*ఎమ్మెల్యే అనుచరులే భారీ అవినీతికి పాల్పడుతున్నా...
* చర్యలు తీసుకునే వారే లేరు....
*తక్షణం అక్రమాలను విలువరించి రైతులకు న్యాయం చేయాలి..
*లేకపోతే అక్కడే పోరాటం చేస్తాం ....
*పిల్లల్ని కనాలన్న చంద్రబాబు మాటలు మోస పూరితం... ఎవరు నమ్మోద్దు ...
*వైసీపీ రాష్ర్ట అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మండిపాటు ...
కడప :
ప్రొద్దుటూరులో శనగల కొనుగోలు కేంద్రంలో భారీ అవినీతి జరుగుతోందని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఆధ్యాయం జరుగుతోందని వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను హెచ్చరించారు. శుక్రవారం ప్రొద్దుటూరులోని మార్కెట్ యార్డు శనగల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం శనగలకు క్వింటాలు రూ.3,675 మద్దతు ధర ప్రకటించినప్పటికీ అక్కడ ఎమ్మెలే అనుచరులు భారీ అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. మార్కెట్ యార్డు కొనుగోలు కేంద్రం ద్వారా సుమారు రూ.10 కోట్ల అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో సుమారు 20 వేల ఎకరాల్లో శనగ వంట సాగు చేశారని, రైతుల వద్ద నుంచి క్వింటాలకు రూ.200 చొప్పన అక్రమంగా వసూలు చేస్తున్నారని అరోపించారు.
నిబంధనల ప్రకారం ఒక క్వింటాల్ అంటే 101 కిలోలు 200 గ్రాములు ఉండాలని, అయితే వరదరాజుల రెడ్డి అనువదులు మాత్రం 106 కిలోలు తీసుకుంటున్నారని ఆరోపించారు. అలాగే ఈ-క్రాప్ నమోదు చేయకపోయినా వ్యాపారుల ద్వారా గత ఏడాది పండిన శనగలను కొనుగోలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ విధంగా శనగల రైతులకు అన్యాయం జరుగుతోందని, వెంటనే కొనుగోలు విషయంలో రైతులకు నష్టం జరిగితే లేకపోతే అక్కడికక్కడే పోరాటం చేస్తామని రాచమల్లు శివప్రసాదరెడ్డి హెచ్చరించారు. తక్షణం మార్కెట్ యార్డు కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న అక్రమాలను విలువరించి రైతులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
పిల్లల్ని కనాలన్న చంద్రబాబు మాటలు మోసపూరితం... ఎవరు నమ్మోద్దు ... :
సిఎం చంద్రబాబు ఈ మధ్య ఓ తమాషాకరమైన ప్రకటన చేస్తున్నారని, కొత్తగా కుటుంబ నియంత్రణ అపరేషన్ చేయించుకున్నవారు పిల్లల్ని కనాలని చెబుతున్నారని, అయన మాటలు పచ్చి మోసమని, ప్రజలు అయన మాటలు నమ్మవద్దని రాచమల్లు సూచించారు. ఒకర్ని కంటే రూ. 25 వేలు ఇస్తానని చంద్రబాబు చెబుతున్నారని, అయచ ఇచ్చే 25 వేలు పుట్టిన బిడ్డకు డైపర్స్ వేసేందుకే పరిపోతాయని చెప్పారు. కానీ తరువాత పుట్టిన వారికి ఎవరు భవిష్యత్తునిస్తారని ప్రశ్నించారు. పేద, మధ్య తరగతి ప్రజలకు ఒకర్ని కని పెంచి పోషించి ప్రయోజకులను చెయ్యడమే కష్టతరంగా మారిందని, ఇలాంటి పరిస్ధితుల్లో ఎక్కువ మందిని కంటే పోషించి ప్రయోజకులను చెయ్యలేక వదిలేస్తే క్రిమినల్స్ గా మారే అవకాశం ఉందన్నారు. చంద్రబాబు మాలు నమ్మి ఎవరైనా కంటే కొంప మునిగినట్లేనని, అయన హామీలు ఆడపిల్లలకు 15 వేలు ఇచ్చినట్లే ఇది కూడా మోసం చెయ్యడమేనన్నారు. చంద్రబాబు ఒకర్నే కన్నారని, అయన కుమారుడు ఒకర్నే కన్నారని, వారు మాత్రం ఒకర్నే కంటారు గానీ, అందరు ఎక్కువ మందిని కనాలని చెబుతున్నారని తప్పుపట్టారు.