Monday, 23 March 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / అంతర్జాతీయ వార్తలు

ఇజ్రాయెల్ దాడుల్లో.. ఖమేనీ కుమారుడు ముజ్తబాకు గాయాలు..!

08 Mar 2026
02:21 PM
31

* ఫిబ్రవరి 28న లయన్స్ రోర్‌లో భాగంగా ఇజ్రాయెల్ దాడి ...
* దాడిలో ఖమేనీ, కీలక నాయకులు, జనరల్స్ మృతి... 
* దాడి సమయంలో మోజ్తబా ప్రాణాలతో బయటపడినట్లు వార్తలు ...
* అయితే దాడి సమయంలో కాంపౌండ్‌లో ఉన్నారా ? లేరా ? 
* వెల్లడి కావాల్సి ఉందంటూ అంతర్జాతీయ మీడియా కథనాలు ...

Article Image
ఇరాన్   : 

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉండగానే...ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ కుమారుడు కూడా ఇజ్రాయెల్ వాయుసేన జరిపిన తొలి దాడుల్లో గాయపడినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 26వ తేదీన ఇరాన్‌పై ఆపరేషన్ లయన్స్ రోర్ పేరుతో ఇజ్రాయెల్ వాయుసేన దాడులకు దిగిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. ఆ దాడుల్లో ఆయన కుమారుడు ముజ్తబా హుస్సేనీ ఖమేనీ గాయపడినట్టు ఇప్పుడు కొత్తగా సమాచారం అందుతుంది.

ఆ దాడుల వల్ల ఖమేనీతో పాటు ఇరాన్‌కు చెందిన 40 మంది కీలక నాయకులు, సైనిక జనరల్స్ ప్రాణాలు కోల్పోయారు. అయితే మజ్తబా మాత్రం ప్రాణాలతో బయటపడ్డారట. దాడుల సమయంలో ముజ్తబా ఆ ప్రాంగణంలో ఉన్నారా, లేదా అనే విషయంపై క్లారటీ లేదు. అయితే ఆ దాడుల్లో మజ్తబా భార్య జహ్రా ప్రాణాలు కోల్పోయారు. కాగా, మజ్తబా గాయాల తీవ్రత గురించి ఎలాంటి సమాచారమూ లేదు. కాగా, తండ్రి స్థానంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయ్యేందుకు మజ్తబా పావులు కదుపుతున్నారు.


ఇరాన్‌లోని శక్తివంతమైన ఐఆర్‌జీసీపై మజ్తబాకు పూర్తిగా పట్టు ఉంది. దీంతో ఖమేనీ స్థానాన్ని ముజ్తబా భర్తీ చేస్తారని అందరూ అంచనా వేస్తున్నారు. అయితే అదంత సులభం కాదు. ఎందుకంటే ఇరాన్ సుప్రీం లీడర్‌ను నిర్ణయించే గార్డియన్ కౌన్సిల్‌లోని కొందరు సభ్యులు అధికారాన్ని మజ్తబాకు వారసత్వంగా ఇచ్చేందుకు ఇష్టపడడం లేదట. అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా మజ్తబాకు అధికారం అప్పగించేందుకు సుముఖంగా లేరు.

ఈ పరిస్ధితుల్లో ఇజ్రాయేల్ దాడి జరిగిన సమయంలో అసలు  మజ్తబా అవరణంలో ఉన్నారా ? లేరా ? అసలు అయన ఇప్పుడెలా ఉన్నారు ? అన్నది చర్చనీయాంశంగా మారింది. 

 

 

 

 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!