Wednesday, 25 March 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

ఏపీ కేబినెట్ భేటీకి ఆరుగురు మంత్రుల గైర్హాజరు.. !

13 Mar 2026
10:36 PM
112

* పవన్ కళ్యాణ్ కూడా.. 
*నిన్న కలెక్టర్ల సమావేశానికి... నేడు మంత్రివర్గ సమావేశానికి దూరం....
* ఎపి రాజకీయాల్లో తీవ్ర చర్చ ....

అమరావతి  : 

ఎపి సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీకి ఏకంగా ఆరుగురు మంత్రులు గైర్హాజరయ్యారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, వంగలపూడి అనిత, గొట్టిపాటి రవికుమార్, టీజీ భరత్, ఎన్ఎండీ ఫరూక్ మంత్రివర్గ సమావేశానికి హాజరుకాలేదు. వేర్వేరు కారణాలతో వీరంతా సమావేశానికి హాజరు కాలేకపోతున్నట్లు సమాచారం అందించినట్లు తెలిసింది. జనసేన ఆవిర్భావ వేడుకల నేపథ్యంలో బిజీగా ఉన్న కారణంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కేబినెట్ భేటీకి రాలేకపోయారు. మరోవైపు అనారోగ్యం కారణంగా మంత్రివర్గ సమావేశానికి హాజరుకాలేకపోతున్నట్లు మంత్రులు గొట్టిపాటి రవికుమార్, వంగలపూడి అనిత, టీజీ భరత్ సమాచారం అందించారు. భార్య సంవత్సీరకం కారణంగా మంత్రి ఎన్.ఎం.డీ ఫరూక్ హాజరుకాలేకపోయారు.

నిన్నకలెక్టర్ల సమావేశానికి...నేడు మంత్రివర్గ సమావేశానికి పవన్ దూరం   : 
జనసేన నుంచి డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్, మంత్రి నాదేండ్ల మనోహార్ సమావేశానికి రాకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే పవన్ కలెక్టర్ల సమావేశానికి కూడా డుమ్మా కొట్టడం, దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్న నేపధ్యంలో ఇప్పుడు మంత్రివర్గ సమావేశానికి హజరు కాకపోవడం కాక రేపుతుంది. మరోవైపు మార్చి 14వ తేదీన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరగనున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆ ఏర్పాట్లలో బిజీగా ఉన్నట్లు తెలిసింది. అన్ని జిల్లా కేంద్రాలు, మండలాలు, నగరాలు, పంచాయతీలలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరగనుంది. వాస్తవానికి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పిఠాపురంలో ఘనంగా నిర్వహించాలని తొలుత జనసేన పార్టీ అధిష్టానం నిర్ణయించింది. కానీ మంత్రివర్గ సమావేశం 2 వారాల ముందే తేదీ ఖరారైనా ముందస్తు ఏర్పాట్లు చేసుకునైనా మంత్రివర్గ సమావేశానికి హజరుకావల్సి ఉంది. కానీ అలాకాకుండా గౌర్హాజరు కావడంతో పవన్ కు ప్రజాసమస్యల పరిష్కారమంటే ఎంత శ్రద్ద ఉందో అర్దం చేసుకోవచ్చునంటూ ప్రచారం సాగుతుంది. 

 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!