పార్లమెంట్ అన్న మహేష్ ...
* ఇప్పుడు ఆయనే డ్రగ్స్ పార్టీలో పట్టుబడటం సిగ్గుచేటు ...
* ఎంపీ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి...
* లేకపోతే పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు ...
* * ఏలూరు జిల్లా వైసీపీ నాయకుల డిమాండ్
ఏలూరు :
హైదరాబాద్ శివారు మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీ ఘటనలో పట్టుబడిన ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వైయస్సార్‌సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు, కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. డ్రగ్స్ టెస్ట్‌లో కూడా ఆయనకు పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయ్యిందన్న ఆయన, టీడీపీ ఇప్పుడు రాజకీయ పార్టీగా కాకుండా ‘తెలుగు డ్రగ్స్ పార్టీ’గా మారిపోయిందని అన్నారు. డ్రగ్స్ కారణంగా యువత నాశనం అవుతున్నారని, తాను గెలిస్తే డ్రగ్స్ లేని ఏలూరు పార్లమెంట్‌గా తీర్చిదిద్దుతానని, ఎన్నికల సమయంలో చెప్పిన వ్యక్తి, గెల్చిన తర్వాత ఇప్పుడు డ్రగ్స్ పార్టీలో పట్టుబడటం అత్యంత సిగ్గుచేటని ఆక్షేపించారు.
ప్రెస్‌మీట్‌లో దూలం నాగేశ్వరరావు ఇంకా ఏం మాట్లాడారంటే..:
ప్రజాస్వామ్యానికే అవమానం :
మిత్రులు రాజస్థాన్ చెందిన మాజీ ఎమ్మెల్యే నితీన్‌శర్మతో కలిసి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌యాదవ్ డ్రగ్స్ పార్టీ నిర్వహించారు. ఒక పార్లమెంట్ సభ్యుడు అయి ఉండి డ్రగ్స్ పార్టీ నిర్వహించడం, అందులో పాల్గొనడం ప్రజాస్వామ్యానికి అవమానం. తన గౌరవాన్ని ఏ మాత్రమైనా కాపాడుకోవాలంటే ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ వెంటనే తన పదవికి రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలి. డ్రగ్స్ పార్టీపై దాడి చేసిన పోలీసులపైనే కాల్పులు జరపడం అత్యంత దారుణం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో డ్రగ్స్ కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. గుంటూరు, మంగళగిరి, విశాఖపట్నం, నెల్లూరు ప్రాంతాల్లో డ్రగ్స్, గంజాయి విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. వంద రోజుల్లో గంజాయిని అరికడతామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ చర్యలు తీసుకోలేదు. పోలీసు వ్యవస్థను ప్రజల కోసం కాకుండా రెడ్‌బుక్ అమలు కోసం ఉపయోగిస్తున్నారు. హోం మంత్రి వైఎస్సార్‌సీపీ నేతలను తిట్టడం తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. డ్రగ్స్ వ్యవహారాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యుల పేర్లు వినిపించడం రాష్ట్ర పరిస్థితిని స్పష్టంగా చూపిస్తోంది. సీఎం చంద్రబాబు నిజంగా డ్రగ్స్‌పై చర్య తీసుకోవాలనుకుంటే పుట్టా మహేష్ యాదవ్‌ను వెంటనే టీడీపీ నుంచి సస్పెండ్ చేసి ఎంపీ పదవి నుంచి రాజీనామా చేయించాలి. లేకపోతే ప్రజా సంఘాలతో కలిసి భారీ నిరసనలు చేపడతామని దూలం నాగేశ్వరరావు హెచ్చరించారు.
పుట్టా మహేష్ ఏలూరు ఎంపీ కావడం మా దౌర్భాగ్యం : :మామిళ్లపల్లి జయప్రకాశ్. ఏలూరు నియోజకవర్గం పార్టీ ఇంఛార్జ్.
– ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ కేసులో పట్టుబడటం రాష్ట్రానికి, ముఖ్యంగా ఏలూరు పార్లమెంట్ ప్రజలకు తీవ్ర అవమానకరం. ఈ కేసులో ఎంపీని తప్పించేందుకు కూటమి ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నాలు చేసినప్పటికీ, అక్కడ బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే కూడా ఉండటంతో అది సాధ్యం కాలేదు. గంజాయిని పూర్తిగా నియంత్రించామని సీఎం చంద్రబాబు, హోం మంత్రి తరచూ ప్రకటనలు చేస్తున్నారని, కానీ వాస్తవ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. సాక్షాత్తూ ఒక ఎంపీ డ్రగ్స్ కేసులో పట్టుబడటం ఇదే తొలిసారి , అలాంటి వ్యక్తి ఏలూరు ఎంపీగా ఉండటం ప్రజల దురదృష్టం. పుట్టా మహేష్ ఎంపీగా ఎన్నికైన తర్వాత ఏలూరులో డ్రగ్స్, గంజాయి విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. మద్యం ఏరులై పారుతోంది. డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడిన ఎంపీ పుట్టా మహేష్ యాదవ్‌ను వెంటనే సస్పెండ్ చేసి ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలి.
టీడీపీ కూటమి వైఖరి బట్టబయలైంది- కంభం విజయరాజు. చింతలపూడి నియోజకవర్గం ఇంఛార్జ్.
డ్రగ్స్ కేసులో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ పట్టుబడటం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ సిగ్గుచేటు విషయం. ఒక ఎంపీ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడటం, ఆ ఎంపీ ఏలూరుకు చెందిన వ్యక్తి కావడం ఈ ప్రాంత ప్రజలను తలదించుకునే పరిస్థితికి తీసుకువచ్చింది. ఎన్నికల సమయంలో ఓట్లు అడుగుతూ రాష్ట్రంలో డ్రగ్స్ లేకుండా చేస్తానని హామీ ఇచ్చిన వ్యక్తే ఇప్పుడు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడటం అత్యంత దురదృష్టకరం. నైతిక విలువలు లేని వ్యక్తులకు ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం టీడీపీ కూటమి వైఖరిని బట్టబయలు చేసింది. ఇప్పటికే రాష్ట్రాన్ని కూటమి నేతలు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారు. మహేష్ యాదవ్‌కు డ్రగ్స్ రాకెట్‌తో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో కూడా సమగ్ర విచారణ జరపాలి.