Monday, 23 March 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / అంతర్జాతీయ వార్తలు

హర్మూజ్ జలసంధిలో సముద్రపు మందుపాతరలు ...! జలసంధిలో నౌకలకు మృత్యుమార్గమే..!

12 Mar 2026
06:02 PM
100

Article Image
Strait of Hormuz    :

అమెరికా-ఇజ్రాయెల్ దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ఇరాన్  తిరుగుబాటు మరింత తీవ్రంగా మారుతోంది. తన సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు ఇరాన్ కఠిన చర్యలు తీసుకుంటోంది. తన నియంత్రణలో ఉన్న హర్మూజ్ జలసంధిని శత్రు నౌకలకు మృత్యుమార్గంగా మార్చే ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రాంతంలోకి అమెరికా మిత్రదేశాల నౌకలు ప్రవేశిస్తే పేలిపోయేలా ఇరాన్ సముద్రంలో ఎక్కడికక్కడ 'సీమైన్స్' లేదా 'నేవల్ మైన్స్' (సముద్రపు మందుపాతరలు) అమర్చుతోందన్న వార్త శత్రు దేశాల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. ఇరాన్ చేపడుతున్న ఈ చర్యలు ట్రంప్ ప్రభుత్వాన్ని  ఎదురుదెబ్బేనన్న చర్చ నడుస్తుంది. ఇరాన్ ను తక్కువ అంచానా వేస్తూ యుద్దంలోకి దిగిన అమెరికా - ఇజ్రాయేల్ కు చుక్కలు చూపిస్తుంది. ముందు ఒకటి అనుకుని యుద్దంలోకి దిగితే... యుద్దం మొదలయ్యాకా మాత్రం అందుకు భిన్నమైన పరిస్ధితులు ఎదురవుతుండటం ప్రపంచాన్ని మొత్తం హడలెత్తిస్తొంది. 
 Article Image

నేవల్ మైన్స్ అంటే ..?
భూమిపై శత్రువులు సరిహద్దులు దాటి లోపలికి రాకుండా మందుపాతరలు అమర్చినట్లే, సముద్రంలో అమర్చే పేలుడు పరికరాలను సీమైన్స్ లేదా నేవల్ మైన్స్ అంటారు.  శత్రు నౌకలు, జలాంతర్గాములు ప్రయాణించే మార్గాల్లో వీటిని అమర్చడం ద్వారా వాటిని ధ్వంసం చేయడం లక్ష్యంగా ఏర్పాటు చేస్తారు. ఈ కారణంగా ఆ మార్గంలోకి శత్రువులు రావడానికి భయపడుతుంటారు. అమెరికా విప్లవ యుద్ధ కాలంలో గన్‌పౌడర్ నీటి అడుగున కూడా పేలుతుందని యేల్ విశ్వవిద్యాలయానికి చెందిన డేవిడ్ బుష్‌నెల్ గుర్తించాడు.  అదే సముద్రపు మందుపాతరల అభివృద్ధికి బీజంగా మారింది. తరువాత జరిగిన అనేక యుద్ధాల్లో ఇవి కీలక పాత్ర పోషించాయి. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం సముద్రపు మందుపాతరల వినియోగం మరింత పెరిగింది. ఇప్పుడు అమెరికా- ఇజ్రాయేల్ - ఇరాన్ యుద్దంలోను కొత్త పుంతలు తోక్కుతొంది. 

Article Image

వీటిని ఎలా అమరుస్తారు? .. :
ప్రస్తుతం హర్మూజ్ జలసంధిలో ఇరాన్ ఈ మందుపాతరలను ఉపయోగించి రవాణా నౌకలను అడ్డుకోవాలని ప్రయత్నిస్తుండటం అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఆందోళనకు కారణమవుతోంది. ఈ సముద్రపు మందుపాతరలను ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (IRGC) నావికాదళం రాత్రి వేళల్లో రహస్యంగా అమర్చుతుంది. ఎవరూ గుర్తించకుండా జాగ్రత్తలు తీసుకుంటూ చిన్న బోట్లను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తొంది. ఈ చిన్న పడవలను రాడార్ వ్యవస్థలు గుర్తించడం చాలా కష్టం. పెద్ద పరిమాణంలో ఉన్న మందుపాతరలను జలాంతర్గాముల సహాయంతో సముద్రంలో అమర్చుతారు.  ఈ ప్రాంతాలను ప్రత్యేక మ్యాపుల ఆధారంగా ఐఆర్‌జీసీ గుర్తిస్తుంది. ఒకసారి పూర్తిస్థాయిలో మైన్స్ అమర్చిన తర్వాత హర్మూజ్ జలసంధిని ఇతర దేశాల రవాణా నౌకలు దాటడం దాదాపు అసాధ్యంగా మారుతుంది.

Article Image
 నేవల్ మైన్స్ ఎలా పేలుతాయి? : 
సముద్రంలో వీటిని అమర్చితే శత్రు నౌకలతో పాటు ఇరాన్ నౌకలకు ప్రమాదం ఉండదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇరాన్ నౌకలు మాత్రం వాటి స్థానాలను తెలుసుకుని వాటిని తప్పించుకుంటూ ముందుకు సాగగలవు. సముద్రపు మందుపాతరల్లో అనేక రకాలు ఉన్నాయి. అందులో కాంటాక్ట్ మైన్స్ ఎక్కువగా ఉపయోగిస్తారు. వీటి తయారీ ఖర్చు తక్కువ. నౌక నేరుగా తాకిన వెంటనే ఇవి పేలిపోతాయి.ఇన్‌ఫ్లుయెన్స్ మైన్స్ మాత్రం అత్యాధునిక సాంకేతికతతో పనిచేస్తాయి. వీటిని నౌక నేరుగా తాకాల్సిన అవసరం లేదు. సెన్సర్ల ఆధారంగా పనిచేసే ఈ మైన్స్ మ్యాగ్నటిక్ సంకేతాలు,శబ్ద తరంగాలు,సముద్రపు నీటిలో పీడన మార్పులు, ప్రకంపనలను గుర్తించి క్రియాశీలమవుతాయి. ఇంకా రైజింగ్ మైన్స్ అనే మరో రకం కూడా ఉంది. వీటిలో నుంచి ప్రొజెక్టైల్స్ బయటకు వెళ్లి నౌకలను లక్ష్యంగా చేసుకుంటాయి.  కాంటాక్ట్, ఇన్‌ఫ్లుయెన్స్ మైన్స్‌ను రిమోట్ ద్వారా కూడా నియంత్రించే అవకాశం ఉంది.

వేల సంఖ్యలో మందుపాతరలు .. : 
ఒక్కో మందుపాతరలో 50 కిలోల నుంచి 1,000 కిలోల వరకు పేలుడు పదార్థాలు ఉండవచ్చునని అంచానా. ఇరాన్ వద్ద సుమారు 2,000 నుంచి 6,000 వరకు సముద్రపు మందుపాతరలు ఉన్నట్లు అంచనాలు ఉన్నాయి. వీటిలో కొన్నింటిని చైనా, రష్యా నుంచి కొనుగోలు చేయగా, మరికొన్నింటిని దేశీయంగా తయారు చేస్తున్నట్లు సమాచారం.  ఇరాన్ నౌకాదళంలోని చిన్న నౌకలు ఒక్కోటి రెండు నుంచి మూడు మైన్స్‌ను సముద్రంలో అమర్చగలవు. అలాంటి చిన్న నౌకలు వందల సంఖ్యలో ఇరాన్ వద్ద ఉన్నాయి. అలాగే జలాంతర్గాముల ద్వారా సముద్రంలో అమర్చే మైన్స్ కూడా టెహ్రాన్ వద్ద ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

Article Image

సముద్ర మార్గం .. మృత్యుమార్గంగా .. : 
సముద్రపు మందుపాతరల అంశం అమెరికాను ఆందోళనకు గురిచేస్తోంది. అందుకే హర్మూజ్ జలసంధిలో అమర్చిన సీమైన్స్‌ను తొలగించాలని ట్రంప్ స్వయంగా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అమెరికా దళాలు మందుపాతరలను అమర్చే 16 ఇరాన్ నౌకలను బుధవారం ధ్వంసం చేశాయి. అయితే ఇలాంటి నౌకలు ఇంకా పెద్దసంఖ్యలో ఇరాన్ వద్ద ఉన్నాయని తెలుస్తోంది. ఒకవైపు ఇరాన్ హర్మూజ్ జలసంధిలో సీమైన్స్ అమర్చుతోందనే వార్తలు వస్తున్న సమయంలో, గతంలో ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు విమర్శలకు దారితీస్తోంది. సెప్టెంబర్ నెలలో పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉన్న నాలుగు ప్రత్యేక మైన్ స్వీపర్ నౌకలను అమెరికా డీకమిషన్ చేసింది.  ఈ పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో హర్మూజ్ జలసంధి అంతర్జాతీయ రవాణా నౌకలకు మృత్యుమార్గంగా మారే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!