-ప్రొద్దుటూరులో ఘనంగా టిడిపి నేత సూర్యప్రతాప్ రెడ్డి జన్మదిన వేడుకలు...
-పట్టణంలో ప్రత్యేక పూజలు... భారీ బైక్ ర్యాలీ...
-పట్టణంలో కోలాహాలం .....

ప్రొద్దుటూరు :
ప్రొద్దుటూరులో టిడిపి నేత భూమిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రొద్దుటూరులోని బొల్లవరం ఆంజనేయస్వామి పాదాల చెంత వేద మంత్రాల సాక్షిగా...ప్రత్యేక పూజలతో మొదలైన సూర్యప్రతాప్ రెడ్డి జన్మదిన వేడుకలు... పట్టణంలో అయన అనుచరులు ఘనంగా నిర్వహించారు. ఈ పూజల అనంతరం పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా... ప్రధాన కూడళ్లలో అయన అనుచరులు భారీగా బాణా సంచా కాల్చుతూ కోలాహాలంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. భారీ కేక్ కట్ చేసుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈ సంబరాల సంబర్బంగా అయన అనుచరులు మాట్లాడుతూ ఓ సాధారణ కార్యకర్తగా ప్రారంభమైన సూర్యప్రతాప్ రెడ్డి రాజకీయ ప్రస్థానం నేడు తెలుగుదేశం పార్టీ విజయ కేతనానికి అసలైన వెన్నుముకలా మారిందన్నారు. సూర్య భాయ్ సత్తా కేవలం ఒక నియోజకవర్గానికో, ఒక ప్రాంతానికో పరిమితం కాలేదని, ఆయన పుట్టినరోజు ప్రొద్దుటూరు నియోజకవర్గమే కాదని రాయలసీమ అంతా ఒకటే మాట వినిపిస్తోందన్నారు. సూర్య భాయ్ అంటే ఒక బ్రాండ్ అని, ఆయన రాజకీయం ఒక ట్రెండ్ అని కొనియాడారు. పదవులు ఆయన్ను వెతుక్కుంటూ వస్తాయే తప్పా, ఆయన పదవుల వెనుక వెళ్లే రకం కాదని, మా నాయకుడు ఎక్కడున్నా మాకు కొండంత అండగా ఉంటారని, తమ లాంటి వేలాది మంది యువ సైన్యం సూర్య భాయ్ వెంటే ఉందన్నారు. సేవ చేసిన, రాజకీయం చేసిన అది కేవలం సూర్య ప్రతాపరెడ్డి మార్క్ ప్రత్యేకమని చెప్పారు. తెలుగుదేశం పార్టీలో అత్యున్నత పదవులను అధిరోహించి, ఈ ప్రాంతాన్ని రూపురేఖలను మార్చే సత్తా ఉన్న ఈ ధీశాలికి ఆ ఆంజనేయస్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నామని ఆకాంక్షించారు.