* అయన సుదీర్ఘ అనుభవాన్ని రాష్ట్ర శ్రేయస్సు కోసం ఉపయోగించడం లేదు..
* ఇతరుల వ్యక్తిత్వాన్ని హననం చేసి ఓటుగా మార్చుకోవాలని చూస్తాడు..
*ఆధారాలు లేకుండా తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు అన్నాడు
* లడ్డూ విషయంలో చంద్రబాబు ప్రపంచ వ్యాప్తంగా పరువు పోగొట్టుకున్నాడు..
* అన్ని ప్రాజెక్టులు నేనే కట్టానంటాడు...
* సీమ లిఫ్ట్ ను తెలంగాణాకు తాకట్టు పెట్టాడు ....
* 33 ఉద్యోగల పేరు చెప్పి హెరిటేజ్ కు రాయితీలు ఇప్పించుకున్నారు..
* ప్రజలు అన్ని గమనిస్తున్నారు ....
* వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి
కడప :
సుదర్ఘ కాలం పాటు సిఎంగా పనిచేసినా ఏమీ చెప్పుకోవడానికి లేని పరిస్ధితి చంద్రబాబుదని, సుదీర్ఘ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు అనుభవాన్ని రాష్ట్రం కోసం ఉపయోగించలేదని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి దుమ్మెత్తిపోశారు. కడపలో శనివారం ఆయన మీడియా పనూవేశంలో మాట్లాడుతూ దేశంలో నాకుటే సీనియర్ లేడని చెప్పుకునే చంద్రబాబు, అబద్ధాలపైనే బతకాల్సిన పరిస్థితిలో ఉన్నారన్నారు. ఎప్పుడు ఇతరుల వ్యక్తిత్వాన్ని హననం చేసి ఓటుగా మార్చుకోవాలని చూడటం బాబుకు అలవాటన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు అంటూ వైసీపీని మిగిలిన వారికి దూరం చేయాలని చూశాడని, సుప్రీం కోర్టు చెప్పినా ఇంకా అదే దుష్ప్రచారాన్ని చేస్తూనే ఉన్నాడని మండిపడ్డారు. చివరికి మండలి చైర్మన్ కులాన్ని ప్రశ్నించే స్థాయికి మీ పార్టీ దిగజారిందని, లడ్డూ విషయంలో చంద్రబాబు ప్రపంచ వ్యాప్తంగా పరువు పోగొట్టుకున్నాడన్నారు.
మా నాయకుడు వైఎస్ వివేకానందరెడ్డి అంశలోను ఇదే తరహా రాజకీయం చేసి ఆ కుటుంబంలో చిచ్చు పెట్టడు కోసం కుటీం రాజకీయు చేశాడన్నారు. పాశవికంగా చంపిన వాడిని దగ్గర పెట్టుకుని విషప్రచారం చేశారని, నేడు సుప్రీం కోర్టులో వాస్తవలేంటి అనేది అందరికీ తెలిసిపోయిందని, చంపిన వారు చంద్రబాబు ప్రభుత్వంలో సెటిల్మెంట్లు చేసుకుంటున్నారని ఆరోపించారు.
ఆనాడు రూ.14 లక్షల కోట్ల అప్పు అన్న వ్యక్తి ఇప్పుడు రూ.3 లక్షల కోట్లు మాత్రమే అంటున్నాడని, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పు కూటమి ప్రభుత్వం రెండేళ్లలోనే చేసిందన్నారు.ఎవరు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచింది ఎవరో ప్రజలు గమనించాలని, అన్ని అంశాల్లో మోసంతోనే కాలం వెళ్లదీస్తున్నారన్నారు.నిరుద్యోక భృతి నుంచి సూపర్ పిక్స్ చేయింపులు లేవని, చివరికి కేబినెట్ పై కూడా పట్టు కోల్పోయారన్నారు. పవన్ కళ్యాణ్ నిన్నటి కేబినెట్ మీటింగు రాలేదని, అయన సినిమా టికెట్ ధరలు పెంచుకునే బిజీలో ఉన్నాడన్నారు.
గత ఏడాది రైతులు అన్ని విధాల మోసం పోయారని, మళ్ళీ ఈ ఏడాది కూడా అదే తీరన్నారు. చంద్రబాబు మాత్రం అన్నీ నేనే చేశాను అంటాడని, కానీ ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశావా బాబు అంటూ ప్రశ్నించారు. నేడు రాయలసీమ లిఫ్ట్ ను తెలంగాణాకు ఫణంగా పెట్టిన నువ్వు రాయలసీమను ఉద్ధరిస్తావా...? ఇన్ని రకాలుగా మా కడుపు కొడుతున్న నీకు దేవుడు కచ్చితంగా మొట్టికాయలు వేస్తాడు. నేడు పాలల్లో, నెయ్యిలో ఎక్కడ చూసినా అన్నింటా కల్తీనే. ఇందాపూర్ ద్వారా హెరిటేజ్ నెయ్యి సప్లై చేసి కోట్లు కొల్లగొట్టవు. నిన్న 35 ఉద్యోగాల పేరుతో హెరిటేజ్ కి ఎన్ని రాయితీలు తీసుకున్నావో ప్రజలు గమనిస్తున్నారు.