Monday, 23 March 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

టీటీడీ లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు... !

13 Mar 2026
02:02 PM
90


ఢిల్లీ   : 

లడ్డూ కల్తీ వ్యవహారంపై జరుగుతున్న విచారణ సందర్బంగా సుప్రీం కోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తాజా వివాదం పైన దాఖలైన పిటీషన్ పై సుప్రీం సీజే ధర్మాసనం విచారణ చేసింది. లడ్డూ కల్తీలో యానిమల్ ఫ్యాట్ .. రసాయనాలు ఉన్నాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని పిటీషనర్ సుప్రీం కు నివేదించారు. దీని పైన స్పందించిన సుప్రీం కోర్టు జంతు కొవ్వు కలిసిందని చెప్పటానికి మీరు నిపుణులా అంటూ ప్రశ్నించింది. ఇప్పటికే ఈ వ్యవహారం పైన సీబీఐ విచారణ జరుగుతోంసీబీఐ దర్యాప్తు పెండింగ్‌లో ఉన్నప్పుడు జోక్యం చేసుకోము అని స్పష్టం చేసిన సీజేఐ ధర్మాసనం... ఏవైనా ఆధారాలు ఉంటే సీబీఐకి ఇవ్వాలని ఆదేశించింది.
 
లడ్డూ వివాదంలో భాగంగా యానిమల్ ఫ్యాట్ కలిసిందని.. రసాయనాలతో లడ్డూ చేసారని జరుగుతున్న ప్రచారంపై మానూరు శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. సీబీఐ దర్యాప్తు పెండింగ్‌లో ఉన్నప్పుడు జోక్యం చేసుకోమని స్పష్టం చేసింది. ఈ పిటీషన్ విచారణ సమయంలో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి  కీలక వ్యాఖ్యలు చేశారు. జంతు కొవ్వు కలిసిందని చెప్పటానికి మీరు నిపుణులా అంటూ ధర్మాసనం ప్రశ్నించింది. ఈ కేసులో ఏమైనా ఆధారాలు ఉంటే సీబీఐకు ఇవ్వాలని సూచించింది. ఈ వ్యవహారంలో ఇలాంటి పిటీషన్లను అనుమతించే అంశం పైన కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో అటు ఏపీ ప్రభుత్వం సైతం ఏకసభ్య కమిషన్ నియమించటంతో ఇప్పటికే విచారణ మొదలు పెట్టింది.

 ఏపీలో ఈ వ్యవహారం పైన రాజకీయంగా దుమారం చెలరేగింది. అధికార - విపక్షాల మధ్య వివాదం కొనసాగుతోంది. ఇప్పటికే సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ఆధారంగా ఎవరి వాదనలు వారు వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఇప్పుడు ప్రభుత్వం రిటైర్డ ఐఏఎస్ దినేశ్ కుమార్ తో నియమించిన ఏకసభ్య కమిషన్ విచారణలో భాగంగా టీటీడీ అధికారుల నుంచి కావాల్సిన సమాచారం ఆరా తీస్తోంది. అయితే.. ఇప్పుడు ఈ వివాదం కారణంగా ఇబ్బంది కర పరిస్థితులు ఏర్పడుతాయంటూ తాజాగా సుప్రీంలో దాఖలైన పిటీషన్ లో పిటీషనర్ పేర్కొన్నారు. అందులోని అంశాలను ప్రస్తావించిన సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. దీంతో.. అటు సీబీఐ తుది నివేదిక... ఏపీ ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ తేల్చే అంశాలు ఈ వివాదంలో కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది.

 

 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!