అవసరమైన అయుధాలు అందజేస్తాం ...
ఇరాన్ ను కాపాడుకుంటామన్న చైనా ...
CHINA :
మిడిల్ ఈస్ట్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తీవ్రమవుతున్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా విరుచుకుపడుతు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. మరోవైపు ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేస్తోంది. అయితే తాజాగా యుద్ధంలోకి చైనా సైతం ఎంట్రీ ఇచ్చింది. ఇరాన్‌కు మద్దతు ప్రకటించింది. ఆ దేశ విదేశాంగ మంత్రి సయేద్ అబ్బాస్‌తో చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్‌యి ఫోన్‌లో మాట్లాడారు. ఈ మేరకు యుద్ధంలో అవసరమైన ఆయుధాలు అందిస్తామని.. ఇరాన్‌ను కాపాడుకుంటామని.. హామీ ఇచ్చారు. ఇప్పటికే ఈ యుద్దంలో ఇరాన్‌కు రష్యా, నార్త్ కొరియా, యెమెన్ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్తగా చైనా కూడా రంగంలోకి దిగడంతో ఈ యుద్దం మరింత తీవ్రమయ్యే పరిస్ధితులు కనపడుతున్నాయి.