Monday, 23 March 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

ఫామ్‌హౌస్‌‌ డ్రగ్స్ కేసులో బిగ్ ట్విస్ట్..  !

15 Mar 2026
05:17 PM
91

డ్రగ్స్ పార్టీ కేసులో కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు...
పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి..
• డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే...?

Moinabad Farm house Drugs Case :

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో డ్రగ్స్  కలకలం రేపింది. మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత ఫైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న ఈగల్ టీమ్, ఎస్‌వోటీ, స్థానిక పోలీసులు శనివారం రాత్రి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పైలట్ రోహిత్ రెడ్డి, ఏపీ టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ తో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడుల సమయంలో మఫ్టీలో ఉన్న పోలీసులపైకి ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నమీద్ మిశ్రా కాల్పులు జరిపాడు. అయితే, ఆ గన్ రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డి పేరుపై ఉంది. ఈ ఘటనలో మొత్తం 11 మందిపై కేసులు నమోదయ్యాయి. మెయినాబాద్ ఎస్ఐ నజీముద్దీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మొత్తం 11 మందిపై కేసు నమోదు చేసిన  మెయినాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఎఫ్ఐఆర్ నమోదైన వారిలో మోరవినేని రమేష్, పుట్ట మహేష్ కుమార్, పంజుగుల రోహిత్ రెడ్డి, వరమచనేని శ్రావణ్ కుమార్, నమిత్ శర్మ, పంజుగుల రితేష్ రెడ్డి, నల్లపనేని విజయ కృష్ణ, కౌషిక్ రవి, తిరువీడుల అర్జున్ రెడ్డి, ఆర్. ప్రియాంక రెడ్డి, సిల్వరి శరత్ కుమార్ ఉన్నారు.
డ్రగ్స్ పార్టీలో రెండు గ్రాముల వైట్ పౌడర్‌ను పోలీసులు సీజ్ చేశారు. పోలీసుల దాడుల్లో పట్టుబడిన వారికి డ్రగ్ టెస్టు కిట్ ద్వారా పరీక్ష నిర్వహించగా తిరువీడు అర్జున్ రెడ్డి, కౌషిక్ రవి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మ, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిలకు పాజిటివ్ వచ్చింది. ఈ ఐదుగురి బ్లడ్ శాంపిల్స్ తీసుకొని ల్యాబ్‌కు పంపించారు. అయితే, రాత్రి రాపిడ్ డ్రగ్ టెస్టులో టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ యావ్ కు నెగిటివ్ వచ్చింది. అయితే, ఆదివారం ఉదయం మరోసారి టెస్టు చేయగా.. అతనుకూడా డ్రగ్స్ వాడినట్లు తేలింది. అతని బ్లడ్ శాంపిల్ పరీక్షించగా.. పాజిటివ్ అని వచ్చింది.

సిమ్లా నుంచి డ్రగ్స్ .. !
మొయినాబాద్ ఫామ్‌హౌస్ కేసులో పోలీసులు మరింత లోతుగా సమాచారాన్ని సేకరిస్తున్నారు. రోహిత్ రెడ్డి పీఏ సిల్వర్ శరత్ కుమార్ వద్ద రెండు కొకైన్ ప్యాకెట్స్ ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. కొకైన్ అందరికీ పంచి మిగిలినది జేబులు పెట్టుకున్నానని తన స్టేట్మెంట్‌లో శరత్ కుమార్ పేర్కొన్నట్లు సమాచారం. శరత్ కుమార్ ఇచ్చిన సమాచారంతో కౌశిక్ రవిని పోలీసులు ప్రశ్నించారు. సిమ్లా నుండి కౌశిక్ రవి అనే వ్యక్తి డ్రగ్స్ తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. కౌశిక్ రవి మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి స్నేహితుడు. సిమ్లా ట్రిప్‌లో గుర్తుతెలియని వ్యక్తి నుండి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు కౌశిక్ రవి స్టేట్మెంట్ ఇచ్చినట్లు సమాచారం.

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!