Wednesday, 25 March 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / జాతీయ వార్తలు

కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం ....

06 Mar 2026
12:20 PM
62

 * 16 ఏళ్లలోపు వారికి సోషల్‌ మీడియా  నిషేధం ...
* బడ్జెట్‌ సమావేశాల్లో ప్రకటించిన సీఎం సిద్దరామయ్య ....

BANGLORE :

కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు వారికి సోషల్‌ మీడియా వాడకాన్ని నిషేధించింది. మొబైల్‌ వాడకంతో పిల్లల్లో తలెత్తుతున్న ప్రతికూల ప్రభావాలను నివారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు. ఈరోజు కర్ణాటక బడ్జెట్‌ను సీఎం ప్రవేశపెట్టారు. అనంతరం అయన ఈ ప్రసంగంలో సోషల్‌ మీడియా బ్యాన్‌ విషయాన్ని ప్రకటించారు.

ఇప్పటికే ఈ అంశంపై అంతర్జాతీయంగా కూడా విస్తుృత చర్చ జరిగిన నేపధ్యంలో కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. చిన్నపిల్లల మానసిక ఆరోగ్యంపై సోషల్ మీడియా చూపిస్తున్న తీవ్రమైన ప్రభావమే ఈ చర్చకు ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించాలా? లేక నియంత్రణ సరిపోతుందా? అనే అంశంపై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇలాంటి ఒక చట్టాన్ని అమలు చేస్తోంది. యువతను హానికరమైన కంటెంట్ నుంచి, అధిక స్క్రీన్ టైమ్ బారిన పడకుండా రక్షించడం ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. అక్కడ ఈ చట్టాన్ని తీసుకురావడానికి ముందు ప్రభుత్వం పిల్లలు, వారి తల్లిదండ్రులతో విస్తృతంగా చర్చలు జరిపింది. 

మొత్తం మీద, నిషేధమా? లేక నియంత్రణనా? అనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, పిల్లలను సోషల్ మీడియా దుష్ప్రభావాల నుంచి కాపాడాలన్న విషయంలో మాత్రం అందరూ ఏకాభిప్రాయంతో ఉన్నారు. తల్లిదండ్రుల పర్యవేక్షణతో పాటు సోషల్ మీడియా సంస్థలు కూడా కఠినమైన వయోపరిమితి నిర్ధారణ వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంత వరకు సఫలీకృతమవుతుందొ వేచిచూడాలి. 

 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!