Monday, 23 March 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / అంతర్జాతీయ వార్తలు

ఖమేనీని హతమార్చేందుకు ఇజ్రాయెల్ సంచలన ప్లాన్.. !

03 Mar 2026
03:59 PM
70


* ట్రాఫిక్ కెమెరా వ్యవస్థ హ్యాక్ ..మొబైల్ టవర్ల నిర్వీర్యం ...
* భద్రతా సిబ్బంది కదలికల పర్యవేక్షణ ..
* నేటికి టెహ్రాన్‌లో చాలావరకు ట్రాఫిక్ కెమెరాలు ఇజ్రాయెల్ నిఘాలోనే ... 

IRAN SUPREME  KHAMENI MORDER  :


ఇరాన్ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేని మృతి ఇప్పటికి ఎవరికి అంతుబట్టడం లేదు. అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేసి ఇరాన్ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేని హతమార్చిన ఘటన అందరిని ఆశ్చర్యపరిచింది. అసలు ఖమేనీని అంత కచ్చితంగా టార్గెట్‌ చేసి ఎలా హతమార్చాయనే దానిపై ఇప్పటికీ సందేహం నెలకొంది. దీనికి సంబంధించి తాజాగా ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. మొదటగా ఇజ్రాయెల్ చాలా ఏళ్లుగా టెహ్రాన్‌లోని ట్రాఫిక్‌ కెమెరా వ్యవస్థను హ్యక్ చేసింది. మొబైల్ నెట్‌వర్క్‌ యాక్సెస్‌ కూడా పొందింది. 

ఇరాన్ సుప్రీం లీడర్ అలా ఖమేనీ, అతని వెంట ఉండే భద్రతా సిబ్బంది కదలికలను పర్యవేక్షించాయి. టెహ్రాన్‌లో ఉన్న చాలావరకు ట్రాఫిక్ కెమెరాలు ఇజ్రాయెల్ నిఘాలో ఉన్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన ఫుటేజ్‌ను ఎన్‌క్రిప్ట్ చేసి విదేశాలకు పంపించారు. ఇది ఖమేనీ కదలికలకు సంబంధించి పూర్తి నమూనాను సృష్టించారు. దీనిద్వారా ఆయన ఎప్పుడు, ఎక్కడికి వెళ్లారు ? ఏ మార్గంలో వెళ్లారు ? ఎవరితో ఉన్నారనేది ప్రతీది కూడా రికార్డు చేయగలిగారు. ఇజ్రాయెల్ నిఘా విభాగమైన మొసాద్‌ ఈ ఆపరేషన్‌లో కీలకంగా పనిచేసిందని సమాచారం. 

ఖమేనీపై దాడి చేయడానికి కొన్ని గంటల ముందు, ఆయన కార్యాలయం సమీపంలోని మొబైల్ టవర్లను ఇజ్రాయెల్ నిర్వీర్యం చేసినట్లు తెలుస్తోంది.  దీనివల్ల ఆయన భద్రతా సిబ్బందికి ఎలాంటి హెచ్చరికలు అందకపోవడంతో అమెరికా, ఇజ్రాయెల్ విజయవంతంగా దాడులు చేయగలిగాయి.  

 Article Image

( పైన దాడికి ముందు.... కింద చిత్రం దాడి అనంతరం  )

 


నగరాల్లో ఏర్పాటు చేసే సీసీటీవీ కెమెరాలు కేవలం ట్రాఫిక్ నియంత్రణ కోసమే కాదు. వాటిని నిఘా సాధానాలుగా కూడా వినియోగిస్తారు. ఇజ్రాయెల్ ఇలాంటి  కార్యాచరణ ప్రణాళికనే రూపొందించింది. తద్వారా ఖమేనీ సంబంధించిన కదలికలు, భద్రతను విశ్లేషించాయి.  ఇంకేముంది... ఖచ్చితమైన సమాచారంతో ఖమేనీని అంతమెందించాయి. కానీ ఇంత ప్రకడ్బంధీగా వ్యూహరచన చేసి ఖమేనీని అంతమెంచిన ఘటన అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. 

ఇజ్రాయెల్ అధునాతన సిగ్నల్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ 8200, మొసాద్ నియమించిన గూఢచారులు, సైనిక ఇంటెలిజెన్స్ రోజువారీ బ్రీఫ్‌లలో సేకరించి డేటా ఫలితంగా ఇరాన్ నిఘా చిత్రం సాధ్యమైందని ఇజ్రాయెల్ నిఘా వర్గాలు తెలిపాయి. 

 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!