Monday, 23 March 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

వైఎస్ వివేకా కుటుంబ సభ్యులకు .. పులివెందుల టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి పరామర్శ.... !

15 Mar 2026
02:34 PM
129

*సునీత కుటుంబానికి న్యాయం జరుగుతుందని భావిస్తున్నా...
*ఈ దారిలో అన్యాయం జరిగితే...మరో దారిలో న్యాయం కోసం పోరాడుతా..
* వైఎస్ వివేకా హత్యపై బిటెక్ రవి హాట్ కామెంట్స్..

 Article Image
 కడప  :    
వైఎస్ వివేకా 7వ వర్థంతి సందర్బంగా వివేకా కుమార్తె సునీతరెడ్డి, భార్య సౌభాగ్యమ్మ లను వారి నివాసంలో టిడిపి ఇన్ చార్జి బీటెక్ రవి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన బిటెక్ రవి చరిత్రలో పులివెందుల ఉన్నంత కాలం 2019 మార్చి 15 జరిగిన ఘటన అందరికీ గుర్తుంటుందని, డబ్బు, అధికారం అడ్డం పెట్టుకొని వ్యవస్థలను మేనేజ్ చేస్తూ తాత్కాలికంగా తప్పించు కోవచ్చనని, కానీ 
హత్యతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధం ఉన్నవారు ఇక్కడ తప్పించుకున్నా దేవుడి ముందు తప్పించుకోలేరన్నారు. సునీత పోరాటం చూశాక ఇలాంటి కుమార్తె మనకు ఉండాలని అందరూ కోరుకుంటారని, సునీత కుటుంబానికి న్యాయం జరుగుతుందని భావిస్తున్నానని,  హత్యతో సంబంధం ఉన్న నిందితులకు దేవుని దయతో ఖచ్చితంగా శిక్ష పడుతుందన్నారు. కేసు త్వరగా ట్రయల్ కు  రావాలని కోరుకుంటున్నానని, హత్య ఎవరు చేశారో అందరికీ తెలుసునని వారి కోసమే సునీతమ్మ పోరాటమన్నారు. అత్యున్నత దర్యాప్తు సంస్థ గురించి మాట్లాడటం సరికాదని, ఈ దారిలో అన్యాయం జరిగితే మరో దారిలో న్యాయం కోసం పోరాడుతామన్నారు. 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!