* మీ నాయకుడు క్రిస్టియన్స్..అందుకే మీకు శ్రీవారిపై నమ్మకం లేదు” ...
* మండలి ఛైర్మన్ మోషేన్ రాజుపై మంత్రి అచ్చెన్నాయుడు విమర్శలు ...
* అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై ఛైర్మన్ ఫైర్..వైసీపీ ధ్వజం ...
* తన తప్పును తెలుసుకుని క్షమాపణలు చెప్పిన మంత్రి అచ్చెన్నాయుడు
Ap budget Sessions :
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సమావేశాల్లో మతం మంటలు రేగాయి. మతంపై జరిగిన చర్చ తీవ్ర దుమారం రేపింది. సభా నిర్వహణలో భాగంగా మండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజును ఉద్దేశించి మంత్రి అచ్చెన్నాయుడు చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.
మండలిలో మతంపై జరిగిన చర్చ లో వివాదం.. :
మంత్రి అచ్చెన్నాయుడు:
మండలి చర్చలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఛైర్మన్‌ను ఉద్దేశించి “మీరు, మీ నాయకుడు (జగన్ మోహన్ రెడ్డి) క్రిస్టియన్స్.. అందుకే మీకు శ్రీవారిపై నమ్మకం లేదు” అంటూ విమర్శలు గుప్పించారు.
ఛైర్మన్ మేషేన్ రాజు తీవ్ర అభ్యంతరం :
ఈ వ్యాఖ్యలపై మోషేన్ రాజు తీవ్రంగా స్పందించారు. తాను హిందువునని, తన మతం గురించి తప్పుడు వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. తన వ్యక్తిగత మత విశ్వాసాలపై విమర్శలు చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
తప్పును తెలుసుకుని క్షమాపణలు చెప్పిన మంత్రి :
ఛైర్మన్ వివరణతో మంత్రి అచ్చెన్నాయుడు వెంటనే తన తప్పును తెలుసుకున్నారు. తాను చేసిన వ్యాఖ్యలు పొరపాటని అంగీకరిస్తూ, వాటిని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. తన వ్యాఖ్యల వల్ల మనస్తాపం చెందితే క్షమించాలని కోరడంతో వివాదం సద్దుమణిగింది.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం, ఆలయ పవిత్రతపై గత కొన్ని రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మండలిలో ఈ మతపరమైన విమర్శలు చోటుచేసుకున్నాయి. అయితే మంత్రి నారా లోకేష్ మండలి సమావేశంలో ఉండగానే మంత్రి అచ్చెన్నాయుడు ఈ వ్యాఖ్యలు చెయ్యడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.