* రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో అన్ని మోసాలే ...
* అబద్ధాలే కనిపించాయి తప్ప.. ప్రజలకు జరిగిన మేలు గుండు సున్నా...
* అపద్దాలతో ఒకరిని ఒకరు జాకీలు పెట్టి లేపే ప్రయత్నం చేసుకుంటున్నారు ....
* నేను ఆరోజు చెప్పినట్లే చంద్రబాబు చేస్తున్న ఆర్థిక విధ్వంసాన్ని...
* ఇవాళ కాగ్ కూడా రూడీ చేస్తూ నివేదిక ఇచ్చింది ...
* కరోనా ఎదుర్కొన్న తక్కువ అప్పులు చేశాం...
* కూటమి ప్రభుత్వం ..ఎన్టీసిని ఉల్లంఘిస్తూ అప్పులు చేస్తుంది..
* రైతులను ఆదుకోకుండా.. ఆటలు, పాటలు, స్కిట్లతో కాలక్షేపమంటూ సెటైర్ల్...
* వైపీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహాన్ రెడ్డి విమర్శలు ....
తాడేపల్లి :
రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో అన్ని మోసాలే ... అబద్ధాలే కనిపించాయి తప్ప.. ప్రజలకు జరిగిన మేలు గుండు సున్నా... నేను ఆరోజు చెప్పినట్లే చంద్రబాబు చేస్తున్న ఆర్థిక విధ్వంసాన్ని... ఇవాళ కాగ్ కూడా రూడీ చేస్తూ నివేదిక ఇచ్చింది .... చంద్రబాబు పాలనంతా ఆర్థిక విధ్వంసమేనని ఆరోపించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహాన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం ఆర్థిక విధ్వంసాన్ని కళ్లకు కట్టినట్టు కాగ్ రిపోర్టు చెప్పిందని, చంద్రబాబు హయాంలో రాబడులు తగ్గాయన్నారు. రాష్ట్ర ఆదాయం తగ్గి, ఖర్చులు పెరిగాయని, చంద్రబాబు ప్రతిసారి ఎన్టీసీని ఉల్లంఘిస్తూనే ఉన్నారని క్లారిటీ ఇచ్చారు.
అపద్దాలతో ఒకరిని ఒకరు జాకీలు పెట్టి లేపే ప్రయత్నం చేసుకుంటున్నారు :
అసెంబ్లీ సమావేశాల తర్వాత ప్రజలకు ఏమైనా మంచి జరిగిందా?, బడ్జెట్లో మోసాలు కల్పిత లెక్కలు మాత్రమే కనిపించాయని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో తప్పులు లెక్కలు, సెల్స్ డబ్బాలేనని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ విమర్శించాడు. ఒకరిని మరొకరు జాకీలు పెట్టి లేపే ప్రయత్నం చేసుకున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై అసెంబ్లీ ప్రస్తావన ఏదీ అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం.. ఇటు విద్యార్థులను, అటు రైతులను మోసం చేస్తోందన్నారు.'ఏపీలో 16 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో ప్రజలకు ఒరిగింది సున్నా అసెంబ్లీ సమావేశాల్లో తప్పులు లెక్కలు, సిల్స్ డబ్బాలే. చంద్రబాబు తన కుమారుడికి జారీలు వేసుకోవడమే సరిపోయింది. లోకేష్, చంద్రబాబు కోసం జాకీలు వేశారు. చంద్రబాబు, లోకేష్ కోసం పవన్ కల్యాణ్ జాకీలు లేపే ప్రయత్నం చేశారు. అంతేకానీ, ప్రజలకు చేసిందేమీ లేదు. మీరు ఇచ్చిన హామీలపై అసెంబ్లీలో ప్రస్తావనే లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హమీల ప్రకారం ప్రతీ నిరుద్యోగికి రూ.1.08 లక్షలు బకాయి పడ్డాడు. నిరుద్యోగ భృతి అడుగుతుంటే సమాధానం లేదు. 18 ఏళ్లు నిండిన 60 ఏళ్ల లోపు మహిళలకు ఆడబిడ్డ నిధి కింద రూ.1500 ఇస్తామని హామీ ఇచ్చారు. 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్ట్ మహిళలకు నెలకు 4000 పెన్షన్ ఇస్తామన్నారు.. హామీ అమలు చేశారా?.

కూటమి ఆర్థిక విధ్వంసాన్ని కాగ్ రిపోర్టు కూడా ఎత్తిచూపింది ... :
కూటమి ప్రభుత్వం ఆర్థిక విధ్వంసాన్ని కాగ్ రిపోర్టు కూడా ఎత్తిచూపిందని, నేను చెప్పిన విషయాలనే కాగ్ రిపోర్టు చెప్పిందన్నారు. 2023-24లో ప్రభుత్వం చేసిన మొత్తం ఖర్చు 2,36,486 కోట్లు, 2023-24లో రాబడులు రూ.1,70,767 కోట్లు, 2023-24లో రెవెన్యూ లోటు రూ. 32,680 కోట్లు, ద్రవ్యలోటు రూ.62,719 కోట్లు, చంద్రబాబు వచ్చాక తొలి ఏడాది ఖర్చు రూ.2,49,096 కోట్లు, చంద్రబాబు ప్రభుత్వంలో రాబడులు 1,68,024 కోట్లు మాత్రమే. చంద్రబాబు హయాంలో రెవెన్యూ లోటు రూ.60,285 కోట్లు...చెప్పారు.
కరోనా ఎదుర్కొన్న తక్కువ అప్పులు చేశాం...కూటమి ప్రభుత్వం ..ఎన్టీసిని ఉల్లంఘిస్తూ అప్పులు చేస్తుంది.. :
చంద్రబాబు హయాంలో రాబడులు తగ్గాయి. రాష్ట్ర ఆదాయం తగ్గింది. ఖర్చులు పెరిగాయి. చంద్రబాబు వచ్చాక రెవెన్యూ లోటు 56 శాతం పెరిగింది. కూటమి వచ్చాక ద్రవ్య లోటు 32.5 శాతం పెరిగింది. చంద్రబాబు పాలనంతా ఆర్థిక విధ్వంసమే. 2024. జీఎస్టిలో అప్పుల శాతం 5.89 శాతం. గత ప్రభుత్వ హయాంలో అప్పుల శాతం 4.1 శాతము మాత్రమే. మేము తూచా తప్పకుండా మేనిఫెస్టోను అమలు చేశాం. కోవిడ్ పరిస్థితులను ఎదుర్కున్నా... అప్పులు 4.1 శాతం మాత్రమే చేశాం. ఎన్టిసికి లోబడే ఎవరైనా అప్పులు తీసుకోవాలి. చంద్రబాబు ప్రతిసారీ ఎన్టీసిని ఉల్లంఘిస్తూనే ఉన్నారు. 2014-19 మధ్య అనుమతించిన దాని కన్నా అధికంగా అప్పులు చేశాడు. చంద్రబాబు రూ. 29,099 కోట్లు అధికంగా అప్పులు చేశారు. మా హయాంలో పరిమితి కన్నా తక్కువగా అప్పులు చేశాం. రూ.12,709 కోట్లు తక్కువగా అప్పులు చేశాం. కరోనా పరిస్థితులు కూడా తక్కువగానే అప్పులు చేశాం. చంద్రబాబు రాగానే మళ్లీ సీన్ రివర్స్ అయ్యింది. 2024-25లో పరిమితికి మించి 17,953 కోట్లు అధిక అప్పులు, 20 నెలల్లో బాబు తెచ్చిన అప్పులు 3.20 లక్షల కోట్లు దాటాయి. మేము ఐదేళ్ల కాలంలో రూ.3 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేశాం. మేము బడిళ్లలో చేసిన అప్పు. బాబు రెండేళ్లలోనే చేశారు. ఏపీని దోచుకుంటున్నారు కాబట్టి ఆదాయణ పెరగడం లేదు.
ఎపి అప్పులపై తప్పుడు నివేదికపై కేంద్రానికి లేఖ రాస్తాం.. :
కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర సంపదను బినామీలు, ఎల్లో మీడియా సహచరులు దోచుకుంటున్నారు. విశాఖలో రూ.5000 కోట్ల విలువైన భూమిని దోచిపెట్టారు. చంద్రబాబు సమీప బంధువుకు భూములు కట్టబెట్టారు. ఇలా దోచిపెడుతుంటే రాష్ట్రానికి ఆదాయం ఎలా వస్తుంది?. రాష్ట్ర ఖజానాలో మినిమమ్ బ్యాలెన్స్ కూడా లేదు. చంద్రబాబు పాలన చేయడం లేదు.. బిల్డప్ మాత్రమే. 2024-25 కాగ్ రిపోర్టు ప్రకారం అప్పు రూ.81,092 కోట్లు, అసెంబ్లీ సాక్షిగా రూ.60,485 కోట్లు అని బాబు తప్పుడు సమాచారం ఇచ్చారు. చంద్రబాబు తప్పుడు సమాచారంపై కేంద్రానికి లేఖ రాస్తాం. డివోపేటికి, లేబినెట్, ఫైనాన్స్ సెక్రటరీలకు లేఖ రాస్తాం' అని వైఎస్ జగన్ అన్నారు.

ఎగ్గొట్టిన డబ్బులు ఎప్పుడు ఇస్తారు?
00 ఏళ్ల లోపు మహిళలకు మా ప్రభుత్వ హయాంలో 66,34,372 మందికి పెన్షన్లు ఇచ్చాం. కూటమి ప్రభుత్వంలో 2026 ఫిబ్రవరి నాటికి 60,96,108 మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చారు. ఒక్క నెలలోనే 25వేల పెన్షన్లు కట్ చేశారు. కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదు. పెన్షన్ల కింద బడ్జెట్లో పెట్టాల్సింది రూ.31,554 కోట్లు అయితే బడ్జెట్ కేటాయించింది రూ.27,719 కోట్లు మాత్రమే భవిష్యత్లో ఇంకా పెన్షన్లు కట్ చేసే అవకాశం ఉంది. పెన్షన్లపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సమాధానం లేదు. మా ప్రభుత్వంలో యూవీఐఎస్సీ ప్రకారం 87,41,885 మందికి అమ్మబడి ఇచ్చాం. కానీ, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం తల్లికి వందనం పేరుతో 20 లక్షల మంది పిల్లలను తొలగించారు. తల్లికి వందనం కింద ఎగ్గొట్టిన డబ్బులు ఎప్పుడు ఇస్తారు?. ఏ ఒక్కరికి రూ.15000 ఇవ్వలేదు.
అన్నదాత సుఖీభవ పేరుతో మోసం.. :
ఉచిత బస్సు హామీని కూడా పూర్తిగా నెరవేర్చలేకపోయారు. షరతులు పెట్టారు. ప్రతి మహిళకు మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. తొలి ఏడాది ఒక సిటెండర్ ఇచ్చి.. మిగతా రెండు ఎగ్గొట్టారు. అన్నదాత సుఖీభవ పేరుతో రైతులను మోసం చేశారు. రెండేళ్లలో ప్రతీ రైతుకు రూ.40 వేలకు గాను పదివేలే ఇచ్చారు. అన్నదాత సుఖీభవ నుంచి 7 లక్షల మంది రైతులను తొలగించారు. కౌలు రైతుల ప్రస్తావనే లేదు. ఉచిత పంటల బీమాను చంద్రబాబు రద్దు చేశారు. మోంధా తుపాను కారణంగా నష్టపోయిన లక్షల మంది రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడి ఇప్పటికి ఇవ్వలేదు. ఒక్క రూపాయి కూడా రైతులకు చెల్లించలేదు. ఎప్పుడు ఇస్తారో వ్యవసాయశాఖ మంత్రైనా, ముఖ్యమంత్రి అయినా చెప్పారా?. ధరల స్థిరీకరణ నిధి కోసం రూ.300 కోట్లే కేటాయించడం ఏంటని శాసనమండలిలో మా సభ్యులు అడిగితే మంత్రులు ఎదురుదాడి చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో ఏయే పంటలు ఎంత ఖర్చుచేసి కొన్నామో సమగ్రమైన వివరాలను ప్రభుత్వానికి మా సభ్యులు చైర్మన్ ద్వారా ఇచ్చారు. ధరల స్థిరీకరణ నిధికి కేటాయింపులు పెంచి రైతులను ఆదుకోవాలన్న స్పృహ వారికి లేకుండా పోయింది. ఇప్పుడు మళ్లీ మిర్చి, శనగ, మొక్కజొన్ని, అరటి పంటలకు ధరలు పడిపోయాయి. నెలరోజుల క్రితం రూ.26వేలు ఉన్న క్వింటా మిర్చి ధర, ఇప్పుడు రూ.18వేలకు తగ్గింది.
రైతులను ఆదుకోకుండా.. ఆటలు, పాటలు, స్కిట్లతో కాలక్షేపమంటూ సెటైర్ల్ :
శనగ ఎంఎస్పీ రూ.5,675 అయితే రైతులు రూ.5000లోనే అమ్ముకుంటున్నారు. మొక్కజొన్న MSP రూ.2,400 అయితే రైతులకు రూ.1400 నుంచి రూ.1,500 కూడా చక్కని పరిస్థితి, ఒక్క మొక్కజొన్న విషయంలోనే రైతులు రూ.3,500 కోట్లు నష్టపోతున్నారు. అరటి మళ్లీ టన్ను రూ.5వేలకు పడిపోయింది. మా హయాంలో అరటి టన్ను రూ. 30 వేలకు అమ్ముకున్నారు. వైఎస్సార్సిపి హయాంలో దళారులకు వణుకు పుట్టించేవాళ్లం. రైతులకు భరోసా ఇవ్వాల్సింది పోయి ఆటలు, పాటలు, స్కిట్లతో కాలక్షేపం చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతులు, రైతు కూలీల కుటుంబాలకు ఎప్పుడు పరిహారం ఇస్తారో చెప్పలేదు. వ్యవసాయ రంగంలో ఉన్న సంక్షోభం గురించి, రైతుల కష్టాల గురించి చర్చించడం, మాట్లాడ్డం మచ్చుకైనా మాట్లాడలేదు' అని ఆగ్రహం వ్యక్తంచేశారు.