Monday, 23 March 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

కడప జిల్లాలో ఘనంగా వైసీపీ ఆవిర్బావ దినోత్సవ వేడుకలు..

12 Mar 2026
08:11 PM
320

* వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం ఓ చరిత్ర....
* అణచివేతలతో మొదలై...అధికారంలోకి వచ్చిన వచ్చిన పార్టీ...
* అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం పరితపించే పార్టీ వైసీపీ...
* కడప జిల్లా అధ్యక్షులు పి. రవీంద్రనాథరెడ్డి ....


కడప : 

కడప జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్బావ దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు రవీంద్రనాథరెడ్డి జెండాను ఆవిష్కరించి భారీ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటి సిఎం అంజాద్ బాష,ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, మాజీ మేయర్ సురేశ్ బాబు లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచి ఈ రోజు వరకు  అధికారం ఉన్నా లేకపోయినా వైఎస్ఆర్ అబిమానించిన వారందరు వైసీపీతోనే ఉన్నారన్నారు. వైఎస్ఆర్ మరణించిన అనంతరం  కాంగ్రెస్, టిడిపి అయన కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేసి , కేసులు పెట్టి జైళ్లో పెట్టినా వైసీపీ తట్టుకుని నిలబడగలిగిందన్నారు. వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్ లు ఇద్దరితో ప్రారంభమైన పార్టీ, నేడు కోట్ల మందితో కొనసాగుతుందన్నారు. పార్టీ ఎర్పడిన అనంతరం జరిిన సార్వత్రిక ఎన్నికల్లో బలమైన ప్రతిపక్షంగా నిలబడినా... 2019 లో 51 శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చిన పార్టీ చరిత్రలో లేదన్నారు. 2024లో దురద‌ృష్టవశాత్తు ఈవిఎంల ట్యాంపరింగ్ వల్ల కూటమి అధికారంలోకి వచ్చిందన్నారు. వైసీపీ అధికారంలో ఉండగా... ఏ వర్గానికి, ఏ ప్రాంతానికి ఎమి చెయ్యాలో తెలుసుకుని చేసిన ఘనత వైఎస్ జగన్ కే దక్కిందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా వైఎస్ జగన్ మ్యానిఫెస్టోను భగవద్గీత గా భావించి అమలు చేసిందన్నారు.  కానీ అబద్దాలతో అధికారంలోకి వచ్చిన కూటమి మ్యానిఫెస్టోను అమలు చెయ్యలేక చెత్తబుట్టలో వేసిన పరిస్ధితిని మనం అందరం చుస్తున్నామన్నారు. 
అపద్దాలతో అధికారంలో వచ్చిన కూటమి ఎలా మోసం చేసిందో అందరికి తెలిసిందేనని, అందరు నష్టపోయి చెప్పుకుంటున్న పరిస్ధితి ఇప్పుడు చూస్తున్నామన్నారు. కూటమి పాలనను చూస్తే పాలిచ్చే గేదెను పొగొట్టుకుని తన్నే గాడిదను తెచ్చుకున్నట్లు ఉందన్నారు. వైసీపీ ప్రజల కోసం పుట్టిన పార్టీ కాబట్టి అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల పక్షానే ఉంటామన్నారు. 


అంజాద్ బాష, మాజీ డిప్యూటి సిఎం :

ఉద్యమాల నుంచి పుట్టిన పార్టీ వైసీపీ అని, కాంగ్రెస్ పార్టీలో దివంగత నేత వైఎస్ఆర్ పథకాలకు తూట్టు పొడిస్తుంటే పట్టించుకున్న పాపాన పోలేదపి, అందువల్లే అయన కుటుంబాన్ని పొమ్మనలేక పొగబెడుతుంటే.. తల్లి కొడకు బయటకు వచ్చి ఆ కుటుంబాన్ని నమ్ముకున్న వారి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారని చెప్పారు. తొలి ఎన్నికల్లోనే 67 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష్యాన్ని కైవసం చేసుకోగా, 2019లో 151 స్థానాలతో అధికారాన్ని చేజిక్కించుకుందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం కార్యకర్తలు, ప్రజలేనన్నారు.

Article Image
బద్వేలు నియోజకవర్గంలో : 
బద్వేలు నియోజకవర్గం పోరుమామిళ్లలోని పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి   పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ స్థాపన లక్ష్యాలను గుర్తుచేసుకున్నారు. ప్రజా సేవే ధ్యేయంగా పార్టీ ముందుకు సాగాలని నాయకులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Article Image

కమలాపురం నియోజకవర్గంలో  : 
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ సంవత్సర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కమలాపురం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న వైయస్ఆర్ సీపీ కమలాపురం నియోజకవర్గ ఇంచార్జి పొచిమరెడ్డి నరేన్ రామాంజుల  కమలాపురం నియోజకవర్గంలోని పెండ్లిమర్రి,  కమలాపురం, వల్లూరు, చెన్నూరు, సికే దిన్నె, వీరపునాయనపల్లె మండలాల్లో దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమలాపురం నియోజకవర్గ కార్పొరేటర్లు, నాయకులు మండల నాయకులు కార్యకర్తలు, పార్టీ లో వివిధ హోదాలలో ఉన్నవారు తదితరులు పాల్గొన్నారు.

 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!