Monday, 23 March 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

దేవదేవుడికే భూములమ్మిన వ్యాపారి చంద్రబాబు .... ! టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి ధ్వజం ...

09 Mar 2026
07:47 PM
26

* రాజధానిలో చంద్రబాబు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ...
* అమరావతి ప్రాంతంలో టీటీడీ ఆలయ నిర్మాణానికి టీటీడీ 25 ఎకరాల భూమి కొనుగోలు ...
* ఎకరా రూ.50 లక్షలకు కొనిపించిన టీడీపీ ప్రభుత్వం...
* సంప్రదాయానికి భిన్నంగా రూ.12.50 కోట్లు వసూలు.....
* నాటి టీడీపీ ప్రభుత్వంలో 2018లో ఈ వ్యవహారం - భూమన కరుణాకర్‌రెడ్డి ఆక్షేపణ ...
* ఆలయాలు, కళ్యాణ మండపాలకు దాతల నుంచే భూమి ...
* టీటీడీ ఎక్కడా వాటి కోసం భూములు కొనుగోలు చేయలేదు...
* చెన్నై, భువనేశ్వర్, మహారాష్ట్ర, జమ్మూ కశ్మీర్‌లోనూ అదే పద్ధతి...
* రాజధానిలో చంద్రబాబు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి పరాకాష్ట  ...
* చివరకు దేవదేవుడినీ వదిలి పెట్టని సీఎం చంద్రబాబు....

తిరుపతి : 

గత సంప్రదాయాలకు భిన్నంగా అమరావతిలో దేవదేవుడి ఆలయ నిర్మాణం కోసం టీటీడీ నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేసిన నీచ చరిత్ర చంద్రబాబుదని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి ఆక్షేపించారు. చంద్రబాబు తన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార ప్రయోజనాల కోసం చివరకు తిరుమలను కూడా వాడుకోవడం అత్యంత హేయమని ఆయన మండిపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైనా సరే, శ్రీవారి ఆలయ నిర్మాణానికి దాతలు లేదా ప్రభుత్వాలు ముందుకొచ్చి భూములు ఉచితంగా అందజేస్తుంటే, ఇక్కడ చంద్రబాబు మాత్రం 2018లోనే అమరావతిలో 25 ఎకరాల స్థలాన్ని ఎకరం రూ.50 లక్షల చొప్పున రూ.12.50 కోట్లకు బలవంతంగా కొనిపించారని వెల్లడించారు. శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమి ఉచితంగా ఇవ్వాలని టీటీడీ కోరినా, చంద్రబాబు లెక్క చేయలేదని చెబుతూ, అందుకు తగిన ఆధారాలు చూపారు. చివరకు రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లలోనూ ఆలయ నిర్మాణాలకు అనుమతి ఇవ్వడం చంద్రబాబు ధన దాహానికి నిదర్శనమని తిరుపతిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన భూమన కరుణాకర్‌రెడ్డి గుర్తు చేశారు.
 

టీటీడీలో భూముల కొనుగోలు సంస్కృతి లేదు:
    దేశంలోనే కాకుండా, విదేశాల్లో సైతం ఎక్కడ తిరుమల శ్రీవారి ఆలయం కట్టినా, భూమి కొనుగోలు సంప్రదాయం లేదు. చెన్నై, భువనేశ్వర్, మహారాష్ట్ర, జమ్మూ కశ్మీర్‌లోనూ శ్రీవారి ఆలయాలకు ఆయా  రాష్ట్ర ప్రభుత్వాలే ఉచితంగా భూములు సమకూర్చాయి. చివరికి టీటీడీ కళ్యాణ మండపాలకు సైతం దాతలు ముందుకొచ్చి భూములతో పాటు,  40 శాతం నిధులు నిర్మాణానికి డిపాజిట్‌ చేయాలనే నిబంధన ఉంది. గతంలో చెన్నైలో శ్రీవారి ఆలయం విస్తరించడం కోసం భూములు కొనాల్సి వస్తే టీటీడీ అంగీకరించకపోవడంతో, ఆలయ కమిటీ చైర్మన్‌ తన సొంత డబ్బుతో భూమి కొనుగోలు చేసి ఆలయానికి విరాళంగా ఇచ్చారు. మాట్లాడితే శ్రీ వెంకటేశ్వరస్వామి తన ఇంటి ఇలవేల్పు అని చెప్పుకునే చంద్రబాబు, అమరావతిలో ఆలయ నిర్మాణం కోసం టీటీడీ నుంచి భూమి కొనుగోలు చేయించడం హేయం. 

టీటీడీ కోరినా ససేమీరా అన్న చంద్రబాబు:
    విభజిత ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు తొలిసారి సీం అయ్యాక, అమరావతిలో ఆలయ నిర్మాణం కోసం భూమి ఉచితంగా ఇవ్వాలంటూ, 2018 ఆగసు ్ట28న టీటీడీ, ఏపీ ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. అయినా ససేమీరా అన్న సీఎం చంద్రబాబు, ఎకరాకు రూ.50 లక్షల చొప్పున, 25 ఎకరాలకు రూ.12.50 కోట్లు టీటీడీ ముక్కు పిండి వసూలు చేయడమే కాకుండా, అనేక నియమ నిబంధనలు విధించారు. ఇన్ని చేసిన చంద్రబాబు, దేవదేవుడే తన దగ్గర భంగపడి డబ్బులిచ్చి ఆలయం నిర్మించాలని కోరినట్లుగా వ్యవహరిస్తున్నాడు. 

ఆలయ నిర్మాణం కోసం రూ.200 కోట్లు:
  అమరావతిలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార అభివృద్ధి కోసం సాక్షాత్తూ శ్రీ వెంకటేశ్వరస్వామినే వాడుకోవాలని భావించిన చంద్రబాబు, నాడు అక్కడ టీటీడీ ఆలయ నిర్మాణాన్ని ప్రతిపాదించారు. ఇంకా ఆలయ నిర్మాణానికి దాదాపు రూ.200 కోట్ల భారీ వ్యయం చేయాలని నిర్ణయించారు. కాగా, కోయంబత్తూరులో జీ స్వే్కర్‌ అనే రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌లో టీటీడీ ఆలయ నిర్మాణానికి సీఎం కార్యాలయం నుంచే ప్రతిపాదనలు వెళ్లాయి. ఆ తర్వాత మూడు నెలల క్రితం టీటీడీ బోర్డు సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. ఇలా శ్రీవారి ఆలయ నిర్మాణాల్లోనూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార ప్రయోజనాలు చూస్తున్న చంద్రబాబుకు, స్వామి వారి మీద భయం, భక్తి ఉన్నాయంటే ఎవరు నమ్ముతారు?.

నెయ్యి నిల్వలు అడుగంటాయి:
    చంద్రబాబు దేవుడిని అడ్డం పెట్టుకుని ఇన్ని దారుణాలు చేస్తున్నాడు కాబట్టే ఆయన పాపాలు వరుసపెట్టి పండిపోతున్నాయి. ఇందాపూర్‌ ముసుగులో హెరిటేజ్‌ కి టీటీడీ నిధులు దోచిపెట్టడానికి చంద్రబాబు చేసిన కుట్రల దగ్గర నుంచి ప్రతిదీ స్వామివారే బయటకు తీసి మాతో పలికిస్తున్నాడు. నిన్న ఇందాపూర్‌ నుంచి నెయ్యి తీసుకొచ్చే నెయ్యి ట్యాంకర్‌ కడపలో బోల్తా పడింది. తీరా చూస్తే టీటీడీ దగ్గర కొండ మీద రెండు రోజులుకు సరిపోయే నెయ్యి కూడా లేదు. ఈరోజు (సోమవారం) ఉన్న నెయ్యి స్టాక్‌ కేవలం 3,500 కేజీలు మాత్రమే. వారు ఎంత బుకాయించినా ఇది నిజం. స్వామి వారి లడ్డూ ప్రసాదం పట్ల ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్యానికి నిదర్శనం. 

ఇకనైనా బీఆర్‌ నాయుడితో రాజీనామా చేయించాలి:
    ఆడవారి జోలికెళితే ఎవరికైనా అదే ఆఖరి రోజు అవుతుందని మహిళా దినోత్సవం సందర్భంగా చెప్పిన చంద్రబాబు.. బీఆర్‌ నాయుడి వేధింపులపై ఏడాది కిందటే ఒక మహిళ నేరుగా ఆయనకే లేఖ రాస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎలాంటి చర్యలు తీసుకోకపోగా ఆయనకు ఏకంగా టీటీడీ చైర్మన్‌ పదవి కట్టబెట్టారు. మరి ఇది నిజంగా మహిళలకు న్యాయం చేయడమేనా?. ఆ తర్వాత తాజాగా బీఆర్‌ నాయుడి అశ్లీల వీడియోలు బయటికొచ్చాయి. అయినా చంద్రబాబు స్పందించడం లేదు. కనీసం మహిళా దినోత్సవం రోజైనా ఆయనతో రాజీనామా చేయించి ఉంటే బాగుండేది. కానీ, చంద్రబాబు ఆ పని చేయలేదు. అలా చంద్రబాబునాయుడు ప్రోత్సహించడం వల్లే, అతి పవిత్రమైన భగవద్గీత గురించి కూడా బీఆర్‌ నాయుడు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని భూమన కరుణాకర్‌రెడ్డి గుర్తు చేశారు.

 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!