* వివేకా హత్య విషయంలో ఏడేళ్ళైనా నిజం తేలలేదు ...
* జగన్ దంపతులను విచారించాల్సిన అవసరం ఉంది...
* లోపాలు ఎక్కడున్నాయో కోర్టుకు చెప్పాము ...
* కానీ కోర్టు ఎందుకనో ఒక కోణంలోనే విచారణ చేయమని చెప్పింది...
* తప్పుడు విచారణతో ట్రైల్ నిర్వహిస్తే న్యాయం ఎలా వస్తుంది...
* అన్ని దర్యాప్తు సంస్థలు న్యాయం చేయలేక పోతున్నాయన్న ..
* బాధ ఎలా వ్యక్తం చెయ్యాలో తెలియడం లేదు...
* నిజం బయటకు వస్తుందని నాకు ఇంకా నమ్మకం ఉంది...
* కానీ మౌనంగా కూర్చొని ఉంటే కుదరద కదా .. !
* నా బాధ చూసి అయినా ...
* కోర్టు సుమోటా క్రింద కేసు పునర్ విచారణ చేస్తుందని భావిస్తున్నా..!
* వైఎస్ సునీత సంచలన వ్యాఖ్యలు ....
కడప :
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో దర్యాప్తు సంస్థ సీబీఐ బాధ్యతగా విచారణ జరపడం లేదని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత ఆవేదన వ్యక్తం చేశారు. పులివెందులలో వైఎస్ సునీత విలేకర్లతో మాట్లాడుతూ.. ఈ హత్య కేసులో కీలక నిందితులు చెప్పిందే వినడం తప్ప.. వారిని లోతుగా సీబీఐ విచారించలేదన్నారు. నిందితుల మధ్య జరిగిన ఫోన్ సంభాషణ గురించి సీబీఐ సీరియస్‌గా తీసుకొని విచారించడం లేదని ఆమె తప్పుపట్టారు. తన తండ్రి హత్య జరిగిన తరువాత నిందితులందరి మధ్య ఫోన్ సంభాషణలు, మేసేజ్‌లు అత్యధికంగా జరిగాయని ఆమె గుర్తు చేశారు. విచారణలో ఏదో లోపం జరుగుతోందని.. లోపాలు ఎక్కడున్నాయో కోర్టుకు చెప్పామని, కానీ కోర్టు ఎందుకనో ఒక కోణంలోనే విచారణ చేయమని చెప్పిందన్నారు. అన్ని దర్యాప్తు సంస్థలు న్యాయం చేయలేక పోతున్నాయన్న బాధ ఎలా వ్యక్తం చేయాలో తెలియడం లేదని, అయినా నిజం బయటకు వస్తుందని, నాకు ఇంకా నమ్మకం ఉందని, కానీ మౌనంగా కూర్చొని ఉంటే కుదరద కదా అన్నారు.
పవర్ పాయింట్ ప్రజంటేషన్ లో వైఎస్ సునీత ఇంకా ఎమన్నారంటే ....

వివేకా హత్య విషయంలో ఏడేళ్ళైనా నిజం తేలలేదు ... :
వివేకా హత్య విషయంలో ఏడేళ్ళైనా నిజం తేలలేదు.. విచారణలో ఏదో లోపం జరుగుతోంది.. లోపాలు ఎక్కడున్నాయో కోర్టుకు చెప్పాం.
కానీ కోర్టు ఎందుకనో ఒక కోణంలోనే విచారణ చేయమని చెప్పింది..కిరణ్ యాదవ్ తో అర్జున్ రెడ్డి మధ్య ఫోన్ సంభాషణ పై. విచారణ చేయమన్నారు..తీగ లాగితే డొంక కదిలినట్లు ఉంది..సిబిఐ ఇటీవల చార్జిషీట్ లో ఏం చెప్పింది.. కొత్త సమాచారం బయటకు వస్తే విచారణ చేయమని ఆదేశించారు. దాన్ని పక్కన పెట్టారు..కిరణ్ యాదవ్ కి అర్జున్ కి మధ్య ఒక మెసేజ్ విషయం కోర్టు దృష్టికి తెచ్చాను..అర్ధరాత్రి వచ్చిన మెసేజ్.. ఉదయం 7.15 కిరణ్ యాదవ్ పంపాడు..కిరణ్ యాదవ్ కు ఎలా సమాచారం తెలిసింది..
ఎందుకు పంపించారు.. అర్జున్ రెడ్డికి అందుకు పంపించారు..అర్జున్ రెడ్డి, అవినాష్ రెడ్డి అన్న కుమారుడు..అర్జున్ రెడ్డి వైఎస్ భారతికి, జగన్ కు అత్యంత సన్నిహితుడు..విషయంలో ఎక్కడా అర్జున్ రెడ్డి, కిరణ్ రెడ్డి. మధ్య సంభాషణలపై ప్రస్తావన లేదు.. సిబిఐకి ఈ విషయం ఎలా తెలిసింది.. ఇటీవల చనిపోయిన డాక్టర్ అభిషేక్ రెడ్డి ఏం జరిగిందో తెలుసు..అర్జున్ రెడ్డికి ఎలా ఫోన్ చేసారు..ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ బాధ్యత ఏమిటి పూర్తి స్తాయిలో దర్యాప్తు చేయాలి కదా..7.12 కి కిరణ్ యాదవ్ మెసేజ్ పెట్టారు. 7.13కి సాక్షిలో ప్రసారం అయ్యింది.. కిరణ్ యాదవ్ ఇచ్చిన స్టేట్ మెంట్ ఎలా చెప్పారో అలా రికార్డు చేశారు..చెప్పిన దానిపై విచారణ చేయలేదు. కిరణ్ యాదవ్, సావిత్రమ్మ 2021 లో ఇచ్చిన స్టేట్మెంట్లో పదిన్నర గంటలకు బయటకు వెళ్ళి రెండు గంటల తరువాత ఇంటికి ఓ వచ్చారు.. ఈ మధ్యలో వివేకానందరెడ్డి ఇంటికి వెళ్ళారు.. 2021 జూన్, జూలై నెలలో రెండు సార్లు స్టేట్మెంట్ రికార్డు చేశారు సావిత్రమ్మ నుంచి.. కానీ సీబీఐ ఎందుకు దీనిపై లోతైన విచారణ చేయలేదో అర్థం కాలేదు .కిరణ్ యాదవ్ ను ఒక స్టేట్ మెంట్ తీసుకున్నారు.. మా అన్న సునీల్ యాదవ్ ఇంట్లో ఉన్నాడని చెప్పారు.. మా అమ్మపై వత్తిడి తెచ్చి స్టేట్మెంట్ రికార్డు చేశారని చెప్పారు. సునీల్ యాదవ్ అమ్మ ఇచ్చిన స్టేట్మెంట్ తప్పా.. కిరణ్ యాదవ్ ఇచ్చిన స్టేట్మెంట్ తప్పా..వీటీలో ఏది కరెక్ట్..ఇందులో ఉన్న అంశాలపై ఎందుకు విచారణ చేయలేదు..ఎవరు కిరణ్ యాదవ్ తల్లిపై వై వత్తిడి పెట్టారు..కిరణ్ యాదవ్ గంగిరెడ్డి మధ్య పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్ వెళ్ళాయి.. ఫోన్ ఎక్ట్రాక్ట్ ప్రకారం కిరణ్ యాదవ్ గంగి రెడ్డికి పలు సార్లు కాల్స్ చేశారు..పోన్ కాల్స్ వ్యవహారం ఇంత స్పష్టంగా ఉన్నా ఎందుకు విచారించలేదు.
వివేకా హత్య విషయం ముందే తెలుసేమో.. :
వివేకా హత్య విషయం ముందే తెలుసేమో..ఉమాశంకర్ రెడ్డి భార్య స్వాతికి మార్చి16న 2019న 25 సార్లు కిరణ్ యాదవ్ కాల్స్ చేశారు.ఈ కేసులో చాలామంది స్టేట్మెంట్ లు రికార్డు చేశారు.. కానీ వాటి వెనుక ఏం జరిగిందో విచారణలో వెల్లడి కాలేదు..భారత్ యాదవ్ కు ఎందుకు గన్ లైసెన్సులు ఇప్పించారు..దస్తగిరి తో కలిసి ఢిల్లీకి వెళ్ళాడు..భారత్ యాదవ్ సీబీఐ కి ఇచ్చిన స్టేట్మెంట్లో సునీల్ యాదవ్ కి ఒక మద్యం బాటిల్ తెచ్చిఇచ్చాను.. నాకు సంబంధించిన డాక్యుమెంట్లు చేశాడని..నాకు వాళ్లపై కొంత అనుమానం ఉందని కూడా చెప్పారు..భారత్ యాదవ్ కు ఓబుల రెడ్డికి ఏమిటి సంబంధం..కోర్టు ఆదేశాల మేరకు ఒక విషయం బయటనపెట్టేపుడు.. మిగిలిన సమాచారం కూడా బయట పెట్టాలి కదా.
సాక్షి కథనాల ప్రస్తావన.... :
సాక్షిలో ఆ రోజు 7.18 కి కడప రిపోర్టర్ శ్రీనివాసులు ఇచిన రిపోర్ట్ కూడా అనేక అనుమానాలకు తావిచ్చింది..గుండె పోటు అని చెబుతున్నారు.. కారణాలు తెలియ రాలేదు..వివేక చనిపోయారు చెప్పారు. ఎలా తెలిసిందన్నది కొత్త విషయం..వివేకా హత్య జరిగిన ఘటనపై అన్ని కోణాలలో విచారణ చేశారు..అనేక స్టేట్మెంట్లు, సాక్షిలో వచ్చిన న్యూస్ ను కూడా పరిశీలించారు..సాక్షి చానెల్ హెడ్ నుంచి లోకల్ రిపోర్టర్ వరకు వారి మధ్య అనేక ఫోన్ సంభాషణలు జరిగాలు.. సాక్షి ఎడిటర్ నుంచి సాక్షి ఛైర్మెన్ కి కాల్స్ వెళ్ళాయి.. ఉదయం 10 గంటల తరువాత వివేకా గుండెపోటుతో కాదు మృతి వెనుక అనేక అనుమాలు ఉన్నాయని వార్త ప్రసారం చేశారు. పోన్ కాల్స్, సాక్షి కథనాలు అన్నీ అనుమానంగా ఉంటే వాటి మధ్య ఉన్న సంబంధాలపై ఎందుకు కూపి లాగ లేదు.కేసు ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఈ సమాచారం మీ ముందుకు తెస్తున్నాను.సాక్షి ఎడిటర్, ఛైర్మెన్ మధ్య సంభాషణలు వెనుక అనుమానాలు విచారణలో తేలాలి. భారతి, జగన్ ల కుట్ర ఉంటే ఎందుకు కేసులో చర్చ లేదు. కేసు క్లోజ్ అయ్యింది.

కేసు పున:విచారణ జరగాలి... :
ఢిల్లీ, కేరళలో కొన్ని కేసుల్లో అనేక సార్లు పునర్ విచారణ జరిగింది. మా నాన్న కేసులో కూడా విచారణ జరగాలి. ఆనంద్ బాబు డోర్ డెలివరీ కేసు కూడా పునర్ విచారణ కి వచ్చింది. విచారణలో తప్పులు ఉన్నాయి. విచారణ సక్రమంగా చేయకపోతే న్యాయం ఎక్కడ జరుగుతుంది. సీబీఐకి ఎలా కేసు విచారణ చేయాలో నేను చెప్పాల్సిన అవసరం లేదు. మహేంద్ర యాదవ్ ప్రమేయంపై అనేక మార్లు ప్రస్తావించినా సిబిఐ పరిగణనలోకి తీసుకోలేదు. అది వేరే సమస్య అని పక్కన పెట్టారు.. ఇక ఏం చేయాలి.
హత్యలో భాగంగా ఫిబ్రవరి లో వివేకా ఇంట్లో ఉన్న కుక్కను చంపేశారు.. :
కిరణ్ యాదవ్ అర్జున్ యాదవ్ మధ్య మెసేజ్ ఎందుకు మిగతా వాళ్ళకి వెళ్లలేదు.. ఆది ముఖ్యమైనది ఐతే..ఈ కేసులో వీరు భాగస్వామి కాబట్టే ఇదంతా జరిగింది.. హత్యలో భాగంగా ఫిబ్రవరి లో వివేకా ఇంట్లో ఉన్న కుక్కను చంపేశారు. సీబీఐకి చెబితే వారందరూ బంధువులు అని సిబిఐ అంటోంది. బంధువులు ఐతే అంతకు ముందు వారి మధ్య ఫోన్ సంభాషణలు ఉండాలి కదా అదే నా ప్రశ్న. అన్ని దర్యాప్తు సంస్థలు న్యాయం చేయలేక పోతున్నాయన్న బాధ ఎలా వ్యక్తం చేయాలో తెలియడం లేదు . నాకు ఇంకా నమ్మకం ఉంది. నిజం బయటకు వస్తుంది అని. మౌనంగా కూర్చొని ఉంటే కుదరదు.
తప్పుడు విచారణతో ట్రైల్ నిర్వహిస్తే న్యాయం ఎలా వస్తుంది... :
తప్పుడు విచారణతో ట్రైల్ నిర్వహిస్తే న్యాయం ఎలా వస్తుంది.. విచారణలో ఉన్న తప్పుల కారణాన్ని అడ్డం పెట్టుకుని నిందితులు బయటకు వచ్చారు.. సుప్రీం కోర్టు కూడా ఈ ట్రైల్ సాగదు అని చెప్పడం చూస్తే వ్యవస్త ఇంత దిగజారిందా అన్న భావన కలుగుతోంది. 2023 నుంచి సరైన పత్రాలు ఇవ్వలేదని చెప్పడం దారుణం. విచారణ పేరుతో రోజులు గడుపుతూ ఉంటే నిందితుల కు శిక్ష ఇప్పుడు పడుతుంది. జీవిత కాలం అయిపోతుంది. సుప్రీం కోర్టు విచారణ పూర్తి అయ్యింది.. ఇక ట్రైల్ మాత్రానే ఉందని చెప్పింది. వ్యక్తి మాట వినను సిబిఐ తటస్థ సమస్త కాబట్టి సిబిఐ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంది. మరింత విచారణ అవసరమా అంటూ సిబిఐ ని సుప్రీమ్ అడిగింది. మీరు చెబితే మేం చేస్తాం అని చెప్పింది. సిబిఐ కోర్టు ఏమి చెప్పిందో సుప్రీం అదే బలపరిచింది. సిబిఐ ఒక దర్యాప్తు సంస్థ. దానిపై నాకు నమ్మకం ఉంది. ఐతే దానిపై సరైన పద్ధతిలో నడపడం లేదన్న అనుమానం కలుగుతోంది. ఈ నా బాధ చూసి అయినా కోర్టు సుమోటా క్రింద కేసు పునర్ విచారణ చేస్తుందని భావిస్తున్నా..