* ఈ రోజు ఇక్కడ... రేపు ఎక్కడో ....!
* ట్రాన్స్ ఫర్ అయితే ఎంత కాలం ఉంటామో.... ఎప్పుడు ట్రాన్ష్ ఫర్లు వస్తాయోనన్న కంగారు ...!
* రెండేళ్లలో ముగ్గురు ఎస్పీలు బదిలీ...
* ఇక సిఐ, ఎసైలైతే ఎప్పుడు ఎక్కడా ఉంటారో తెలియని పరిస్ధితి ...

KADAPA POLICE :
కడప జిల్లా పోలీసు శాఖలో అకస్మిక బదిలీల టెన్షన్ ఆ శాాఖ అధికారులను కలవరపాటుకు గురిచేస్తొంది. ఈ రోజు ఇక్కడ... రేపు ఎక్కడో అన్న చందంగా మారింది పరిస్ధితి. రెండేళ్లలో ముగ్గురు ఎస్పీలతో పాటు పలువురు డిఎస్పీల బదిలీలతో పాటు ఇతర సిఐ, ఎసైల బదిలీలు అయితే నిరంతర ప్రక్రియలా తయారైంది.

ఒక స్టేషన్లో ఎస్సై కానీ ఒక సర్కిల్లో సిఐ కానీ ఒకప్పుడు కనీసం మూడేళ్లు పనిచేసేవారు. ఏదైనా వివాదాల్లోనో.. మరి ఏదైనా అవినీతి ఆరోపణలోనో., విధి నిర్వహణలో వైపల్యం వలన నో ఆకస్మికంగా బదిలీలు అయ్యేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. కానీ ఇప్పుడు కడప జిల్లాలో ఎస్ఐ ఎన్ని గంటలు ...ఎన్ని రోజులు... ఎన్ని నెలలు స్టేషన్లో విధులు నిర్వహిస్తాడో , ఏ సీఐ ఇదే తరహా లో పనిచేస్తాడో చెప్పలేని పరిస్థితి. కడప జిల్లాలోని ఎస్సైలు సీఐల ట్రాన్స్ఫర్లు చిటికెసినట్లు జరిగిపోతుండటంతో వీరి పోస్టింగులు ట్రాన్స్ ఫర్లు నిలకడగా ఏడాది పాటు కూడా ఉండడం లేదనే విమర్శలు ఉన్నాయి. ట్రాన్స్ ఫర్ల విషయంలో ఎస్సైలు, సీఐల జీవితాలతో చెడుగుడాడుతున్నట్లు ఉందని ఆ శాఖలోని చెప్పుకుంటున్నారు. ఆరు నెలల లోపల ఆ అధికారిని ఒప్పించలేకపోతే బదిలీ లేదా పనిష్మెంట్ తప్పదని కూడా చర్చలు నడుస్తున్నాయి. ఇటీవల కాలంలో వరుస పెట్టి జరుగుతున్న ఎస్ఐలు సీఐల బదిలీలే ఇందుకు నిదర్శనం.
పోలీసు శాఖలో నిలకడగా ఉద్యోగం చేసుకోవాలంటే అధికార నాయకులు... ఉన్నతాధికారులు ఆడించినట్లు ఆడాలి.... ఆడించమన్నట్లు ఆడించాలి. ఇవి చేస్తేనే వారు కోరుకున్న పోస్ట్ గ్యారెంటీ. లేదంటే కొన్ని గంటల్లోనో... రోజుల్లోనో వచ్చిన పోస్టింగ్ ఆర్డర్లు తారుమారవుతాయి. అంతో ఇంతో నిజాయితీ నిబద్ధతలతో పనిచేయాలన్న... పోలీసు శాఖకు గౌరవం తీసుకువచ్చే ప్రయత్నం చేసినా ఇక్కడి నేతలు సహించరు. అధికారులు సహకరించరు. కడప జిల్లాలో పోలీసు శాఖలో ఎస్సై స్థాయి నుండి ఎస్పీల స్థాయి అధికారుల వరకు జరుగుతున్న బదిలీలపై పెద్ద చర్చే నడుస్తోంది. డబ్బులు ఖర్చు చేసి పోస్టింగ్లు తెచ్చుకున్న మూడు నుంచి ఆరు నెలలకు మించి ఉద్యోగం చేయటం లేదనే విమర్శలు ఉన్నాయి.
కడప జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ అంటే కత్తి మీద సామే. నిజాయితీ నిబద్ధత తో పాటు సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తేనే ఇక్కడ శాంతి భద్రతలు సాధ్యం. చాలా కాలం పోలీస్ శాఖ ఈ దారిలోనే నడిచింది. అందుకేనేమో వేళ్ళునుకొని పోయిన ఫ్రాక్షన్ ముఠా కక్షలే కాదు... ఇతర ఘరానా నేరాలను.. సాంఘిక దురాచారాలను కూడా కఠినంగా నియంత్రించిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో గత రెండు దశాబ్దాలుగా పోలీసులు... పోలీసు అధికారుల తీరులో చాలా మార్పు కనిపిస్తోంది. అధికారంలో ఎవరుంటే వారి పక్షాన గుడ్డిగా పని చేయాల్సి వస్తుందట. లేదంటే ఎంత సమర్ధులైన ఎస్ఐ, సీఐతో పాటు ఇంకేంతటి అధికారులైన తెరచాటుకు వెళ్లాల్సిందే. ఈ పరిస్థితి ఇటీవల కాలంలో హెచ్చుమీరిందట. కడప జిల్లాలో కేవలం 15నెలల్లో ముగురు ఎస్పీలు మారిన తీరు ఇక్కడి పరిస్థితికి అద్దం పడుతుందట. ఇక ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అస్మదీయులుగా ఉన్న సబ్ ఇన్స్పెక్టర్లు... సర్కిల్ ఇన్స్పెక్టర్లు... డీఎస్పీలకే పోస్టింగులు వస్తున్నాయన్నది నగ్నసత్యం. ఈ పరిణామాలు ఈ శాఖకు జాడ్యంగా మారిందట. దీంతో పాటు అధికారంలో ఉన్న వారెవరికి కోపం వచ్చినా... మరి ఎవరికి ఇష్టం లేకపోయినా తుమ్మితే ఊడిపోయిన ముక్కుల్లా పోలీసు అధికారుల పోస్టింగులు మారిపోతున్నాయట. అధికార పార్టీ నాయకులకు.... ఉన్నతాధికారులకు అన్ని వ్యవహారాలు చక్కబెట్టే వారికే పెద్దపీట దక్కుతోందట. ఇందులో మరో మడత పేజీ కూడా ఉందట.పోస్టింగ్ వచ్చిందని విచ్చలవిడిగా వ్యవహరించి వివాదాస్పదంగా మారి చిక్కులు కొని తెచ్చుకుంటే తమకేమీ సంబంధం లేదన్నట్లు పార్టీ నాయకులు... ఉన్నతాధికారులు తప్పుకుంటున్నారట. దీంతో కొంతమంది సీఐలు... ఎస్సైలు చివరకు ఐపీఎస్ స్థాయి అధికారులు కూడా అశాంతితో, అభద్రతతో బతుకుతున్నారట.
కడప జిల్లాలో ఇటీవల కాలంలో ఎవరు ఊహించని విధంగా సీఐలు, ఎస్సైల బదిలీల జాబితాలు విడుదలవుతున్నాయి. ఎప్పుడు ఎవరికి ఏ పోస్టింగ్ వస్తుందో... పోస్టింగ్ వచ్చిన రెండు మూడు గంటలు లేదా రోజులు లోపే ఉడుతుందో తెలియని అగమ్యగో చరంలో ఎస్సై.. సిఐ స్థాయి అధికారులు ఉండిపోవాల్సి వస్తుందట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అనుకూలంగా ఉంటారనుకొని కొందరు సర్కిల్ ఇన్స్పెక్టర్లను ఇన్స్పెక్టర్లకు నాయకులు పోస్టింగ్ వేయించుకున్నారట. ఈ ఈ వివాదాలు బదిలీల క్రమంలో కొన్ని రోజుల క్రితం చిన్నచౌక్ సీఐ తేజోమూర్తి, కడప వన్ టౌన్ సిఐ రామకృష్ణ ప్రొద్దుటూరు సిఐ సదాశివయ్య, రిమ్స్ సీతారాం రెడ్డి, లతోపాటు మరికొందరు సీఐలైన నాగార్జున, రోషన్, నాగభూషణం, మోహన్ కుమార్, హసన్, రాముడు వంశీధర్ గౌడ్ మోహన్, యోగేంద్ర తదితరుల తో పాటు మరికొందరు సీఐలు పోస్టింగులు వచ్చిన రోజుల్లో నెలల్లో నే మళ్లీ వారు పోస్టింగ్ లు కోల్పోయారని విమర్శలున్నాయి. ఇక ఎస్సైల బదిలీల విషయంలో కూడా ఇదే వ్యవహారం నడుస్తున్నట్లు తెలుస్తుంది. ట్ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చిన గంటల్లోపే మారుతున్న సందర్భాలు కూడా లేకపోలేదు. గత వైసిపి ప్రభుత్వం హయాంలో ఆ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిన కొంతమంది ఈ ప్రభుత్వంలోనూ చక్రం తిప్పుతుండడం గమనార్హం. పోస్టింగులు నిలబెట్టుకోవడం కోసం ఉన్నతాధికారులకు లంచాలు,కొందరు ఎమ్మెల్యేలతో పాటు అధికార పార్టీ నాయకులు చెప్పిన పనులు చేసేవారికి మాత్రమే ప్రాధాన్యతకుతోందని చర్చించుకుంటున్నారు. కాగా ఇటీవల ప్రొద్దుటూరు వన్ టౌన్ సి శ్రీరామ్ ఆదోని నుంచి ప్రొద్దుటూరు కు బదిలీ కావడం 40 రోజులకే ఆ స్థానాన్ని కోల్పోవడం పెద్ద చర్చనీయాంశంగా అంశంగా మారింది. ఇప్పుడు అయనను మళ్లీ పులివెందులకు పోస్టింగ్ ఇచ్చారు. ఇక్కడ అయన ఎన్ని యేళ్లు ఉంటారో అర్దం కావడం లేదు. అర్కే వ్యాలీ సిఐగా ఉన్న ఉలసయ్య యేడాది క్రితమే అక్కడి వెళ్లారు. కానీ ఇంతలో ఎమైందో ఎమో... మళ్లీ అయనను వీఆర్ కు బదిలీ చేశారు. ఎందుకు ఇలా బదిలీలు జరుగుతున్నాయో అర్థం కావడం లేదు.ఎప్పుడు ఎక్కడికి బదిలీ ఆర్డర్స్ వస్తాయో తెలియడం లేదు.

గతంలో ఎస్ఐలు, సిఐల బదిలీలు మూడేళ్లకు జరిగేవి. ఇప్పుడు సమయము, సందర్భము, కారణము లేకుండా కూడా బదిలీలు జరిగిపోతున్నాయి. పోలీసు శాఖలోని అధికారులకు స్థిరత్వం లేకపోతే ఇక వారి విధులు ఏ విధంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. కొందరైతే జిల్లాస్థాయి అధికారులను కూడా లెక్కచేయకుండా ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తున్న వారిని మాత్రం... ప్రశ్నించలేని స్థితిలో జిల్లా బాసులు ఉన్నారట. బంధువులు అయితే చాలు వారికి ఎలాంటి బదిలీలు ఇబ్బందులు ఉండవట. దీంతో పాటు నెలనెలా డబ్బులు వసూలు చేసి పంపిణీలు చేసేవారికి కూడా పోస్టులు పదిలంగా ఉంటాయంటూ కొందరు పోలీసులే నర్మగర్భంగా మాట్లాడుకుంటున్నారట. అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలీసు వ్యవస్థలో విచ్చలవిడితనము, అవినీతి, బంధుప్రీతి విరిగిపోయిందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన పోలీసులకు ఇంతటి అభద్రత మధ్యన విధులు నిర్వహించాల్సి రావడం దారుణమనే చెప్పవచ్చు.