
తాడేపల్లి :
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్బావ దినొత్సవాన్ని పురష్కరించుకుని పార్టీ అధినేత వైఎస్ జగన్ ‘‘నా ధైర్యం మీరే… నా బలం మీరే ’’ అంటూ ఎక్స్ వేదికగా ట్విట్ చేశారు. నాన్న గారి ఆశయ సాధన కోసం స్థాపించిన మన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, నన్ను మీరు గుండెల్లో పెట్టుకున్నారు, భుజాలపై మోస్తున్నారు. కష్టకాలంలో వెనక్కి తగ్గకుండా పార్టీ కోసం నిలబడుతున్నారు.
పార్టీపై నమ్మకం పెట్టుకుని, నాపై నమ్మకం ఉంచి పార్టీ కోసం నిలిచిన మీరే మన పార్టీకి అసలైన బలం.. నా బలం.
మన పార్టీ ప్రస్థానం ... కేవలం ఒక రాజకీయ ప్రయాణం మాత్రమే కాదు…
ఒక లక్ష్యంతో లక్షలాది మంది కార్యకర్తల కష్టం, నమ్మకం, త్యాగాలకు నిలువెత్తు సాక్ష్యం
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు, నాయకులకు పేరు పేరునా శుభాకాంక్షలు...అంటూ ఎక్స్ లో పోస్టు చేశారు.