Monday, 23 March 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ కు స్టేషన్ బెయిల్ మంజూరు.. !

15 Mar 2026
05:00 PM
115

ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ కు స్టేషన్ బెయిల్ మంజూరు.. !
• పుత్త మధు తోపాటు ప్రియాంక రెడ్డికి బెయిల్ ఇచ్చిన అధికారులు..
• రేపు పార్లమెంటు సమావేశాలు ఉన్న నేపథ్యంలో స్టేషన్ బెయిల్  ఇచ్చిన పోలీసులు..
• మీడియా కంట పడకుండా మహేష్ యాదవ్ ను దొడ్డి దారిన తప్పించిన పోలీసులు..
• పోలీస్ వాహనాల్లో బయటికు తీసుకొచ్చి ఎంపీ కారులో ఎక్కించి పంపించిన పోలీసులు..


Moinabad Farm House drugs Case :

మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్ కేసులో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ కు స్టేషన్ బెయిల్ మంజూరైంది. పుట్టా మహేశ్ యాదవ్ కి అధికారులు స్టేషన్ బెయిల్ ఇచ్చారు. ఎంపీ పుట్టాతో పాటు ప్రియాంక రెడ్డికి కూడా అధికారులు  బెయిల్ మంజూరు చేశారు. రేపు పార్లమెంటు సమావేశాలు ఉన్న నేపథ్యంలో పుట్టా మహేశ్ యాదవ్ కు స్టేషన్ బెయిల్ ఇచ్చినట్లు సమాచారం.  అయితే స్టేషన్ బెయిల్ మంజూరయ్యాకా మీడియా కంట పడకుండా పోలీసులు  మహేశ్ యాదవ్ ను దొడ్డి దారిన తప్పించారు. పోలీస్ వాహనాల్లో బయటికి తీసుకొచ్చి ఎంపీ కారులో ఎక్కించి పంపించి వేశారు.

మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో దర్యాఫ్తు ముమ్మరం చేసింది ఈగల్ టీమ్  మొత్తం 11 మందిపై కేసు నమోదు చేసింది.  నిందితుల నుంచి కీలక సమాచారం లాగుతున్నారు. డ్రగ్స్ ఎలా వచ్చాయి? ఎవరు సరఫరా చేశారు? అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. డ్రగ్స్ కేసులో పట్టుబడిన వారికి యూరిన్ టెస్ట్ నిర్వహించగా మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డితో పాటు మరో ఐదుగురికి డ్రగ్ పాజిటివ్ వచ్చినట్లుగా తెలుస్తోంది. మొయినాబాద్ ఫామ్ హౌస్ ను సీజ్ చేసే అవకాశం ఉంది. వరుస అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన ఫామ్ హౌస్ ను సీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!