ఢిల్లీ :
కడప జిల్లా పరిధిలోని రైల్వే సమస్యలపై త్వరితగతిన చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కు కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి విన్నవించారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ కొత్త రైల్వే లైన్ లు ఏర్పాటుతో పాటు మరికొన్ని రైల్ లకు కమలాపురం, ముద్దనూరు రైల్వే స్టేషన్స్ లో నిలుపుదల కోసం విజ్ఞప్తి చేశారు. కమలాపురం రైల్వే స్టేషన్‌లో చెన్నై–ముంబై మెయిల్ ఎక్స్‌ప్రెస్‌కు నిలుపుదల కల్పించడం,….ముద్దనూరు రైల్వే స్టేషన్‌లో కాచిగూడ–పుదుచ్చేరి, కడప–గుంతకల్ స్పెషల్ ట్రైన్లకు నిలుపుదల కల్పించాలని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అంతేకాకుండా ముద్దనూరు- ముదిగుబ్బ కొత్త రైల్వే లైన్ కు ఇప్పటికే ఫీజిబిలిటీ ఉన్న దృష్ట్యా, ఆర్థికపరమైన అనుమతులు మంజూరు చెయ్యాలని కోరారు.

నేషనల్ హైవే కోసం కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కి వినతి :
వైఎస్సార్ కడప జిల్లా బాకరాపేట నుంచి ప్రకాశం జిల్లా బెస్తవారిపేట వరకూ నేషనల్ హైవే నిర్మించాలని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి విన్నవించారు. ఈ మేరకు అయన మంత్రి నితిన్ గడ్కరీ ని కలిసిన వినతి పత్రం సమర్పించారు. ఈ నేషనల్ హైవే ను బద్వేల్, పోరుమామిళ్ల మీదుగా నిర్మాణం చాలా కీలకమని అయనకు వివరించారు. ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి వినతి మేరకు మంత్రి గడ్కరీ సానుకూలంగా స్పందించారు.