Monday, 23 March 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

గ్యాస్ కష్టాలు పట్టని మంత్రి.... !

14 Mar 2026
08:38 PM
162

* పార్టీ ఆవిర్బావ దినోత్సవ వేడుకల్లో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల ...
* సిఎం సమీక్ష...ఆర్ధిక మంత్రి గ్యాస్ సమస్యపై ప్రకటన ...
* నిన్న మంత్రివర్గ సమావేశానికి రాకపోవడంపై విమర్శలు...
* గ్యాస్ సమస్య ప్రారంభం నుంచి అంటిముట్టన్నట్లుగానే ఉంటున్న మంత్రి...

అమరావతి  : 

ఎపి మొత్తమే కాదు... దేశం...ప్రపంచం మొత్తం ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్య గ్యాస్. గ్యాస్ అంటే అందరికి మనుషుల్లో వచ్చే గ్యాస్ సమస్య అనుకుంటున్నారేమో. సాధారణ సమయంలో అయితే అందరు అలానే అనుకునే వారు. కానీ ఇప్పుడు సమస్య ఎదుర్కొంటున్నారు కాబట్టి అందరు వంట గ్యాస్ అనే అర్ధం చేసుకుంటారు. కానీ ఎపి పౌరసరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహార్ కు మాత్రం ఒంట్లోనే కాదు... ఇంట్లోను గ్యాస్ సమస్య లేనట్లుంది. అందుకే అయన రాష్ట్రం మొత్తం గ్యాస్ సమస్యతో సతమతమవుతుంటే.... అయన  మాత్రం పార్టీ ఆవిర్బావ దినోత్సవం....పాడేరు సమీపంలో అడవితల్లి బాట పేరుతో రోడ్లను పరిశీలిస్తూ, గిరిజనులతో మాటా మంతి కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్ వెంట ఉండిపోయారు. నిన్న మంత్రివర్గ సమావేశం నిర్వహించిన మంత్రి నాదేండ్ల హాజరుకాకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమయ్యాయి. 

Article Image

అయితే అమెరికా-ఇజ్రాయేల్- ఇరాన్ యుద్దం ఫలితంగా పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత పరిస్ధితులు నెలకున్న నేపధ్యంలో హర్మూజ్ జలసంధి మూసివేత కారణంగా దేశంలో ఇంధన అత్యవసర పరిస్ధితి ఎర్పడింది. ఫలితంగా దేశ వ్యాప్తంగా ప్రధానంగా గ్యాస్ సమస్య అందర్ని కలవరపాటుకు గురిచేస్తుంది. దేశం మొత్తం గ్యాస్ సమస్యతో తల్లడిల్లుతొంది. ఇటు ఎపిలో ఆదే గ్యాస్ సమస్య అందరిని ఆందోళనకు గురిచేస్తుంది. అన్ని రాష్ట్రాలు అప్రమత్తమై అధికారులు, కేంద్రంతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నాయి. కానీ ఎపిలో మాత్రం గ్యాస్ సమస్య నుంచి ప్రజలు గందరగోళానికి గురవుతుండగా... ప్రభుత్వం ప్రత్యేకించి సంబంధిత శాఖ మంత్రి నాదేండ్ల మనోహార్ మాత్రం గ్యాస్ సమస్యపై పెద్దగా దృష్టి సారించినట్లు లేరన్న అభిప్రాయం వ్యక్తమవుతొంది. మూడు రోజుల క్రితం రాష్ట్రంలో గ్యాస్ కోరత లేదని, బ్లాక్ మార్కెట్లో అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చెయ్యడం మినహా పెద్దగా సమస్య పరిష్కారానికి, ప్రజల్లో గందోరగోళ పరిస్ధితిని నియంత్రించేందుకు చొరవ చూపడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

వాస్తవానికి రాష్ర్టంలో గ్యాస్ భయాందోళనల మధ్య అందరు ఒక్క సారిగా గ్యాస్ కోసం ఎగబడటం, అన్ లైన్ లో బుక్ కాకపోవడం,  బ్లాక్ లో అమ్మకాలు జరుగుతుండటం, అధిక ధరలకు సిలిండర్లు అమ్మకం వంటి సమస్య వల్ల రాష్ర్ట ప్రజలందరు ఆందోళనకు గురవుతున్నారు. మరో వైపు హోటల్స్, టీస్టాల్స్, మెస్ లు వంటి వ్యాపార సమూదాయాలు గ్యాస్ కోరత కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. కానీ ప్రభుత్వం వైపు గానీ, అధికారుల వైపు నుంచి రాష్ర్టంలో పెద్దగా హడావుడి కనిపించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతొంది. మరో వైపు పక్క రాష్ట్రాలు విద్యుత్ పై సబ్సిడీలను ప్రకటిస్తూ ప్రజల ఇబ్బందులకు కొంత ఉపశమనం కలిగించే చర్యలు తీసుకుంటున్నాయి. 

కానీ రాష్ట్రంలో మాత్రం సంబంధిత మంత్రి నాదేండ్ల మనోహార్ మాత్రం పార్టీ ఆవిర్బావ దినోత్సవమని, పాడేరు సమీపంలో అడవితల్లి బాట పేరుతో రోడ్లను పరిశీలిస్తూ, గిరిజనులతో మాటా మంతి కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్ వెంట గడుపుతుండటం విమర్శలకు తావిస్తొంది. సంబంధిత మంత్రి అందుబాటులో లేకపోవడం, పక్క రాష్ట్రాలు గ్యాస్ సమస్య పరిష్కార మార్గాలపై  దృష్టి సారించడం కారణంగా ప్రభుత్వం అప్రమత్తమైనట్లు తెలుస్తుంది. సంబంధిత మంత్రి లేకపోయినా ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తో ప్రకటన చేయించింది. అంతకుముందు సిఎం చంద్రబాబునాయుడు పలువురు మంత్రులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వపరంగా ఏం చేయాలో అంతా చేయాలని చంద్రబాబు సూచించారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. 

Article Image

అలా అయితేనే సిలిండర్.. గ్యాస్ బుకింగ్‌పై ఏపీ ఆర్థిక మంత్రి కీలక ప్రకటన ..  : 

గ్యాస్ బుకింగ్‌పై ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కీలక సూచనలు చేశారు. గ్యాస్ బుకింగ్ ఆన్‌లైన్ పద్ధతిలోనే జరగాలని.. ఓటీపీ చెప్తేనే గ్యాస్ సిలిండర్ డెలివరీ ఉంటుందని స్పష్టం చేశారు. గ్యాస్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్‌కు తరలిపోకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ఎవరైనా బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నట్లు తేలితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గ్యాస్ సిలిండర్లను ప్రాధాన్య క్రమంలో గృహాలు, ఆస్పత్రులు, హాస్టళ్లకు కేటాయిస్తామని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. గ్యాస్ సరఫరా విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న పయ్యావుల కేశవ్.. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం గ్యాస్ సరఫరా చేస్తామన్నారు. ఎప్పటికప్పుడు గ్యాస్ సరఫరాను పర్యవేక్షిస్తున్నామన్నారు.

 

 

 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!