- అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఒక మహిళను వేధించడమే కాకుండా...
*అమెపై తన తల్లితో కేసు పెట్టించడంపై అంక్షింతలు ...
* కేసు చెల్లదంటూ ఆగ్రహం ...

అమరావతి :
తిరుపతి జిల్లా రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీథర్ కు హైకోర్టు ఎదురుదెబ్బ తగిలింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఒక మహిళను వేధించి పెళ్లి చేసుకుంటానని మోసం చెయ్యడం కాకుండా... అమెపై తన తల్లితో కేసు పెట్టించడంపై అంక్షింతలు వేసింది. తన తల్లితో మహిళపై పెట్టించిన కేసు చెల్లదంటూ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేస్తూ...ఆగ్రహం వ్యక్తం చేసింది.
జనసేన ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్ ఏడాదిన్నరగా తనపై అత్యాచారం చేస్తున్నారంటూ ప్రభుత్వ ఉద్యోగి వీణా అనే మహిళ వీడియో విడుదల చేశారు. అయితే... ఆ మహిళే తన కుమారుడిని వేధిస్తోందంటూ ఎమ్మెల్యే తల్లి అరవ ప్రమీల మీడియాకు తెలిపారు. తిరుపతి జిల్లా రైల్వేకోడూరు ఎమ్మెల్యేగా అరవ శ్రీధర్ గెలిచినప్పుడు తాను అభినందిస్తూ ఫేస్‌బుక్‌లో మెసేజ్ పెట్టానని... ఆ తర్వాత ఆయన తనతో ఫోన్‌లో మాట్లాడారని సదరు ఉద్యోగిని వీడియోలో పేర్కొన్నారు. 2024 జూలైలో తనను కారులో ఎక్కించుకుని వెళ్లి, రాజంపేట ప్రాంతంలో అత్యాచారం చేశారని ఆరోపించారు. ఆ తర్వాత తనపై అనేకసార్లు అత్యాచారం చేశారని ఆరోపించారు. విడాకులు ఇవ్వాలంటూ తన భర్తను కూడా బెదిరించారని చెప్పారు. ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో... మంగళవారం రాత్రి పొద్దుపోయాక ఎమ్మెల్యే శ్రీధర్ ఒక వీడియో విడుదల చేశారు. ‘‘నేను ఎమ్మెల్యే కావడానికి ముందు మూడేళ్లు సర్పంచుగా పని చేశా. నాపై ఎలాంటి ఆరోపణలూ రాలేదు. ఇప్పుడు నాపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. ఫేక్ వీడియోలను ప్రచారం చేస్తున్న వారితో పాటు వారి వెనకున్న వారిని చట్టపరంగా ఎదుర్కొంటా. ఆ మహిళ గత ఆరు నెలలుగా నన్ను వేధిస్తుంటే మా అమ్మ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు’’ అని తెలిపారు.
అయితే ఆ మహిళ ఆరోపణలు సంచలనం సృష్టించడంతో... ఎమ్మెల్యే తల్లి అరవ ప్రమీల స్పందిస్తూ ‘రూ.25 కోట్లు ఇవ్వకుంటే మీ కొడుకు జీవితాన్ని నాశనం చేస్తామని ఆ మహిళ బెదిరించిందని, బంధువునంటూ మా ఇంటికి వచ్చి, నా కుమారుడితో పరిచయం పెంచుకుని తరచూ ఫోన్‌లో మాట్లాడుతూ వివాహం చేసుకోవాలని ఒత్తిడి పెంచిందన్నారు. కొందరు వైసీపీ నాయకులు పనిగట్టుకుని ఆమె ద్వారా మమ్మల్ని మానసిక హింసకు గురి చేశారు. ఇటీవల ఆమె మా ఇంటికి వచ్చి గొడవ చేయడంతో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామని, రైల్వే కోడూరు పోలీసులు ఆమెపై ఈనెల 7వ తేదీన కేసు నమోదు చేశారని చెప్పారు. ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. నా కుమారుడిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న ఆమెపై న్యాయ పోరాటం చేస్తాం’’ అని ప్రమీల తెలిపారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై ఆ ఉద్యోగిని చేసిన ఆరోపణలు అవాస్తమని, త్వరలో ఆమె బాగోతాన్ని బయటపెడతామని చెప్పారు. అనంతరం మహిళా ఉద్యోగి వీణపై ఎమ్మెల్యే తల్లి ప్రమీల హైకోర్టులో కేసు సైతం వేసింది.
MLA అరవ శ్రీధర్ కు హైకోర్టులో చుక్కెదురు :
మహిళా ఉద్యోగి వీణ అరోపణలపై ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తల్లి ప్రమీల హైకోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోమవారం హైకోర్టులో కేసు విచారణకు రాగా...విచారించిన హైకోర్టు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కు అక్షింతలు వేసింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఒక మహిళను వేధించి పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మోసం చేసి ,, ఆమెతో అసభ్యకరమైన వీడియో కాల్ లు చేసి,, ఏకంగా అసెంబ్లీ లోనే అసభ్యకర వీడియో కాల్ లు చేసి తనకు 5 సార్లు అబార్షన్ చేయించి చివరికి ఆమె మీదనే అధికారం అడ్డం పెట్టుకుని కేసు పెడతారా అంటూ MLA అరవ శ్రీధర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. దాదాపు 6 నెలలు నుండీ ఆమె మోసం చేస్తోందని తల్లితో కంప్లైంట్ ఇచ్చారని, అంత మోసపోయే బలహీన వ్యక్తి MLA గా ఎలా ఉండగలరంటూ కోర్టు ప్రశ్నించింది. ఆ MLA కి నోరు లేదా,, ఆ MLA కి చేతులు లేవా కంప్లైంట్ ఇవ్వడానికి అంటూ MLA ను గట్టిగా నిలదీసింది. ఆమె మీద పెట్టిన కేసు చెల్లదు అంటూ వ్యాఖ్యలు చేసిన హైకోర్టు. ఈ పరిణామాల తర్వాత ఆమె ఏలా వ్యవహరిస్తుంది అనేది చూడాల్సిన విషయం. ఆమె జనసేన MLA మీద తన పోరాటాన్ని కొనసాగిస్తుందా?? లేక ఇంతటి తో సైలెంట్ అవుతుందా అనేది వేచిచూడాలి..