తాడేపల్లి :
దివంగత నేత వైఎస్ఆర్ మరణానంతరం నల్లకాలువలో ఇచ్చిన ఒక్క మాట...రాష్ట్ర దశ..దిశను మార్చిందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహాన్ రెడ్డి అన్నారు.గురువారం తాడేపల్లిలో పార్టీ ప్రధాన కార్యాలయంలో వైసీపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వైఎస్ జగన్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. పార్టీ జెండా ఆవిష్కరణ అనంతరం వైఎస్ జగన్ ప్రసంగిస్తూ పార్టీ భవిష్యత్తుపై తన విశ్వాసాన్ని వ్యక్తం. చేశారు.

వరుస ఓటములతో జీవచ్ఛవంలా మారిన కాంగ్రెస్‌కు 'ప్రజా ప్రస్థానం' పాదయాత్రతో జీవం పోసి... టీడీపీ దుర్మార్గపు పాలనకు తెరదించుతూ 2004 ఎన్నికల్లో ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో కాంగ్రెస్ను మహానేత ఒంటిచేత్తో అధికారంలోకి తెచ్చారు. ఉమ్మడి రాష్ట్ర సీఎంగా 2004 మే 14న ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్సార్... రాష్ట్ర సమగ్రాభివృద్ధికి బాటలు వేశారు. జనరంజక పాలనను మెచ్చిన ప్రజలు వైఎస్ నాయకత్వానికి దన్నుగా 2009 ఎన్నికల్లోనూ మళ్లీ అధికారాన్ని కట్టబెట్టారు. 2009 మే 20న రెండోసారి ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక... అదే ఏడాది సెప్టెంబరు 2న హెలికాప్టర్ ప్రమాదంలో హఠాన్మరణం చెందారు.
ఈ విషాద వార్తకు తాళలేక వందలాది మంది మరణించడం జగన్ ను కలిచి వేసింది. ప్రమాదం చోటుచేసుకున్న కర్నూలు జిల్లా నల్లకాలువ వద్ద 2009 సెప్టెంబరు 25న నిర్వహించిన సంస్కరణ సభలో మాట్లాడుతూ... మరణించిన వారి కుటుంబాలను పరామ ర్శించడానికి ఓదార్పు యాత్ర చేపడతానని ప్రకటించారు. ఆ మాటకు కట్టుబడి 2010 ఏప్రిల్ 9న పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఓదార్పు యాత్ర ప్రారంభించారు. ఈ యాత్రను ఆపేయాలని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించింది. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై కుట్రలు చేస్తుండటంతో తన తల్లి విజయమ్మతో కలిసి జగన్ కాంగ్రెస్ పార్టీకి, పులివెందుల శాసనసభ, కడప లోక్ సభ స్థానాలకు రాజీనామాలు చేశారు. వైఎస్ ఆశయ సాధనే లక్ష్యంగా 2011 మార్చి 11న వైఎస్సార్సీపీ పేరును ప్రకటించారు. ఆ మరుసటి రోజే వైఎస్ సమాధి వద్ద పతాకాన్ని ఆవిష్కరించి, పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు

2011 మార్చి 12న పార్టీ ఆవిర్భవించింది. వైఎస్సార్సీసి ఆవిర్భావంతో దేశ రాజకీయాల్లోనే మార్పు కనిపించింది. నల్లకాల్వలో ఇచ్చిన మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భానానికి కారణమైంది. ఆ ఒక్క మాట రాష్ట్ర దశ, దిశను మార్చింది. వైఎస్సార్సీపీ పార్టీ కోట్లాది మంది ప్రజలది. మొదట్నుంచీ ప్రజలు, దేవుడినే నమ్ముకున్నా. విలువలు, విశ్వసనీయతకు ఎప్పటికీ కట్టుబడి ఉంటా. వైఎస్సార్సీపీ అభిమాని కాలర్ ఎగరేసేలా పార్టీ ఉంటుంది. మీ ప్రేమాభిమానాలకు హృదయపూర్వక కృతజ్ఞతలు, వైఎస్సార్స్ఫ అభిమానించే ప్రతి గుండెకు శుభాకాంక్షలు' అంటూ పార్టీ ఆవిర్భాన వేడుకల్లో వైఎస్ జగన్ ప్రసంగించారు.