తిరుపతి :
టిటిడి ఛైర్మన్ బిఆర్ నాయుడు కనిపించడం లేదంటూ తిరుపతిలో ఫ్లెక్సీలు వెలిశాయి. టీటీడీ పరిపాలన భవనం ఎదుట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ తరహా వినుత్న నిరసన చేపట్టింది. టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు ఓ మహిళతో సరసాలాడుతూ వీడియోలు లీక్ కావడం... టిటిడి ఛైర్మన్ గా ఉంటూ అయన తిరుమల పవిత్రతను దెబ్బతీశారంటూ వైసీపీ నే కాకుండా హిందు సంఘాలు సైతం మండిపడ్డాయి. దీంతో అయన వీడియో ఉన్న మహిళ విషయంలో తన తప్పేమీ లేదని, తమ కుటుంబ సన్నిహితులమని అయన చెప్పారు.
కానీ ఇందుకు ప్రతీకా వైసీపీ అయనకు సంబంధించి పలు అధారాలను బయట పెట్టింది. టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడుతో వీడియోల్లో కనిపిస్తున్న మహిళ గతంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్‌లకు లేఖ రాసినట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఆ లేఖలో తనతో ఆయనకు ఉన్న 30 ఏళ్ల అనుబంధం, అది ఒక రిలేషన్‌షిప్‌గా మారిన వైనం, ఆపై తను ఎదుర్కొన్న మానసిక వేధింపులు, అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు మరియు బెదిరింపులను ఆమె వివరించినట్లు వైసీపీ వెల్లడించింది. తన కుమార్తె తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతున్న సమయంలో కూడా తాను ఎంతో వేదనకు గురయ్యానని ఆమె ఆ లేఖలో పేర్కొంది. ఇటువంటి వ్యక్తిని టీటీడీ చైర్మన్ వంటి అత్యున్నత పదవిలో కూర్చోబెడితే ఆ సంస్థ గౌరవానికి, పార్టీ ప్రతిష్టకు భంగం కలుగుతుందని ఆమె హెచ్చరించినట్లు సమాచారం. ప్రస్తుతం బయటకు వచ్చిన వీడియోల నేపథ్యంలో ఆ లేఖలోని ప్రతి అక్షరం నిజమనిపిస్తోందని, తక్షణమే బి.ఆర్. నాయుడు తన పదవికి రాజీనామా చెయ్యాలని డిమాండ్లు తీవ్రమయ్యాయి. దీంతో ఇటీవల కొంత కాలంగా అయన పెద్దగా బయట కనిపించకపోవడంతో పెద్ద ఎత్తున ట్రోల్స్ అవుతున్న విషయం తెలిసిందే.

ఈ నేపధ్యంలోనే ఈ రోజు టీటీడీ చైర్మన్ కనిపించడం లేదంటూ బిఆర్ నాయుడు ఫ్లెక్సీ పరిపాలన భవనం ఎదుట పెట్టి నిరసన తెలిపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వినూత్న నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆరే అజయ్ కుమార్, పసుపులేటి సురేష్, వైఎస్ఆర్ కాంగ్రెస్ బీసీ విభాగం అధ్యక్షుడు వాసు యాదవ్, అరుణ్ యాదవ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని ఈ నిరసన తెలిపారు.