టెహ్రాన్ :
ఇజ్రాయెల్ గత శనివారం నాడు తొలిసారి టెహ్రాన్‌పై జరిపిన దాడుల్లో తీవ్రంగా గాయపడిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ భార్య మన్సూరే ఖోజాస్తే సోమవారం మరణించినట్టు ఆదేశ అధికారిక వార్తా సంస్థ ప్రచురించింది. ఖమేనీ నివాసంపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటికే ఖమేనీతో పాటు ఆయన కుమార్తె, అల్లుడు, మనుమరాలు మృతి చెందారు. మన్సూరే ఖోజాస్తే మాత్రం తీవ్ర గాయాలపాలైంది. కానీ అమె చివరకు సోమవారం మృతి చెందడం ఇరాన్ వాసులను కలచివేసింది. ఖమేనీ మృతితో ఇప్పటికే ఉద్రిక్తతలు చోటుచేసుకోగా, మన్సూర్ ఖోజాస్తే కూడా మరణించడంతో టెహ్రాన్ నాయకత్వంపై ఒత్తిడి పెరిగి ఉద్రితకలు మరింత పెరిగే అవకాశాలున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.