* తక్షణం టిటిడి ఛైర్మన్ పదవి నుంచి తప్పించాలంటూ డిమాండ్లు....
* దేశంలో ఏ ఆలయ చైర్మన్‌కు సంబంధించిన వీడియోలు ఇలా బయటపడలేదంటూ విమర్శలు....
* చైర్మన్‌గా హుందాగా, రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన బాధ్యతను బీఆర్ నాయుడు పాటించలేదు...
* టీటీడీలో ఆవుల మరణాలు, తొక్కిసలాట ఘటనలు చైర్మన్ వైఫల్యమే...
* భగవద్గీతపై చులకనగా మాట్లాడిన వ్యక్తికి టీటీడీ చైర్మన్‌గా ఉండే అర్హత లేదు.
* ఇందులేఖ రాసిన లెటర్‌పై పూర్తి స్థాయి విచారణ జరపాలి.
* దేవుడిని రాజకీయాల్లోకి లాగకూడదు, ధార్మిక సంస్థల టీటీడీ ప్రతిష్టను కాపాడాలి.
EX MINISTER RK ROJA HOT COMMENTS :
టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడిపై వైసీపీ మాటల దాడి తీవ్రమవుతొంది. కల్తీ లడ్డూ వ్యవహారంతో వరుస వివాదాలతో తిరుమల హీటెక్కిపోతుండగా... ఇప్పుడు టిటిడి ఛైర్మన్ రాసలీలల వ్యవహారంతో మరింత హీటెక్కింది. టిటిడి ఛైర్మన్ ను తక్షణం ఛైర్మన్ పదవి నుంచి తప్పించాలంటూ డిమాండ్ ను ప్రధానంగా వైసీపీ తెరపైకి తెస్తొంది. నిన్న టిటిడి మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి .... నేడు మాజీ మంత్రి అర్ కే రోజా హాట్ కామెంట్స్ చేశారు.
మాజీ మంత్రి అర్ కే రోజా మాట్లాడుతూ భగవద్గీతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ పదవికి అనర్హుడని ధ్వజమెత్తారు. టీటీడీ చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇందు పరుపు తీసింది బిఆర్ నాయుడేనని. నిజం లేకపోతే బాబు, లోకేష్, పవన్లకు ఇందు ఎందుకు లేఖ రాశారు. బీఆర్ నాయుడికి మహిళలంటే గౌరవం లేదు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వీడియోలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి.
గతి తప్పిన టీటీడీ ఛైర్మన్ వ్యవహారశైలి :
ఆంధ్రప్రదేశ్‌లో ఈరోజు హాట్ టాపిక్ బీఆర్ నాయుడు, ఆయన వీడియోలు. ఆయనకు మద్దతుగా మాట్లాడుతున్న వారిని నేను ఒక్కటే అడుగుతున్నాను. దేశంలో ఏ ఆలయానికి సంబంధించిన చైర్మన్ వీడియోలు ఇలా బయటపడిన సందర్భాలు ఉన్నాయా? టీటీడీ చైర్మన్ వీడియోలు బయటకు వస్తే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది?. టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు ఎప్పటికీ ఆ హుందాతనాన్ని చూపలేదు. ఆయన ఇప్పటికీ ఒక ఛానల్ సీఈవోలాగా ప్రవర్తిస్తున్నారు. టీటీడీ చైర్మన్ అంటే రాజకీయాలకు దూరంగా ఉండాలి. కానీ ఆయన ప్రెస్‌మీట్లు చూస్తే బీఆర్ నాయుడి వ్యవహార శైలి ఏంటో అర్థమవుతుంది.
టీటీడీ పవిత్రతను దెబ్బ తీసిన బీఆర్ నాయుడు :
గతంలో ఎంతో మంది టీటీడీ చైర్మన్ పదవిలో ఉన్నారు. కానీ, ఎప్పుడూ ఇలాంటి అపశృతులు జరగలేదు. కానీ ఇప్పుడు టీటీడీ గోశాలలో గోవుల అకాల మరణాలు, తొక్కిసలాటలో భక్తుల ప్రాణాలు పోవడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. తిరుమల కొండ పేరు ప్రతిష్టలకు బీఆర్ నాయుడు భంగం కలిగించారు. భగవద్గీత హిందువుల పవిత్ర గ్రంథం. ప్రతిరోజూ ఒక పేజీ అయినా చదివి ఉన్నత విలువలతో జీవించాలని భావిస్తారు. కానీ బీఆర్ నాయుడుకు భగవద్గీతపై ఎలాంటి భక్తి లేదు. భగవద్గీతపై చులకనగా మాట్లాడే వ్యక్తికి టీటీడీ చైర్మన్‌గా ఉండే అర్హత ఉందా?. బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ అయ్యాక కొండపై మాంసం తిన్న ఘటనలు, మద్యం బాటిళ్ల లభ్యం, వైకుంఠ ఏకాదశి రోజున కూడా అపశృతులు చోటుచేసుకున్నాయి. టోకెన్లు ఇవ్వకపోవడం ఆయన చేతకానితనం. తిరుమల ప్రతిష్ట పెంచే ఒక్క పని అయినా బీఆర్ నాయుడు చేశారా?. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లడ్డూపై ఇష్టానుసారంగా మాట్లాడితే చైర్మన్‌గా ఒక్క మాటైనా మాట్లాడారా? హెరిటేజ్ తరఫున వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నారు. చంద్రబాబుకు నిత్యం భజన చేస్తున్నారు.
ఇందులేఖ లెటర్లపై విచారణ జరగాలి :
బీఆర్ నాయుడిపై ఏఐ వీడియోలు చేయాల్సిన అవసరం వైయస్సార్‌సీపీకి లేదు. ఆయనే మీడియా సమావేశంలో ఆ వీడియోలో తప్పు ఏముంది అని మాట్లాడారు. ఆమె కుటుంబంతో 30 ఏళ్ల అనుబంధం ఉందని చెప్పారు. ఆ వీడియోలు బయటకు ఎలా వచ్చాయో విచారణ జరగాలి. ఇందులేఖ 2024 ఎన్నికల ముందు చంద్రబాబు, లోకేష్, పవన్‌కళ్యాణ్‌కు లేఖలు రాశారు. ఆ లేఖపై పూర్తి స్థాయి విచారణ జరపాలి. చంద్రబాబు గుట్టు బీఆర్ నాయుడు చేతిలో ఉందా? అందుకే ఆయనపై చర్యలు తీసుకోవడం లేదా?. అశ్లీల వీడియోలపై ఇంతవరకు చంద్రబాబు, పవన్ స్పందించకపోవడం బాధాకరం. పవన్ నిజంగా హిందువు అయితే బీఆర్ నాయుడిని ఎందుకు కొనసాగిస్తున్నారో సమాధానం చెప్పాలి.
ఏకసభ్య కమిషన్ ఎందుకు? :
దేవుడిని రాజకీయాల్లోకి లాగవద్దని సుప్రీంకోర్టు ఆదేశించినా వినకుండా చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ఆరోపణలు చేశారు. సీబీఐ, సిట్ దర్యాప్తులో లడ్డూలో జంతు కొవ్వు కల్తీ కాలేదని తేలినా ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడం సిగ్గుచేటు. ఎలాగోలా ఈ వ్యవహారంలో వైయస్సార్‌సీపీ వారిని ఇరికించేందుకే చంద్రబాబు ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారు. వీటన్నింటి నేపథ్యంలో ప్రతిష్టాత్మకమైన టీటీడీ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువుపై ఉందని, బీఆర్ నాయుడిని వెంటనే ఛైర్మన్ పదవి నుంచి తొలగించాలని ఆర్‌కె రోజా డిమాండ్ చేశారు.