Monday, 23 March 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / జాతీయ వార్తలు

భారత్ పై తీవ్ర ప్రభావం చూపిన ఇరాన్ వార్...గ్యాస్ ధరల షాక్ ...!

07 Mar 2026
10:47 AM
60

• నేటి నుంచి భారీగా పెరగనున్న ధరలు...!

•సామాన్యులతో పాటు హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వాణిజ్య సంస్థలపై తీవ్ర ప్రభావం.....

Article Image
Iran War   :

ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ చేస్తున్న యుద్దం అందరు ఊహించినట్లుగానే గ్యాస్ ధరలపై తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పటికే అధిక ధరలతో అల్లాడుతున్న జనాలకు గ్రాస్ మంట (LPG Price hike) రేపుతొంది. హార్ముజ్ జలసంధి నుంచి ఎల్బీజీ సరఫరాపై ప్రభావం పడుతున్న నేపథ్యంలో కేంద్రం గ్యాస్ ధరలు పెంచేసింది. ఇవాళ్టి నుంచి ఇళ్లకు వాడే సిలెండర్లతో పాటు వాణిజ్య సిలెండర్లపైనా భారీగా రేట్లు పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.
Article Image
ఇరాన్ వార్ లో భారత్ కు హార్ముజ్ జలసంధి షాక్...!

దేశవ్యాప్తంగా 14.2 కిలోల గృహోపకరణాల వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.60 పెరిగింది. అదేవిధంగా 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర కూడా రూ.115 పెరిగింది. దీని ప్రభావం హోటళ్ళు, రెస్టారెంట్లు, చిన్న వాణిజ్య సంస్థలపై పడబోతోంది. పెరిగిన గ్యాస్ సిలెండర్ ధరలు ఇవాళ్టి నుంచే అమల్లోకి వస్తున్నాయి.


ఢిల్లీలో 14.2 కిలోల గృహోపకరణాల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.853 నుండి రూ.913 కు పెరిగింది. ముంబైలో కొత్త రేటు ఇప్పుడు రూ.852.50గా ఉంది. కోల్‌కతాలో ధర రూ.879 నుండి రూ.030 కు పెరిగింది. చెన్నైలో ఇది రూ.868.50 నుండి రూ.928.50 కు పెరిగింది.

మరోవైపు ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.1768.50 నుండి రూ.1883కి పెరిగింది. ముంబైలో కమర్షియల్ సిలెండర్ ధర రూ.1720.50 నుండి రూ.1835కి పెరిగింది. అలాగే కోల్‌కతాలో ధర రూ.1875.50 నుండి రూ.1990కి పెరిగింది, చెన్నైలో ఇది రూ.1929 నుండి రూ.2043.50కి పెరిగింది.

వాస్తవానికి గ్యాస్ సిలెండర్ ధరలు గతేడాది ఏప్రిల్ నుంచి మారలేదు. ఇరాన్ వార్ నేపథ్యంలో భారతదేశ ఇంధన సరఫరా, ఇంధన లభ్యతపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఈ పెంపు అమల్లో వచ్చింది. దీంతో దేశంలో ఇంధన కొరత లేదని, సరఫరాలో అంతరాయాల గురించి వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరి గతంలో చెప్పిన మాటలు నిజం కాదని తేలిపోయింది. మొత్తానికి అధిక ధరలతో అల్లాడిపోతున్న ప్రజలపై గ్యాస్ బండ కూడా పడింది. 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!